Home / ఎడిటోరియల్స్ / సింహం(జ‌న‌సేనాని) సైలెంట్‌గా ఉంటే., వేట ముగిసిన‌ట్టు కాదు..

సింహం(జ‌న‌సేనాని) సైలెంట్‌గా ఉంటే., వేట ముగిసిన‌ట్టు కాదు..

సింహం సైలెంట్ అయితే వేట ముగిసిన‌ట్టు కాదు.. విశ్రాంతి అస‌లే కాదు.. దెబ్బ కొట్టేందుకు స‌రికొత్త వ్యూహం రిచిస్తోంద‌ని అర్ధం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా పోరు వ్య‌వ‌హారంలోనూ., గోదావ‌రి ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలోనూ జ‌న‌సేనాని, ఆయ‌న సైన్యం చేస్తున్న పోరాటం కొన‌సాగుతుంటే., స‌ర్కారీ అనుంగ మీడియా వీటిని చిలువ‌లు ప‌లువ‌లు చేస్తూ., క‌థ ముగిసింద‌ని చిత్రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. కాకినాడ స‌భ త‌ర్వాత అనంత వేదిక‌గా జ‌రిగిన సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ‌కు మ‌ధ్య కొంత గ్యాప్ రాగానే., ఇలాంటి వ్యాఖ్యానాలే విన‌బ‌డ్డాయి.. విలువ‌లేని ప్యాకేజీ ప్ర‌క‌టించేసి చేతులు దులుపుకున్న కేంద్రం., దాన్ని ఆహ్వానించి జ‌నాన్ని మ‌సిపూసి మారేడుకాయ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం హోదాని ముగిసిన అధ్యాయంగా మార్చేశాయి.. ప‌వ‌న్ అనంత‌లో గొంతు చేదు నిజాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డంతో., తేలుకుట్టిన దొంగ చందాన్న ఇందులో ఒక్క‌రూ కిక్కురు మ‌న‌లేదు.. కాకినాడ స‌భ అనంత‌రం పాచిపోయిన ల‌డ్డూని తిరుప‌తి ల‌డ్డూతో పోల్చిన ఆ నేత‌లెవ్వ‌రూ., అనంత స‌భ త‌ర్వాత నోరు తెర‌వ‌లేదు..

ఇక అప్పుడు దేశ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌ధ్యంలో., జై జ‌వాన్ అన్న నినాదానికి విలువిచ్చి ప‌వ‌న్ టైం తీసుకుంటే., దాన్ని కూడా ఆయ‌న‌పై విమ‌ర్శలు సంధించేందుకు ఆయుధంగా చేసుకున్నారు ప్ర‌త్య‌ర్ధులు.. ఇక ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా అన్న స‌మ‌యంలో త‌ప్ప ఆ విషయం గుర్తుకురాని విప‌క్ష నేత‌., త‌న ప‌త్రిక సాక్షిగా జ‌న‌సేనాని మాట్లాడిన ప్ర‌తి అంశాన్ని బూత‌ద్దంలో పెట్టి చూపే ప్ర‌య‌త్నం చేసి త‌న అహాన్ని సంతృప్తి ప‌రుచుకుంటున్నారు.. ఇప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌న‌సేనాని బ‌య‌టికి వ‌చ్చేందుకు ముహుర్తం పెట్టుకున్న స‌మ‌యంలో పొరుగురాష్ట్రం త‌మిళ‌నాడు సిఎం జ‌య‌ల‌లిత త‌నువు చాలించారు.. అమెపై గౌర‌వంతో ఆయ‌న ఆ ప‌ర్య‌ట‌నా వాయిదా వేసుకున్నారు..

అయితే ఈ గ్యాప్‌లో ఓ స‌రికొత్త ప్ర‌చారానికి అధికార పార్టీ శ్రీకారం చుట్టింది.. అదేంటో తెలుసా.. ప్ర‌త్యేక హోదా నినాదం ఇక తెర‌మ‌రుగైన‌ట్టేనంట‌.. భారీ ఎత్తున జీతాలిచ్చి మ‌రీ త‌మ‌కు అనుకూలంగా ప‌చ్చి అబ‌ద్దాలు రాయించుకునేందుకు పాత్రికేయుల్ని పెట్టుకున్న పాల‌కులు., ప‌వ‌ర్‌స్టార్ పై కార‌ణాల‌తో కాస్త గ్యాప్ తీసుకోవ‌డంతో యుద్దం ముగిసింది అనే ప్ర‌చారానికి ప్రాచుర్యం క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తోంది.. మ‌రి ఆది నుంచి ప్ర‌త్యేక హోదా పోరాటానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చెప్పుకుంటున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఎక్క‌డికి వెళ్లారు.. హోదా పోరు క‌నిపెట్టిందేనేను అన్న ఆయ‌న త‌న వాణిని స‌ర్కారుకి ధీటుగా ఎందుకు వినిపించ‌లేక‌పోతున్నారు అనేది గ‌మ‌నార్హం.. ఈయ‌న‌గారు ప‌వ‌న్ బ‌య‌టికి వ‌స్తున్నార‌న్న‌ప్పుడు మాత్ర‌మే ఆయ‌న‌కి వ‌చ్చే క్రేజీని హైర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తార‌న్న‌ది ఇక్క‌డ గుర్తించాల్సిన పాయింటు..

ఇక స‌ర్కారు విషయానికి వ‌స్తే.. జ‌న‌సింహం జ‌నంలోకి రావ‌డం కాస్త ఆల‌స్య‌మైన ప్ర‌తిసారీ పాడే పాటే ఇది.. ఈ స‌మ‌యంలో మాత్ర‌మే వారికి కాస్త గుండెనిబ్బ‌రం వ‌స్తుంది.. కంటి నిండా కునుకుప‌డుతుంది.. అలాంట‌ప్పుడే ఇలా అస‌లు విషయాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించే ఆలోచ‌న‌లు చేయ‌డానికి టైం దొరుకుతుంది.. మొన్న‌టి వ‌ర‌కు ఏబీఎన్ స‌ర్వే పేరుతో ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ని ప‌క్క‌కి మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేసిన పాల‌కులు., ఇప్పుడు అది కాస్త మ‌రిచిపోయార‌న్న ఉబ‌లాటంతో కొత్త ప్ర‌చారానికి శ్రీకారం చుట్టేసింది.. అయితే ప్ర‌త్యేక హోదా ఉద్య‌మానికి శ్రీకారం చుట్టిన తొలి రోజు ఏ ప‌లుకైతే ప‌లికారో., అదే మాట‌కు జ‌న‌సేనాని క‌ట్టుబ‌డి ఉన్నారు.. మ‌డం తిప్పం., మాట త‌ప్పం అన్న‌మాట ఇంకా జ‌నం చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది.. స‌ముద్ర‌పు అల‌ల హోరుని త‌ల‌పించే ఆ పోరు హోరుని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు.. అనంత స‌భ‌లో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్యాకేజీ గుట్టు ర‌ట్టు చేశారు.. వ‌చ్చే స‌భ కోసం ఆయ‌న రెఢీ అవుతున్నారు.. అక్క‌డ చెప్పే నిజాలు త‌ట్టుకోవ‌డానికి రెడీగా ఉండండి.. ఈ లోపే తొంద‌ర‌ప‌డితే., త‌ర్వాత మ‌ళ్లీ భుజాలు త‌డుముకోక త‌ప్పుదు..

Share This:

1,340 views

About Syamkumar Lebaka

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + eleven =