Home / ఎడిటోరియల్స్ / సింహ‌పురిలోనూ జ‌న‌సేనానికి అతి సామాన్య బ‌స‌.. శేషారెడ్డి భ‌వ‌న్‌లో ఏర్పాట్లు..

సింహ‌పురిలోనూ జ‌న‌సేనానికి అతి సామాన్య బ‌స‌.. శేషారెడ్డి భ‌వ‌న్‌లో ఏర్పాట్లు..

దేశ వ్యాప్తంగా సుప్ర‌సిద్ధ‌మైన నెల్లూరు రొట్టెల పండుగ‌లో పాల్గొనేందుకు రానున్న జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఇక్క‌డా అతి సామాన్య ఏర్పాట్ల మ‌ధ్య బ‌స చేయ‌నున్నారు.. పోరాట యాత్ర ఆధ్యంతం సామాన్య జీవితాన్ని సాగిస్తూ., మొమెరియ‌ల్ హాళ్లు., చిన్న చిన్న ఫంక్ష‌న్ హాళ్ల‌లో విడిది చేస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్న ఆయ‌న‌., నెల్లూరులో కూడా ఎలాంటి హ‌డావిడి లేకుండా అతి సామాన్యుడికి స‌రిప‌డే ఏర్పాట్లు మాత్ర‌మే చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కి సూచించిన‌ట్టు తెలుస్తోంది.. దీంతో విశాఖ అంబేద్క‌ర్ భ‌వ‌న్‌కి ఇంచు మించు స‌రితూగే జెట్టి శేషారెడ్డి భ‌వ‌న్‌ని జ‌న‌సేనాని కోసం సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.. శేషారెడ్డి భ‌వ‌న్‌లోని ఓ చిన్న గ‌దిలో ప‌వ‌న్ ఉండ‌నున్నారు.. మ‌ధ్య త‌ర‌గ‌తి వినియోగించే అతి సామాన్య‌మైన సింగిల్ కాట్ బెడ్‌పై ఆయ‌న సేద తీర‌నున్నారు.. ఏసీ లాంటి సౌక‌ర్యాలకి సైతం తాను దూరంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు జ‌న‌సేన అధినేత పార్టీ వ‌ర్గాల‌కి ప‌దే ప‌దే చెబుతున్న‌ట్టు స‌మాచారం.. ఈ నేప‌ధ్యంలో ల‌గ్జ‌రీ కుష‌న్లు, అత్యాధునిక సౌక‌ర్యాల‌తో కూడిన స్టార్ హోట‌ళ్లు నెల్లూరు న‌గ‌రంలో ఎన్నో వున్న‌ప్ప‌టికీ., ప‌వ‌న్ కోసం శేషారెడ్డి భ‌వ‌న్‌ని పార్టీ శ్రేణులు సిద్ధం చేశారు..

ఆదివారం మ‌ధ్యాహ్నం రొట్టె కోసం ప‌వ‌న్‌..
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నెల్లూరు ప‌ర్య‌ట‌న‌కి సంబంధించి శుక్ర‌వారం అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ., ఏర్పాట్ల నేప‌ధ్యంలో స్ధానికంగా షెడ్యూల్‌పై ఎప్ప‌టి నుంచో చ‌ర్చ జ‌రుగుతోంది.. నెల్లూరు ష‌హీద్ ద‌ర్గా వ‌ద్ద జ‌రిగే రొట్టెల పండుగ‌కి ఎంతో ప్రాసిస్త్యం ఉన్న నేప‌ధ్యంలో., మ‌తాల‌కి అతీతంగా ల‌క్ష‌లాది మంది అక్క‌డ రొట్టెలు అందుకునేందుకు ఎగ‌బ‌డ‌తారు.. ఇక్క‌డ రొట్టె అందుకునేందుకే జ‌న‌సేనాని కూడా వ‌స్తుండ‌డంతో., ఆయ‌న్ని చూసేందుక జ‌నం ఎగ‌బ‌డ‌డం., తొక్కిస‌లాట‌ల‌కి కూడా అవ‌కాశాలు వుండ‌డంతో., ఏర్పాట్లు క‌ట్టుదిట్టంగా చేస్తున్నారు.. జ‌నం ర‌ద్దీ కాస్త త‌క్కువ‌గా ఉండే స‌మ‌యంలో అంటే 23వ తేదీ, ఆదివారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, త‌న మిత్రుడు సినీ న‌టుడు అలీతో క‌ల‌సి ష‌హీద్ ద‌ర్గాకి రానున్న‌ట్టు తెలుస్తోంది.. ఇక్క‌డ రొట్టెను అందుకుని అక్క‌డి నుంచి నేరుగా కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి హాజ‌రవుతారు..

నెల్లూరులో జ‌న‌సేన జోరు..
నెల్లూరు జిల్లాకి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రానున్న నేప‌ధ్యంలో జ‌న‌సేన శ్రేణ‌ల్లో కూడా నూత‌నోత్సాహం వెల్లివిరుస్తోంది.. జ‌న‌సేనానికి జిల్లాతో వున్న అనుబంధం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే., పార్టీలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోనున్న‌ట్టు టాక్‌.. జ‌న‌సేన‌లోకి భారీ ఎత్తున చేరిక‌లు ఉండ‌నున్న‌ట్టు., అదీ అధికార‌-ప్ర‌తిప‌క్షాల నెత్తిన పిడుగు ప‌డే స్థాయిలో ఈ చేరిక‌లు ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.. కొత్త నాయ‌క‌త్వం పార్టీలోకి వ‌స్తే., జిల్లాలో మ‌రింత బ‌లంగా పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని జ‌న‌సైనికులు ఆశాబావం వ్య‌క్తం చేస్తున్నారు.. ఇప్ప‌టికే చిత్తూరు జిల్లాలో ప్ర‌కంప‌న‌లు పుట్ట‌గా., జ‌న‌సేనాని రాక నెల్లూరు రాజ‌కీయముఖ‌చిత్రం మారిపోనేంది..

Share This:

4,122 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − eleven =