Home / జన సేన / సింహ‌పురిలో జ‌న‌సైన్య ప్ర‌స్థానం.. న‌వ‌నాయ‌క‌త్వ ప్ర‌భంజ‌నం..

సింహ‌పురిలో జ‌న‌సైన్య ప్ర‌స్థానం.. న‌వ‌నాయ‌క‌త్వ ప్ర‌భంజ‌నం..

రాజ‌కీయం అంటే కొంద‌రికి మాత్ర‌మే కేటాయించిన వృత్తి కాదు.. వంశ‌పారంప‌ర్యంగా సంక్ర‌మించే రాచ‌రిక‌మూ కాదు.. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా, ప్ర‌జాసేవ చేయ‌డానికి నిర్ధేశించ‌బ‌డిందే రాజ‌కీయం.. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచి., అవ‌స‌రం తీరాక వారి క‌ష్టాన్ని కొల్ల‌గొడుతూ., ఆ జ‌నాన్నే స‌మ‌స్య‌ల్లోకి నెడుతున్న నాయ‌కుల‌ని రాజ‌కీయాల నుంచి దూరంగా త‌ర‌మికొట్టేందుకు.. నిబ‌ద్ద‌త‌, నీతి, నిజాయితీతో ప్ర‌జాసేవ‌కు క‌ట్టుబ‌డిన న‌వ‌నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించేందుకు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేప‌ట్టిన మ‌హాయ‌జ్ఞం సింహ‌పురిలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.. తొలి రోజు జ‌న‌సేన ఎంపిక శిభిరానికి వంద‌లాది మంది కుల‌,మ‌త‌,వ‌యో బేధాలు లేకుండా త‌ర‌లివ‌చ్చారు.. కేవ‌లం జ‌న‌సేన కోసం మాత్ర‌మే కాదు.. జ‌న‌సేనుడి కోసం., జ‌నానికి ఏదో చేయ‌డం కోసం.. గాడి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ను స‌రి చేస్తామంటూ ముందుకి వ‌చ్చారు..

సింహ‌పురి వేదిక‌గా రాజ‌కీయ నాయ‌కుల ముసుగులో జ‌రుగుతున్న ఆగ‌డాల‌ను., నెల్లూరు జిల్లాలో జ‌నం ప‌డుతున్న క‌ష్టాల‌ను న‌వ‌త‌రం వ‌క్త‌లు ఎత్తిచూపారు.. అవ‌కాశం వ‌స్తే.. మేమూ సంచ‌ల‌నాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తేల్చి చెప్పారు..

నెల్లూరు జిల్లా నుంచి ఆన్‌లైన్ ద్వారా మొత్తం రెండు వేల ద‌ర‌ఖాస్తులు రాగా., మొత్తం 8 బ్యాచ్‌లుగా విభ‌జించి అర్హ‌త ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన అధికార ప్ర‌తినిధులు నిర్ణియించారు.. అయితే వివిధ కార‌ణాల వ‌ల్ల ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోలేని వారు., తొలి రోజు నేరుగా ఎన్‌రోల్ చేసుకునేందుకు జ‌న‌సేన శిభిరానికి భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు.. శిభిరాల్లో పాల్గొనే ప్ర‌తి ఒక్క‌రు జ‌న‌సేన పార్టీ నిర్మాణంలో భాగ‌స్వాముల‌వుతార‌ని., పార్టీ అధినేత ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌సి దిశానిర్ధేశం చేస్తార‌ని మీడియా విభాగం హెడ్ హ‌రిప్రసాద్‌, పార్టీ ఉపాధ్య‌క్షుడు మ‌హేంద‌ర్‌రెడ్డిలు తెలిపారు..బుధ‌, గురువారాల్లో ప్ర‌కాశం జిల్లాకి సంబంధించి ఒంగోలులో ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతుంది..

Share This:

About Syamkumar Lebaka

Check Also

సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు రేపిన పోల్‌.. దెబ్బ‌కి రెండు పిట్ల‌ల్ని కొట్టిన ఆన్‌లైన్ స‌ర్వే..

దొంగ‌లు..దొంగ‌లు ఊళ్లు పంచుకుంటే.. పోలిటీషియ‌న్సేమో మీడియాని పంచేసుకున్నారు.. ప‌చ్చ మీడియా ప్ర‌తిప‌చ్చ‌(క్ష‌) మీడియాగా మారి రాష్ట్ర ప్ర‌జ‌ల మేలు కోరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + 11 =

%d bloggers like this: