Home / పోరు బాట / సిఎం గారు జ‌న‌సేనుడి డిమాండ్ల‌లో రెండు వ‌దిలేశారు…

సిఎం గారు జ‌న‌సేనుడి డిమాండ్ల‌లో రెండు వ‌దిలేశారు…

img_9298-copy

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌రిలోకి దిగితే ఎంత క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కైనా బ‌దులు దొర‌కాల్సిందే., ఎలాంటి స‌మ‌స్య అయినా ప‌రిష్క‌రింప బ‌డాల్సిందే.. ఉద్దానం స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వేలాది మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది.. ఉద్దానం నెఫ్రోప‌తి దెబ్బ‌కి గ‌డ‌చిన 20 ఏళ్ల‌లో సుమారు 20 వేల మంది మృత్యువు ఓడికి చేరుకున్నారు.. ఇంకా వేలాది మంది ఈ మ‌హ‌మ్మారి భారిన ప‌డి నిత్యం మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు.. అయినా జ‌న‌సేనాని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌దిలే వ‌ర‌కు., ఈ స‌మ‌స్య‌ను తెర‌పైకి తెచ్చిన నాయ‌కుడు లేడు.. ప‌రిష్కారం వైపు అడుగులు వేసిన ప్ర‌భుత్వాలు లేవు.. వ్యాధి ఎలా వ‌స్తుందో క‌నిపెట్ట‌లేక‌పోయారు.. కానీ ఎందు వ‌ల్ల వ‌స్తుంది అనే అంశంపై ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌లు ఉన్నాయి.. నీటిలో సిలికాన్ మోతాదుకి మించి క‌ల‌వ‌డం ప్ర‌ధాన కార‌ణం అని తేలింది.. ఈ నీటికి బ‌దులు., అంద‌రికీ ర‌క్షిత మంచినీటిని అందిస్తే., స‌మ‌స్య‌పై పోరాటంలో అతి పెద్ద విజ‌యం సాధించిన‌ట్టే.. కానీ ప‌వ‌న్ వెళ్లి చెప్పే వ‌ర‌కు గ‌డ‌చిన రెండు ద‌శాబ్దాల కాలంలో ఏ నాయ‌కుడూ., ఏ ప్ర‌భుత్వం ఇంత సీరియ‌స్ స‌మ‌స్య‌ని సైతం సిల్లీగా తీసి పారేశాయి.. మొత్తానికి జ‌న‌సేనాని హెచ్చ‌రిక‌ల పుణ్య‌మాఅని స‌ర్కారు క‌ళ్లు తెరిచింది.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ముందుకి వ‌చ్చింది…

orp orpo

అయితే అన్నీ ఓకేగానీ.. 3వ తేదీన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన డిమాండ్ల‌లో రెండు ప్ర‌ధాన‌మైన వాటిని సిఎం చంద్ర‌బాబునాయుడు గారు వ‌దిలేశారు.. స‌మ‌యానికి అవి గుర్తుకు రాలేదో., ఏయో వాటిని అస‌లు ప్ర‌స్తావించ‌లేదు.. అందులో ఒక‌టి కిడ్నీ బాధిత ప్రాంతాల్లో నెఫ్రాల‌జిస్టుల నియామ‌కం., అదీ డిఎం సూప‌ర్ స్పెషాలిటీ స్థాయి వైద్యుల నియామ‌కం.. దీనిపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాలేదు.. ఇక ఉద్దానం నెఫ్రోప‌తి దెబ్బ‌కి త‌ల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ‌లుగా మారిన చిన్నారుల‌కి పున‌రావాసం ఏర్పాటు చేయ‌డం.. బాబు గారూ ఈ రెండింటిపై కూడా ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసి ఉంటే., ఉద్దానం స‌మ‌స్య‌పై జ‌న‌సేనాని విజ‌యం సంపూర్ణ‌మ‌యిన‌ట్టు ఉండేది.. ఈ రెండూ కూడా ప‌రిష్క‌రించండి..

Share This:

About Syamkumar Lebaka

Check Also

capture

జ‌నం కోసం జ‌న‌సైన్యం పోరుబాట‌.. సిక్కోలు బ‌ల‌స‌ల రేవు వంతెన కోసం ఉద్య‌మం..

డ‌బ్బు సంపాద‌న‌లో నాకు మ‌క్కువ లేదు.. డ‌బ్బంటే ఇష్ట‌మూ లేదు.. స‌మ‌స్య‌లంటే ఇష్టం.. వాటిని ప‌రిష్క‌రించ‌డం అంటే ప్రాణం.. ప్ర‌జ‌ల్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 8 =