Home / పోరు బాట / సిద్ధ‌మ‌వుతున్న అనంత క‌థ‌న‌”రంగం”.. ఏపీలో స‌భ సెగ‌లు..

సిద్ధ‌మ‌వుతున్న అనంత క‌థ‌న‌”రంగం”.. ఏపీలో స‌భ సెగ‌లు..

14937437_1099254666856467_4665398369140136842_nజ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అనంత‌పురం స‌భ‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.. జూనియ‌ర్ కాలేజ్ గ్రౌండ్‌లో వేదిక‌, ప్రాంగ‌ణానికి సంబంధించి నిర్మాణం ప‌నులు పూర్తి కావ‌చ్చాయి.. ల‌క్ష‌లాధిగా త‌ర‌లివ‌చ్చే జ‌న‌స‌మూహానికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తున్నారు.. పార్టీ అధికార ప్ర‌తినిధి రాఘ‌వ‌య్య ద‌గ్గ‌రుండి ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్నారు..ఇక స్వాగ‌త స‌త్కారాల‌కు సంబంధించి అనంత అభిమానులు ఇప్ప‌టికే స‌ర్వం సిద్ధం చేసుకున్నారు.. దూర‌తీరాల నుంచి త‌ర‌లివ‌చ్చే ఫ్యాన్స్‌కి గ్రాండ్ వెల్క‌మ్ చెబుతూ ప్ర‌ధాన కూడ‌లిలో ఇప్ప‌టికే భారీ పోస్ట‌ర్లు వెలిశాయి.. వ‌చ్చిన త‌మ స‌హోద‌రులు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా తిరిగి వారి వారి గ‌మ్య‌స్థానాల‌కు చేరేందుకు వీలుగా లోక‌ల్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు..
14915456_1826022537644394_7424409444304121446_nఇక స్వాగ‌త స‌త్కారాల‌కు సంబంధించి అనంత అభిమానులు ఇప్ప‌టికే స‌ర్వం సిద్ధం చేసుకున్నారు.. దూర‌తీరాల నుంచి త‌ర‌లివ‌చ్చే ఫ్యాన్స్‌కి గ్రాండ్ వెల్క‌మ్ చెబుతూ ప్ర‌ధాన కూడ‌లిలో ఇప్ప‌టికే భారీ పోస్ట‌ర్లు వెలిశాయి.. వ‌చ్చిన త‌మ స‌హోద‌రులు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా తిరిగి వారి వారి గ‌మ్య‌స్థానాల‌కు చేరేందుకు వీలుగా లోక‌ల్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు..

14947908_288513438209260_866099638757097258_nఅటు రాష్ట్ర వ్యాప్తంగా త‌మ సేనానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సైన్యం గర్జ‌న ఇప్ప‌టికే ఊపందుకున్నాయి.. అనంత త‌ర‌లివచ్చేందుకు ఎవ‌రికి వారుగా సొంత వాహ‌నాల్ని సిద్ధం చేసుకుంటున్నారు.. ప‌వ‌ర్‌స్టార్ సీమాంధ్ర చైత‌న్య స‌హ స‌క్సెస్ కోసం గ‌త మూడు రోజులుగా స‌ర్వ‌మ‌త ప్రార్ధ‌న‌లు ప్రారంభించారు.. తొలి రోజు ద‌ర్గాల్లో, రెండో రోజు ఆల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించిన ప‌వ‌న్ భ‌క్తులు., శ‌నివారం చ‌ర్చిల్లో ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు నిర్వ‌హించారు.. వాతావ‌ర‌ణం నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడ‌ద‌ని మొక్కుతూ ప‌లు ఆల‌యాల్లో కొబ్బ‌రికాయ‌ల‌తో మొక్కులు చెల్లించుకున్నారు..

14947548_1785757708333394_6751350161292600272_nపవ‌న్ సభ అనగానే., పొలిటిక‌ల్ ప్ర‌త్య‌ర్ధులు పోటీ స‌భ‌లు పెడుతుండ‌డంతో., రెట్టించిన ఉత్సాహంతో జ‌న‌సేనాని స‌త్తా ఏంటో వారికి అనంత సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య వేదిక ద్వారా చాటేందుకు రెఢీ అయిపోయారు.. మొత్తానికి అనంత స‌భ వేడితో ఏపీ అట్టుడుకుతోంది..

Share This:

640 views

About Syamkumar Lebaka

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × two =