Home / జన సేన / సిపిఐ ఏపీ కార్య‌ద‌ర్శిగా మ‌ళ్లీ రామ‌కృష్ణ ఏక‌గ్రీవం.. జ‌న‌సేనుడి అభినంధ‌న‌లు..

సిపిఐ ఏపీ కార్య‌ద‌ర్శిగా మ‌ళ్లీ రామ‌కృష్ణ ఏక‌గ్రీవం.. జ‌న‌సేనుడి అభినంధ‌న‌లు..

క‌మ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా కె.రామ‌కృష్ణ మ‌రోసారి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.. క‌డ‌ప జిల్లాలో జ‌రిగిన ఆ పార్టీ జెడ్పీ స‌మావేశ మందిరంలో నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్న కామ్రెడ్లు, మ‌రోసారి రామ‌కృష్ణ‌కే రాష్ట్ర బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు మొగ్గు చూపారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన రామ‌కృష్ణ‌కి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.. పార్టీ కార్యాల‌యం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో త‌న త‌రుపున‌, జ‌న‌సేన పార్టీ త‌రుపున అభినంధ‌న‌లు తెలిపారు.. కార్య‌వ‌ర్గానికి ఎన్నికైన ఇత‌ర స‌భ్యుల‌కి కూడా జ‌న‌సేనాని హృద‌య‌పూర్వ‌కం శుభాభినంధ‌న‌లు తెలిపారు.. రామ‌కృష్ణ నాయ‌క‌త్వంలో సిపిఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనేక ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తుంద‌ని ఆయ‌న ఆకాంక్షించారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో వామ‌ప‌క్ష పార్టీల‌కు జ‌న‌సేన పార్టీ త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తుంద‌ని జ‌న‌సేన అధినేత హామీ ఇచ్చారు..

అటు సిపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన అనంత‌రం మాట్లాడిన రామ‌కృష్ణ కూడా జ‌న‌సేన‌, ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. రాష్ట్రంలో ఓ ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు.. ఆ శ‌క్తి జ‌న‌సేన పార్టీయేన‌ని రామ‌కృష్ణ చెప్ప‌క‌నే చెప్పారు.. వామ‌ప‌క్ష పార్టీల‌తో క‌ల‌సి ప‌నిచేస్తాన‌ని చెప్ప‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లో త‌మ‌కు న‌చ్చిన అంశ‌మ‌న్న ఆయ‌న‌, వామ‌ప‌క్ష పార్టీలు పేద‌ల కోసం ప‌నిచేస్తాయ‌ని, త్యాగాల‌కు సిద్ధంగా ఉంటాయ‌న్న విష‌యాన్ని జ‌న‌సేనాని గుర్తించార‌న్నారు.. అందుకే ఆయ‌న‌తో చేతులు క‌లిపిన‌ట్టు స్ప‌ష్టం చేశారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త‌మ పార్టీకి మెరుగైన భ‌విష్య‌త్తు ఉంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు..

జ‌న‌సేన‌తో జ‌త‌క‌ట్టిన మ‌రునాటి నుండి వామ‌ప‌క్షాల్లో కొత్త జోష్ క‌న‌బ‌డుతోంద‌న్న‌ది పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్ కామెంట్‌.. ఎవ‌రి ఆలోచ‌న ఎలా ఉన్నా., ప్ర‌జ‌లు మాత్రం ఇరువురి క‌ల‌యిక త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిబ‌ద్ద‌త‌తో పోరాడే మార్గం ల‌భించిన‌ట్టేన‌ని భావిస్తున్నారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

అస‌లు ‘సూత్ర‌ధారి’.. ”అజ్ఞాత‌వాసి” టీవీ9 ‘ర‌విప్ర‌కాషే’.. కెమెరామెన్ ‘ట్విట్ట‌ర్‌’తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

రెండు రోజులుగా వ‌రుస ట్వీట్ల‌తో నారా వారి మీడియా మాఫియాని బెంభేలెత్తిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. శ‌నివారం ఉద‌యం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + five =

%d bloggers like this: