Home / పెన్ పోటు / ”సీబీఎన్” రాధాకృష్ణగారు.. మీ కోత‌ల రాత‌లు జ‌నం న‌మ్మ‌రండీ..

”సీబీఎన్” రాధాకృష్ణగారు.. మీ కోత‌ల రాత‌లు జ‌నం న‌మ్మ‌రండీ..

ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ.. సైకిల్ స‌వారీ నుంచి ఛాన‌ల్ స్థాప‌న వ‌ర‌కు ఈయ‌న‌గారి ప్ర‌స్థానం, ప్ర‌హ‌స‌నం వెనుక ఉన్న ర‌హ‌స్యాలు తెలియ‌ని తెలుగోడు లేడు.. పాత్రికేయుడిగా, ప్ర‌తికాధినేత‌గా ఆయ‌న రాత‌లు, గీత‌ల వెనుక ఉన్న ర‌హ‌స్యాలు జ‌గ‌ద్విధిత‌మే.. ప్ర‌స్తుతం ఈయ‌న‌గారి మీడియా ప‌చ్చచొక్కా తొడుక్కుంది.. ఏపీ స‌ర్కారుకి అధికారిక మీడియాగా విధులు నిర్వ‌హిస్తోంది.. టీడీపీ స‌ర్కారు పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్నా., దాన్ని అనుకూలంగా చిత్రించే ప‌నిని గ‌ట్టిగా భుజాన వేసుకుంది.. ప్ర‌స్తుతం ఏపీలో అధికార‌విప‌క్షాలు దొందూ దొందే అన్న‌ట్టు త‌యార‌య్యాయ‌న్న‌ది విమ‌ర్శ‌కుల మాట‌.. ప్ర‌జ‌లు కూడా మూడో ప్ర‌త్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు.. ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బ‌డే మ‌రో నాయ‌కుడి వైపు చూస్తున్నారు.. అధికార‌, విప‌క్షాలు స్వ‌యంగా వేయించిన స‌ర్వేల్లో కూడా అదే తేట‌తెల్లం అయ్యింది.. అయితే ఏబీఎస్ కాదు సీబీఎన్ మీడియా అధినేత‌కి మాత్రం ఆ మూడో ప్ర‌త్యామ్నాయం అస‌లు క‌న‌బ‌డ‌కుండా పోయింది..img-20161127-wa0038

తాజాగా ఈయ‌న‌గారు ఓ కామిడీ స‌ర్వేను వీక్ష‌కుల ముందుంచారు.. ఇందులో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా తాజా సిఎం, విప‌క్ష నేత‌ల్ఓ ఎవ‌ర్ని చూడాల‌నుకుంటున్నార‌న్న‌ది ఓ ప్ర‌శ్న‌.. బ‌దులు కూడా అంతా ఊహించిన‌దే వ‌చ్చింది.. చంద్ర‌బాబుకే రాధాకృష్ణ‌గారి స‌ర్వే మొగ్గు చూపింది.. బాబుగారి పాల‌న‌కు కూడా జ‌నం ఫ‌స్ట్ క్లాస్ మార్కులు వేశార‌న్న‌ది ఈ ఎల్లో ఛాన‌ల్ రిపోర్టు.. సాక్షీ మీడ‌యా ప్ర‌తిప‌క్ష నేత‌కి ఆహా ఓహో అనడం ఎంత స‌హ‌జ‌మో., రాధాకృష్ణ‌గారి క‌లం జై సీబీఎన్ అనడం కూడా అంతే స‌హ‌జమ‌న్న విష‌యం జ‌నానికి తెలుసు..

ఇక్క‌డ చివ‌ర్లో ఇంకో ప్ర‌శ్న వేశారు.. ముఖ్య‌మంత్రి రేస్‌లో ఇద్ద‌రి పేర్లే చేర్చిన ఈ ప‌చ్చ మీడియా అధినేత‌., ప‌నితీరు విష‌యంలో మాత్రం జ‌గ‌న్ చంద్ర‌బాబుల‌తో పాటు జ‌న‌సేనాని పేరుని కూడా చేర్చారు.. అధికారం అనే మాట‌ను ప‌క్క‌న పెట్టి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి., ప్ర‌జాధ‌ర‌ణ విప‌రీతంగా పెరిగిపోయింది.. జ‌నంలో ఆయ‌న‌కి పెరుగుతున్న ఆధ‌ర‌ణ చూసి క‌న్నుకుట్టిందో., లేక లెక్క ప్ర‌కారం ఆయ‌న వ‌కాల్తా పుచ్చుకున్న వారి గొప్ప చాటాల‌నుకున్నారో., జ‌న‌సేనాని ప‌నితీరు భాగోలేదంటూ స‌ర్టిఫై చేసేశారు.. అది జ‌నం మాట అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టారు..

ఈ స‌ర్వే ప‌ట్ల జ‌నంలో చాలా అనుమానాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. స‌ర్వేలో కూడా చంద్ర‌బాబుకి మూడు ఆప్ష‌న్లు బాగుంది.. బాగోలేదు.. ప‌ర్వాలేదు.. కానీ జ‌న‌సేనానికి మాత్రం రెండే ఆప్ష‌న్లు ఇక్క‌డే అర్ధ‌మ‌వుతోంది మీ కుతంత్రం. రాధాకృష్ణ గారు మీరు భావించిన‌ట్టు సిఎం రేసులో జ‌న‌సేనాని లేన‌ప్పుడు., ఆయ‌న ప‌నితీరుని ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది అన్న‌ది అందులో మొద‌టిది.. ఇక మీరు వేసిన స‌ర్వేకి ప్రామాణికం ఏంటి..? ఎంత మంది అభిప్రాయాలు మీరు సేక‌రించారు..? ఏఏ వ‌ర్గాల వ‌ద్ద సేక‌రించారు..? వెయ్యి మందో ల‌క్ష మందో మీ అనుంగుల అభిప్రాయాలో., మీ వ్య‌క్తిగత అభిప్రాయాలో స‌ర్వే అంటే మిగిలిన జ‌నం నాడి ఏంటి..? ఈ అనుమానాలన్నీ నివృత్తి చేశాక మీరు ఎవ‌రికి కావాలంటే వారికి అనుకూలంగా రాత‌లు రాసేసుకోవ‌చ్చు..కాదు అంటే మిమ్మ‌ల్ని, మీ మీడియాని కూడా జ‌నం వెలివేసే రోజులు వ‌స్తాయి.. బీ కేర్‌ఫుల్‌..

Share This:

4,074 views

About Syamkumar Lebaka

Check Also

నిజం నిప్పులాంటిది.. ఆల‌స్యం అయినా అబ‌ద్ధాన్ని ద‌హించివేస్తుంది..

సత్యమేవ జయతే అంటూ దెయ్యాలు “వేదాలు” వల్లిస్తున్నాయి? దుర్మార్గులు “సన్మార్గం” గురించి మాట్లాడుతున్నారు! ప్రస్తుత మన రాజకీయ-మీడియా పరిస్థితులు చూస్తుంటే, …

4 comments

  1. Ban abn andhrajyothy all pk fans

  2. Tdp pakshi tdp palukulu

  3. Fake news fake channel

  4. Abn ani tisesi tdp chanel ani pettukomanadi vedavani…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − six =