Home / ఎడిటోరియల్స్ / సూటిగా..సుతిమెత్త‌గా..చుర‌క‌త్తిలా.. గురిచూసి పంజా విసిరిన జ‌న‌సేనాని..

సూటిగా..సుతిమెత్త‌గా..చుర‌క‌త్తిలా.. గురిచూసి పంజా విసిరిన జ‌న‌సేనాని..

_34a0300

సూటిగా.. .. సుతిమెత్త‌గా.. చుర‌క‌త్తిలా.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగం సాగిన తీరిది.. ఏం చెప్పాల‌నుకున్నారు.. ఏం చేయాల‌నుకుంటున్నారు.. ప్ర‌త్యేక హోదాపై త‌న వైఖ‌రి ఏంటి..? ప‌్యాకేజీలో ఉన్న లోపాలేంటి..? విమ‌ర్శ‌ల్లో ఘాటు.. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లపై వేటు.. ఒక్క‌టే బాణం.. గురి చూసి సంధించారు.. అంద‌రికీ గ‌ట్టిగా దించేశారు.. ప్ర‌తి అంశంపై పూర్తి ఆక‌ళింపుతో కూడిన ప్ర‌సంగం.. ఆధ్యంతం విమ‌ర్శ‌కుల్ని సైతం నోరెళ్ల బెట్టేలా చేసింది..

ప్ర‌సంగం అంతా పాయింట్ టూ పాయింట్ సాగింది.. పాయింట్ వ‌న్‌.. ప్యాకేజీ వ్య‌వ‌హారంలో పాల‌కుల మోసాన్ని ఎండ‌గ‌ట్ట‌డం.. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో అంశాలు పూర్తిగా చ‌దివి., ప్ర‌తి విష‌యంపై నిపుణుల‌తో చ‌ర్చించి., జ‌రిగిన వంచ‌న‌ను జ‌నం ముందుంచారు.. రాష్ట్రానికి చ‌ట్ట‌ప్ర‌కారం రావాల్సిన వాటా ఇచ్చి., దాన్నే ప్యాకేజీగా చూపుతున్న పాల‌కుల మోసాన్ని ఎండ‌గ‌ట్టారు.. ఈ వంచ‌న ఆప‌కుంటే… కుర్చీలు కూల్చేస్తామ‌ని నేరుగా హెచ్చ‌రించారు..

_34a0278

పాయింట్ టూ.. చంద్ర‌బాబుని విమ‌ర్శించ‌రు అన్న వైసీపీ నేత‌ల ప్ర‌శ్న‌కు బ‌దులివ్వ‌డం.. రాష్ట్ర ప్ర‌భుత్వ పాల‌న గ‌తి త‌ప్పుతోంది.. అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.. ఓ కులానికే అన్నీ క‌ట్ట‌బెడుతున్నారు.. అంద‌ర్నీ స‌మంగా చూడ‌డం లేదు.. మారండి.. లేకుంటే ఎన్నిక‌ల్లో మీకు ఓట్లు వేయ‌మ‌ని అడిగిన తానే., ఎదురుతిరుగుతా.. మీ విధానాల‌పై పోరాడుతా.. జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రించారు.. త‌ప్పు చేస్తే.. త‌న‌కు చంద్ర‌బాబు అయినా.. మోడీ అయినా ఒక్క‌టే.. ఎవ్వ‌రినీ వ‌దిలేది లేద‌ని క‌ల్లూరి వేదిక నుంచి కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు..

పాయింట్ త్రీ.. 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం.. సందిగ్ధం వ‌ద్దు.. సందేహం అంత‌కంటే వ‌ల‌దు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగుతాన‌ని తేల్చేశారు.. పార్టీలు, వ్య‌క్తులు త‌న‌కు శ‌త్రువులు కాదు.. ప్ర‌జా వ్య‌తిరేక విధానాలే త‌న‌కు శ‌త్రువులు.. పాల‌న గ‌తి త‌ప్పితే.. అది ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడితే.. ఆ పాల‌కులు ఎవ‌రైనా వారికి తాను శ‌త్రువునే అని హెచ్చ‌రించారు.. చాలా బ‌ల‌మైన శ‌త్రువున‌ని గ‌ర్జించారు..

14937381_2050374798522282_1775183135121255037_n

పాయింట్ ఫోర్‌.. అనంత‌లోనే స‌భ ఎందుకు.. నిత్యం క‌రువు కాట‌కాలు.. స‌మ‌స్య‌లు.. స‌మ‌స్య‌ల‌తో పోరాటం అంటే ఇష్టం.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌డంలో ఆనందం.. ఇవ‌న్నీ త‌న‌ను క‌రువు సీమ‌కు తీసుకువ‌చ్చాయ‌న్నారు.. అనంత ప్ర‌జ‌ల వెత‌లు పూర్తి స్థాయిలో ఆక‌ళింపు చేసుకున్న జ‌న‌సేనాని., ప‌రిష్కార మార్గాల‌పై నిపుణుల‌తో చ‌ర్చించారు.. 100 టిఎంసిల నీరు అనంత జిల్లా నుంచి క‌రువుని పార‌ద్రోలుతుంద‌ని తెలుసుకున్నారు.. అందుకోసం ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక రైల్లో ప్ర‌జ‌ల్ని తీసుకెళ్లి మ‌రీ ఢిల్లీలో త‌న వాణి వినిపించేందుకు రెఢీ అయ్యారు.. తాను చేయ‌ద‌లుచుకున్న పోరాటంలో నిబ‌ద్ధ‌త‌ను చాటుకున్నారు..

పాయింట్ 5.. జ‌న‌సేన ల‌క్ష్యాలు ఏంటి..? జైకిసాన్‌.. జై జ‌వాన్ నినాధం.. దేశానికి ఇద్ద‌రి అవ‌స‌రాన్ని ఎలుగెత్తారు.. స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌ధ్యంలో స‌భ‌ని పోస్ట్ పౌన్ చేయ‌డం.. ముందుగా అమ‌ర‌జ‌వాన్ల‌కు నివాళి అర్పించ‌డం.. జ‌న‌సేనానికున్న దేశ‌భ‌క్తిని చాటితే.. అన్న‌దాత ఆక‌లి కేక‌లు, ఆత్మ‌హ‌త్య‌లు ఓ రైతుగా తాను స్వ‌యంగా అనుభ‌వించి మాట్లాడ‌టం.. జ‌న‌సేనాని చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌నం.. మొక్క చ‌చ్చిపోతే ఓ రైతుగా తాను ప‌డిన‌బాధ‌ను వ్య‌క్త‌ప‌రిచి., అన్నంపేట్టే కిసాన్‌కి తాను అండ‌గా ఉంటాన‌ని తెలియ‌ప‌ర్చారు.. ప‌వ‌న్ ప్ర‌సంగానికి కౌంట‌ర్ల కోసం ఇప్పుడు ప్ర‌త్య‌ర్ధులు డిక్ష‌న‌రీలు వెత్తుకోక త‌ప్ప‌దు మ‌రి.. ముందు ముందు అర్ధంకాని భాష‌లో మీరు చేస్తున్న మోసాన్ని అర్ధ‌మ‌య్యే భాష‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌నం ముందు ఉంచేందుకు రెఢీ అవుతున్నారు.. మీ పేప‌ర్ల‌లో ఆయ‌న‌కి కూడా అర్ధంకాని కోడ్‌లు వాడండి.. లేక‌పోతే జ‌నం ఎదుట దోషులుగా నిల‌బ‌డాల్సి వ‌స్తుంది..

Share This:

4,687 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + 3 =