Home / జన సేన / సేనాని బాటే నా మాట‌.. అసెంబ్లీలో ప్ర‌యాణంపై జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక‌..

సేనాని బాటే నా మాట‌.. అసెంబ్లీలో ప్ర‌యాణంపై జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక‌..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున శాస‌న‌స‌భ‌కు ఎన్నికయిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌కు పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభినంద‌న‌లు తెలియ‌చేశారు.. తూర్పుగోదావ‌రి జిల్లా స‌మీక్షా స‌మావేశం ప్రారంభానికి ముందు ఆయ‌న‌కు పుష్ప‌గుచ్చం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు పార్టీ ప్ర‌ముఖులు కూడా రాపాక‌కు అభినంద‌న‌లు తెలిపారు.. పార్టీ ప్రముఖులు రామ్మోహ‌న్‌రావు, పులి శేఖ‌ర్‌ల‌తో పాటు ఆదే జిల్లాలో బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధులు అంతా కూడా రాపాక‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో ఉన్నారు.. అంతకు ముందు ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారి విజ‌య‌వాడ వ‌చ్చిన రాపాక‌., నేరుగా ప‌వ‌న్ ఇంటికి వెళ్లి మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఆయ‌న్ని క‌లిశారు.. అక్క‌డే కొద్దిసేపు చ‌ర్చించారు.. పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చిన రాపాక‌తో మాట్లాడేందుకు మీడియా ఎగ‌బ‌డ‌గా., తాను మొద‌టి నుంచి ఏదైతే చెబుతున్నారో., అదే విష‌యాన్ని పున‌రుద్ఘాటించారు.. తాను పార్టీని వీడే ప్ర‌స‌క్తిలేద‌ని., పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే క్ర‌మంలో త‌న‌వంతు శ‌క్తివంచ‌న లేకుండా ప‌ని చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.. పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సూచ‌న‌ల మేర‌కు అసెంబ్లీలో త‌న ప్ర‌తి అడుగు ఉంటుంద‌ని తెలిపారు..

Share This:

517 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనానిని క‌ల‌సిన రాపాక‌

జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌యిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలిచిన త‌ర్వాత తొలిసారి పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × one =