Home / ఎడిటోరియల్స్ / సేన‌కు.. సేవ‌కు.. సేనానే స్ఫూర్తి ప్ర‌ధాత‌.. హీ ఈజ్ ద రియ‌ల్ లీడ‌ర్‌..

సేన‌కు.. సేవ‌కు.. సేనానే స్ఫూర్తి ప్ర‌ధాత‌.. హీ ఈజ్ ద రియ‌ల్ లీడ‌ర్‌..

15094358_534089803467897_1455353640341992491_n 15253468_424827471238188_7271303673551982045_n

దానం చేస్తే.. రెండో చేతికి తెలియ కూడ‌ద‌న్న సూక్తి విన్నారా.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లాంటి వారిని చూసే అలాంటివి క‌నిపెట్టి ఉంటారు.. ప‌ది ఇచ్చి పాతిక ప్ర‌చారం చేసుకోవ‌డం నేటి నాయ‌కుల‌కి అల‌వాటు., కానీ జ‌న‌సేనాని వంద ఇచ్చినా అది తీసుకున్న వారు చెబితేగాని బ‌య‌టికి రాదు.. అంతేకాదు సాయం కోసం ఎవ‌రైనా వ‌స్తే., ఇచ్చిన అంతో ఇంతో కూడా ప్ర‌జ‌ల సొమ్ము దానం చేసి దాన్ని ఆర్భాటం చేసుకునే నాయ‌కులు ఉన్నారు.. ఇలాంటి వారంద‌రికీ ఆయ‌న అతీతుడు.. కాలే క‌డుపు చూస్తే క‌న్నీరు కార్చి మ‌ర్చిపోయే హృద‌యం కాదు.. ఆ క‌డుపు ఎలా నింపాలి అని ఆలోచించే నైజం.. ఇటీవ‌ల కాట‌మ‌రాయుడు షూటింగ్ సెట్‌లో జీస‌స్ వృద్దుల అనాధ శ‌ర‌ణాల‌యం నిర్వాహ‌కురాలు ప‌వ‌న్‌ని క‌లిసిన‌ప్పుడు., ఆమె ఏదో సాయం కోసం వ‌చ్చింది అని భావించారు అంతా.. ఆ వృద్దుల ఆల‌యాన్ని జ‌న‌సేనాని క‌ట్టిస్తున్నార‌న్న విష‌యం కూడా ఎక్క‌డా బ‌య‌టికి రాలేదు.. ఆ ఆశ్ర‌మం ప్రారంభోత్స‌వానికి వెళ్లిన అంద‌రు అక్క‌డ ఎదురుగా ఉన్న వారి దేవుడి ఫొటో చూసి షాక్ తిన్నారు.. ఆశ్ర‌మ దాత శ్రీ కొణిద‌ల ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటూ ఎదురుగా ఉన్న ఫొటో ఎంతో మందిని క‌దిలించింది.. జీవిత చ‌ర‌మాంకంలో ఉన్న వారికి ఇంకా ఏదో చేయాల‌న్న ఆకాంక్ష‌ను ప్ర‌జ‌ల్లో రేపింది..

15134785_1141563532630937_57474572068912694_n

ప‌వ‌ర్‌స్టార్ చేసిన ఈ సాయం ప్రాంతాల‌కు, కులాల‌కు, మ‌తాల‌కు అతీత‌మైన‌ది.. ఆదుకోండి అంటూ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆర్తుల‌ను ఒట్టి చేతుల‌తో పంపడం ఆయ‌న‌కు తెలియ‌దు.. అలా అని చేసిన సాయాన్ని ప్ర‌చారం చేసుకోవ‌డ‌మూ తెలియ‌దు.. అంతేకాదు ఆయ‌న సైన్యం., జ‌న‌సైన్యం కూడా ఇదే ప‌ద్ద‌తిని ఫాలో అవుతోంది.. ప‌వ‌ర్‌స్టార్ స్ఫూర్తితో నిత్యం ఏదో ఒక మూల‌, ఎవ‌రో ఒక‌రికి సాయం చేస్తూనే ఉన్నారు.. ఓ లీడ‌ర్‌కి ఇంత కంటే క్వాలిటీస్ ఏం కావాలి.. ఎదుటి వారి క‌ష్టాన్ని త‌న క‌ష్టంగా భావించే నేత‌లు నేటి రాజ‌కీయాల్లో ఎక్క‌డ దొరుకుతారు.. వీరికి సాయం చేయ‌డం వ‌ల్ల నా ఓటు బ్యాంకు ఎంత పెరుగుతుంది అన్న ఆలోచ‌న చేసే నేటి నాయ‌కులు., జ‌న‌సేనాని ముందు నిల‌బ‌డ గ‌ల‌రా..? ఆయ‌నపై కులం కుట్ర ప‌న్నుతున్న నాయ‌కులు ఇప్పుడేం చెబుతారు..

15055750_531423480401196_4505078102337100457_n

ప్ర‌జ‌లు మాత్రం ఇలాంటి విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చిన‌ప్పుడు ఓ ఊరిని కాదు రాష్ట్రం మొత్తాన్ని ద‌త్త‌త తీసుకోవాల‌ని ఉంది అన్న జ‌న‌సేనాని మాట‌ల‌ను గుర్తు చేసుకుంటున్నారు.. ఇప్ప‌టికే మెజార్టీ శాతం ప్ర‌జ‌లు హీ ఈజ్ ద రియ‌ల్ లీడ‌ర్ అన్న విష‌యాన్ని ఒప్పేసుకున్నారు కూడా.. ఇంకా ఆయ‌న్ని వేలెత్తిచూపాల‌ని అనుకునే వారు ఎవ‌రైనా ఉంటే., ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోండి..

Share This:

1,756 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + 1 =