Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / సేన సోష‌ల్ మీడియాలో నాన్‌సెన్స్ బ్యాచ్‌.. దుమారం రేపుతున్న పైశాచిక పోస్టులు..

సేన సోష‌ల్ మీడియాలో నాన్‌సెన్స్ బ్యాచ్‌.. దుమారం రేపుతున్న పైశాచిక పోస్టులు..

20161021_080958_resized_120161021_081432_resized_1

ఓ హీరో.. లేక ఓ రాజ‌కీయ నాయకుడు.. వీరిపై అభిమానం ఉండొచ్చు.. కానీ అది దుర‌భిమానం కాకూడ‌దు.. అది సాటి హీరోల‌పై డోసుకి మించి వ్యాఖ్య‌లు చేసే స్థాయిలో ఉండ‌రాదు.. అలాంటి ప‌నులే అభిమానుల్ని హ‌ద్దులు మీరి రెచ్చిపోయేలా చేస్తాయి.. ఓ హీరోకి, ఓ నాయ‌కుడికి జ‌నంలో కాస్త క్రేజీ పెరుగుతుందంటే., వారిపై బుర‌ద చ‌ల్లేందుకు ఈ అభిమానులు(దుర‌భిమానులు)గా చెప్పుకునే శాడిస్టు బ్యాచ్ రెడీ అయిపోతుంది.. ఇలాంటి వారు ఆయా హీరోల మ‌ధ్య‌, వారి అభిమానుల మ‌ధ్య అగ్గిరాజేస్తుంది.. అది కాస్తా చాలా దూరం వెళ్లే వ‌ర‌కు చేస్తుంది.. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భంజ‌నంగా మారిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే బ్యాచ్‌లు చిల‌వ‌లు ప‌లువ‌లుగా వ్యాపించేశాయి.. వీరికి నైతిక‌త ఉండ‌దు.. స‌మాజం అంటే గౌరవం అస‌లు ఉండ‌దు.. హ‌ద్దు, అదుపు లేకుండా బ‌రితెగించి తిరిగే బ్యాచ్ ఇది.. ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కి ఆ బ్యాచ్ ఓ గ్ర‌హ‌ణంలా ప‌ట్టి వేధిస్తున్నారు.. అభిమానులంద‌ర్నీ ఏక‌తాటిపైకి తెచ్చేందుకు జ‌న‌సేనాని, ఆయ‌న పార్టీ పేరుతో సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా గ్రూపులు క‌ట్టారు.. ఒక్కో గ్రూపులో వంద‌లు, వేలు నుంచి ల‌క్ష‌ల మంది స‌భ్యులుగా ఉన్నారు.. పార్టీ కార్య‌క్ర‌మాలు, ప‌వ‌న్ సినిమాల‌కి సంబంధించిన వార్త‌లు., జ‌న‌సేన పార్టీ త‌రుపున ఆయ‌న అభిమానులు చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు ఒక‌రికి ఒక‌రు షేర్ చేసుకోవ‌డంతో పాటు త‌మ‌కు తెలిసిన వారిని ఆ ద‌శగా ప్రోత్స‌హించ‌డం వంటి వాటి కోసం ఈ సామాజిక మాధ్య‌మాన్ని వినియోగించుకుంటున్నారు.. ఓ ల‌క్ష్యం వైపు ప‌య‌నిస్తున్న ప‌వ‌న్ అభిమానుల‌పై ఆ దుర‌భిమానులుగా చెప్పుకునే గుంట న‌క్క‌ల క‌న్ను ప‌డింది.. ప‌వ‌న్ పేరు చెప్పుకుని ఆయ‌న అభిమానులు నిర్వ‌హిస్తున్న గ్రూపుల్లోకి చేరిపోయారు.. చేరాక వారు చేస్తున్న అరాచ‌కం అంతా ఇంతా కాదు.. అస‌లే స‌ల‌స‌లా కాగే ఉడుకు ర‌క్తంతో కూడిన ప‌వ‌న్ అభిమానుల స‌హ‌నంపై మ‌రింత పెట్రోల్ పోస్తున్నారు..

నిత్యం జ‌న‌సేనాని, ఆయ‌న అభిమానుల‌కి వ్య‌తిరేకంగా పిచ్చి పిచ్చి పోస్ట‌ర్లు, కామెంట్ల‌తో ప్ర‌చారం చేయ‌డ‌మే వారి ప‌ని., ఇది కాస్త ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల్లో అస‌హ‌నం నింపే అంశమే అయినా., ఎలా రియాక్ట్ అయితే, త‌మ సేనానికి అది ఎలా చుట్టుకుంటుందోనన్న సంయ‌మ‌నంతో వేచిచూస్తున్నారు.. ముఖ్యంగా అత్యంత జ‌నాధర‌ణ క‌లిగిన సామాజిక మాధ్య‌మంగా ఉన్న ఫేస్ బుక్‌లో ఇలాంటి వెధ‌వాయిలు ఎక్కువ‌య్యారు.. బాబు పైశాచిక బాబులు మీరు చేస్తున్న ప‌ని ఎలాంటిదో ఒక్క సారి మీ మ‌న‌స్సాక్షిని అడిగి చూడండి.. అలాంటిదేం మాకు లేదే అంటారా.. మీకు ఆ దేవుడు మంచి బుద్దిని ప్ర‌సాధించ‌మ‌ని ఆ దేవుణ్ణి ప్రార్ధించ‌డం మినహా మేము ఏమీ చేయ‌లేం.. ద‌య చేసి ఇలాంటి దుర‌భిమానులు ఏ పెద్ద హీరోకి ఉన్నా., వారిని వారించండి.. మీ పెద్ద మ‌న‌సు చాటుకోండి.. మీ మ‌న‌సూ చిన్న‌ద‌యితే ఐయామ్ సారీ..

ఒక్క‌డ మాత్రం నిబ‌ద్ద‌త గ‌లిగిన ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల‌కి ఓ సారి మ‌న‌స్ఫూర్తిగా అభినంధ‌న‌లు తెల‌పాల్సిందే.. ఇంత సంయ‌మ‌నం ఎవ‌రి వ‌ల్లా కాదు.. వీల‌యితే ఆ చెత్త‌కి కౌంట‌ర్స్ ఇచ్చే బ‌దులు., వారిని మీ గ్రూపుల్లో నుంచి డిలీట్ చేయండి..

Share This:

1,339 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × four =