Home / సేన సేవ / సేవా ప‌థంలో ప‌వ‌న్ సేన‌..

సేవా ప‌థంలో ప‌వ‌న్ సేన‌..

img-20170103-wa0000

ఎక్క‌డ జ‌నం క‌ష్టాల్లో ఉంటే అక్క‌డ వాలిపోవ‌డం.. వారి స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌న‌వంతు సాయం చేయ‌డం.. తాడిత‌, పీడితుల పాలిట పోరాడ‌టం.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిత్యకృత్యాలు ఇవి.. ఎవ‌రు స‌మ‌స్య ఉంది అని జ‌న‌సేనా పార్టీ గ‌డ‌ప తొక్కినా., ఒట్టి చేతుల‌తో తిరిగి వెళ్లడం ఉండ‌దు.. ప‌రిస్థితి తీవ్ర‌త‌ని భ‌ట్టి స్పందించ‌డం., వ‌చ్చిన వారికి ఓ దారి చూప‌డం జ‌న‌సేనుడి బాట‌.. ఆయ‌న సైన్యం సైతం అదే బాట‌ను అనుస‌రిస్తున్నారు.. నిత్యం ఏదో ఒక మూల‌., ఎవ‌రికో ఒక‌రికి త‌మ శ‌క్తి మేర సాయం చేయ‌డం.. దాన్ని త‌మ దేవుడు ప‌వ‌న్ పేరిట చేయ‌డం అల‌వాటు చేసుకున్నారు.. చేతిలో ప‌ది రూపాయిలు ఉంటే సినిమాకి వెళ్లాలి.. వంద ఉంటే బిర్యానీ తినాలి., వెయ్యి ఉంటే ఇంకొంచెం హ‌డావిడి చేయాల‌ని అనే ప‌ద్ద‌తి నుంచి యువ‌త బ‌య‌ట‌ప‌డుతోంది.. జ‌న‌సేనుడి స్ఫూర్తితో ఆ రూపాయి ఎదుటివారికి సాయం చేయాల‌నే భావ‌న బ‌ల‌ప‌డుతోంది.. ఓ ఎన్ ఆర్ ఐ త‌న నెల సంపాద‌న‌లో 10 శాతం చారిటీకి ఖ‌ర్చు చేయాలి అనుకున్నాడు.. అదే ప‌ని చేస్తున్నాడు.. అదీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పూర్తితో.. అయితే త‌న‌తో పాటు మ‌రికొంద‌రికి ఇదే ఉద్దేశం ఉన్నా., జ‌న‌సేనాని నేరుగా ఓ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తే., దాని ద్వారా సేవాప‌థంలో మ‌రింత ముందుకి వెళ్లాని భావిస్తూ త‌న అభిప్రాయాన్ని ప‌వ‌న్‌టుడేకి వెల్ల‌డించాడు…

img-20170108-wa0095 img-20170108-wa0096

ఇక ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతూనే ఉన్నాయి.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర్సాపురంలో క్యాన్స‌ర్‌తో బాధ ప‌డుతున్న ఓ ప‌వ‌న్ ఫ్యాన్‌కి., జ‌న‌సైనికులు చేయూత నిచ్చారు.. న‌హేద్ మ‌హ్మ‌ద్ అనే బాధితుడు ఆర్ధిక ఇబ్బందుల కార‌ణంగా మెరుగైన చికిత్స చేయించుకోలేక‌పోయాడు.. అది తెలుసుకున్న తోట సురేష్‌, సాయి, మోహిన్‌ల బృందం., విష‌యాన్ని హీరో స‌ప్త‌గిరి ముందు ఉంచారు.. స్వ‌త‌హాగా ప‌వ‌న్ వీరాభిమాని అయిన ఆయ‌న‌., వెంట‌నే స్పందించి స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ టీమ్‌తో క‌ల‌సి 50 వేల రూపాయిలు అత‌నికి త‌క్ష‌ణ సాయంగా అందించారు..

img-20170107-wa0067

నెల్లూరు న‌గ‌రంలో పోరుక‌ట్ట ప్రాంతంలో బాణాసంచా గోడౌన్‌లో పేలుడు సంభ‌వించిన ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన బాధితుల‌ని., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానులు ప‌లుక‌రించారు.. త‌మ ఓపిక మేర‌కు వారికి ప‌ళ్లు, రొట్టెలు పంచారు.. వారికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు..

 

img-20170106-wa0101

తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేస్తున్న జ‌గ‌దీశ్ చంద్ర‌వాసు., ఆయ‌న బృందం ఓ హైస్కూల్‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కి స్టడీ మెటీరియ‌ల్స్ పంపిణీ చేశారు.. విద్యార్ధుల భ‌విష్య‌త్తుకి బంగారుబాట‌లు వేసేందుకు జ‌న‌సేనాని క‌ట్టుబ‌డి ఉన్నార‌ని హామీ ఇచ్చారు… ఈ మ‌ధ్య కాలంలో ఏ మూల చూసినా., జ‌న‌సైనికుల వార్త‌లే క‌న‌బ‌డుతున్నాయి.. విన‌బ‌డుతున్నాయి.. వారు రోడ్ల మీద‌కి వ‌స్తున్నారు.. జ‌నాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదు.. వారికి సేవ చేసేందుకు.. అదే క‌ధా ప‌వ‌నిజం.. అందుకే దాన్ని ఫాలో అయిపోతున్నారు..

Share This:

1,664 views

About Syamkumar Lebaka

Check Also

కాన్స‌ర్ భారిన ప‌డిన జ‌న‌సైనికుడు.. జ‌న‌సేనాని ఆప‌న్న‌హ‌స్తం..

పార్టీ నుంచి రూ. 2 ల‌క్ష‌ల ఆర్ధిక సాయం త‌లో చెయ్యి వేసిన జ‌న‌సైనికులు రూ. 10 వేలు ఇచ్చిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − eight =