Home / జన సేన / సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు రేపిన పోల్‌.. దెబ్బ‌కి రెండు పిట్ల‌ల్ని కొట్టిన ఆన్‌లైన్ స‌ర్వే..

సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు రేపిన పోల్‌.. దెబ్బ‌కి రెండు పిట్ల‌ల్ని కొట్టిన ఆన్‌లైన్ స‌ర్వే..

దొంగ‌లు..దొంగ‌లు ఊళ్లు పంచుకుంటే.. పోలిటీషియ‌న్సేమో మీడియాని పంచేసుకున్నారు.. ప‌చ్చ మీడియా ప్ర‌తిప‌చ్చ‌(క్ష‌) మీడియాగా మారి రాష్ట్ర ప్ర‌జ‌ల మేలు కోరి ముందుకి వ‌స్తున్న మూడో ప్ర‌త్య‌మ్నాయాన్ని ముప్ప‌తిప్ప‌లు పెడుతూ వ‌స్తున్నాయి.. 2009లో వీటి దెబ్బ‌కి ఓ మ‌హాప్ర‌స్థానం మ‌ధ్య‌లోనే ముగిసిపోయింది.. రెండే రెండు అంశాల‌కు ప‌ద‌ను పెట్ట‌డం ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మూడో ప్ర‌త్యామ్నాయం ఎద‌గ‌కుండా ఈ ప‌చ్చ‌-ప్ర‌తిప‌చ్చ‌(క్ష‌) మీడియా త‌న‌వంతు బాధ్య‌త‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. త‌ప్పుడు వార్త‌ల‌తో ప్ర‌జ‌ల్ని గంద‌ర‌గోళానికి గురిచేయ‌డం, వ్య‌తిరేక వార్త‌ల‌తో బుర‌ద చ‌ల్ల‌డం.. ఇప్పుడు మ‌రోసారి రాజ‌కీయం అంటే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అన్న నినాదంతో జ‌న‌హృద‌యాల్లోకి దూసుకు వ‌చ్చిన జ‌న‌సేన‌పై అదే అస్త్రాన్ని ప్ర‌యోగించారు.. మితిమీరిన వీరి ఆగ‌డాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎదురుదాడి చేయ‌గా, సోష‌ల్ మీడియా అస్త్రం ప‌చ్చ మీడియాని అదుపులో పెట్ట‌డంలో త‌న‌వంతు పాత్ర‌ను పోషించింది..

విస్తృతి పెంచుకుని ప్ర‌జ‌ల‌కి నిజాలు చేర‌వేస్తున్న సామాజిక మాధ్య‌మాలు, 2019 ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించ‌నున్నాయ‌న్న‌ది నిర్వివాదంశం.. దీంతో ప‌చ్చ‌-ప్ర‌తిప‌చ్చ‌(క్ష‌) బ్యాచ్ ఇక్క‌డికి కూడా రంగ ప్ర‌వేశం చేసింది.. సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా త‌మ వ‌క్ర వ్యూహాల్ని అమ‌లు చేయ‌డం మొద‌లు పెట్టాయి.. అయితే సోష‌ల్ మీడియాలో జ‌నం మీడియాకి-పచ్చ,ప్ర‌తి ప‌చ్చ‌(క్ష‌) మీడియాల‌కి ఒక తేడా ఉంది.. జ‌నం మీడియాలో అంతా స్వ‌చ్చంద సైనికులు కాగా, ప‌చ్చ మీడియాలో ఎక్కువ శాతం పెయిడ్ ఆర్టిస్టులు. ఫేక్ అకౌంట్లే.. స్వ‌చ్చంద మ‌ద్ద‌తుదారుల‌కి, డ‌బ్బు కోసం ప‌నిచేసే వారికి తేడా చాలా సంద‌ర్బాల్లో బ‌య‌ట‌ప‌డింది.. మెజార్టీ శాతం ప్ర‌జ‌లు ఓ అభిప్రాయానికి వ‌చ్చిన‌ప్పుడు., డ‌బ్బుతో దాన్ని మార్చ‌లేమ‌న్న హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి..

సోష‌ల్ మీడియా ముఖ‌చిత్రం ఫేస్‌బుక్ వేదిక‌గా ఇటీవ‌ల జ‌న‌సేన సోష‌ల్ మీడియా సైనికుడు శివ‌ప్ర‌సాద్ సుంక‌ర‌, ఓ ఆన్‌లైన్ పోల్ నిర్వ‌హించాడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తారు..? అన్న ప్ర‌శ్న‌తో ఈ పోల్ నిర్వ‌హించాడు.. రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీదారులుగా తాను భావించిన జ‌న‌సేన‌-వైసీపీ మ‌ధ్య పోటీ పెట్టారు.. పూర్తి నిస్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించిన ఈ పోల్‌ను త‌ట‌స్థ గ్రూపులో పోస్ట్ చేశారు..

సుమారు ల‌క్షా 10 వేల మంది ఈ పోల్‌లో పాల్గొన‌గా., జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌- వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిల మ‌ధ్య హోరా హోరి పోరాటం జ‌రిగింది.. ల‌క్షా ప‌ది వేల మందిలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి 57 వేల మంది మ‌ద్ద‌తు తెల‌ప‌గా., జ‌గ‌న్‌కి 52 వేల ఓటేశారు.. నియోజ‌క‌వ‌ర్గానికి వంద మంది ద‌గ్గ‌ర అభిప్రాయాలు సేక‌రించి., అదీ త‌మకు మ‌ద్ద‌తు తెలిపే వారి ద‌గ్గ‌ర తీసుకున్న అభిప్రాయాల‌ను రాష్ట్ర ప్ర‌జ‌ల అభిప్రాయంగా డ‌ప్పు కొట్టే ప‌చ్చ మీడియా కంటే., ల‌క్ష మంది అభిప్రాయాలు సేక‌రించిన ఈ ప‌ల్స్ పోల్‌ని స‌ర్వేగా తీసుకుంటే., ఇంత వ‌ర‌కు కార్య‌వ‌ర్గం లేని జ‌న‌సేన బ‌లం ఏంట‌న్న‌ది ప్ర‌త్య‌ర్ధుల‌కి బాగా తెలిసొచ్చింది.. ప్ర‌జ‌ల్లో ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఉన్న మద్ద‌తు తేట‌తెల్లం అయ్యింది..

ఇక్క‌డ కూడా రాష్ట్రంలో మూడో ప్ర‌త్యామ్నం ఏర్పాటుని వ్య‌తిరేకిస్తూ., ప‌చ్చ‌, ప్ర‌తిప‌చ్చ‌(క్ష‌) పార్టీలు రెండూ క‌ల‌సి ఓటింగ్‌లో పాల్గొన్నాయి కూడా.. అంటే ఈ పోల్ ద్వారా ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజ‌కీయ ప‌వ‌నాలు జ‌న‌సేన వైపే వీస్తున్నాయ‌నొచ్చేమో.. ప్ర‌త్య‌ర్ధులు అంగీక‌రించుకున్నా ఇదే నిజం..

ఇక ఈ పోల్ మ‌రో దొంగ‌ల బ్యాచ్ ఆట‌కూడా క‌ట్టించింది.. జ‌న‌సేన పేరుతో ఫేక్ అకౌంట్లు నిర్వ‌హించే వారి వివ‌రాలు కూడా బ‌ట్ట‌బ‌య‌లయ్యాయి.. ఫేక్ బాబులు ఇక, కొత్త పేర్లు వెత్తుక్కోండి.. ఇప్పుడున్న అకౌంట్ల పేరుతో పోస్టులు పెడితే దొరికిపోతారు.. తెలివితేట‌లు ఎవ‌డ‌బ్బ సొత్తూ కాద‌ని తెలుసుకోండి.. కోవ‌ర్టు త‌మ్ముళ్ళూ..

Share This:

10,505 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two + 17 =