Home / జన సేన / సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ ”ప్ర‌భం’జనం”..

సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ ”ప్ర‌భం’జనం”..

20161021_08090820161021_080958_resized_1
20161021_081602_resized_120161021_081012_resized_1
20161021_08015420161021_080304

సామాజిక మాధ్య‌మం(సోష‌ల్ మీడియా)లో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూసుకుపోతున్నారు.. వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ లాంటి మాధ్య‌మాల్లో ప‌వ‌న్ ప్ర‌భంజ‌నం ప్ర‌త్య‌ర్ధుల్లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది.. ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 25 ల‌క్ష‌ల పై చిలుకు ఉంటే., ఫేస్ బుక్‌, వాట్స‌ప్‌ల‌లో ఆయ‌న పేరుతో ఉన్న గ్రూపులు అన్నీ ఇన్నీ కాదు.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పాపులారిటీ ఉన్నసోష‌ల్ మీడియాల్లో నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న‌ఫేస్‌బుక్‌లో ప‌వ‌న్‌, ఆయ‌న పార్టీ జ‌న‌సేన పేరుతో వంద‌లాది గ్రూపులు ఉన్నాయి.. ఇందులో వంద‌కు పైగా గ్రూపుల్లో.., ఒక్కో దానిలో ల‌క్ష నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌భ్యులు ఉన్నారు.. వీరిలో ఓటు హ‌క్కు ఉన్న‌వారి సంఖ్య 80 శాతం వ‌ర‌కు ఉంటుంది.. వీటితో పాటు మండ‌ల స్థాయి, జిల్లా స్థాయిల్లో చిన్న చిన్న గ్రూపుల సంఖ్య అయితే కోకొల్ల‌లు.. వీరిలో ప‌వ‌ర్‌స్టార్‌ని అభిమానించే వారు, ఆరాధించేవారు, ఆయ‌న కోరితే గుండెనైనా కోసిచ్చే వీరాభిమానులు ఉన్నారు.. ఇక వాట్స‌ప్ లాంటి మాధ్య‌మాల్లో అయితే ఇలాంటి గ్రూపులు ఊరుకొక‌టి, వాడ‌కొక‌టిగా ఉన్నాయి.. జ‌న‌సేనాని ఏ విష‌యాన్ని ప్ర‌స్థావించినా., ఏ స‌మ‌స్య‌పై స్పందించినా., ఉద్య‌మానికి పిలుపు ఇచ్చినా నిమిషాల వ్య‌వ‌ధిలో ఈ సామాజిక మాధ్య‌మాల్లో అది వైర‌ల్ అయిపోతుంది.. వీరంతా సినిమా అయినా, రాజ‌కీయాలైనా జ‌న‌సేనాని వెన్నంటి ఉండేందుకు సిద్దంగా ఉన్నామ‌న‌డానికి సామాజిక మాధ్య‌మాల ద్వారా ఇప్ప‌టికే సంకేతాలు కూడా పంపుతున్నారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాబోయే ముఖ్య‌మంత్రి ఎవ‌రు..? ఏ పార్టీకి ఓటు వేస్తారంటూ ఎవ‌రికి వారుగా ఒపీనియ‌న్ పోల్స్ నిర్వ‌హించేస్తున్నారు.. అంతేకాదు ప‌వ‌న్‌కి అనుకూలంగా ఏ మూల‌న ఓ వార్త వ‌చ్చినా దాన్ని త‌మ గ్రూప్ ఫాలోవ‌ర్స్ ముందుకి తీసుకు వ‌చ్చేస్తున్నారు.. నిమిషాల వ్య‌వ‌ధిలో మిగిలిన గ్రూపుల‌కి స‌ర్య్కులేట్ చేసేస్తున్నారు.. ఇప్ప‌టికే ఓ ప్ర‌ముఖ జాతీయ మీడియా స‌ర్వే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల గుండెల్లో ద‌డ పుట్టిస్తుంటే., సామాజిక మాధ్య‌మాల్లో ప‌వ‌న్ ప్ర‌భంజ‌నం ఓట్లుగా మారితే త‌మ ప‌రిస్థితి ఏంటి అన్న ఆలోచ‌న‌లోనూ ఆయా పార్టీలు ప‌డిన‌ట్టు తెలుస్తోంది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓట‌ర్ల సంఖ్య ఎంత‌..? అందులో సామాజిక మాధ్య‌మాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తు తెలుపుతున్న వారి సంఖ్య ఎంత‌..? ఇలా లెక్క‌లువేసుకుని చూసుకుంటూ., ఇదే ప్ర‌భంజ‌నం కొన‌సాగితే త‌మ‌కు క‌నీసం డిపాజిట్లు అయినా ద‌క్కుతాయా అన్న భ‌య‌మూ వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం.. ఈ సోష‌ల్ మీడియాకి ఉద్య‌మాలు ర‌గిల్చిన చ‌రిత్ర‌, పాల‌కుల న‌డ్డివిరిచిన చ‌రిత్ర, గ‌ద్దెదించిన చ‌రిత్ర‌ ఉండ‌డ‌మే అందుకు కార‌ణం..

ఇదంతా కేవ‌లం కంప్యూట‌ర్లు, స్మార్టు ఫోన్లు వినియోగించే ప‌వ‌న్ ఫ్యాన్స్ సంఖ్య మాత్ర‌మే ఇది.. వీరితో పాటు కంప్యూట‌ర్ అంటే తెలియ‌ని వారు., ట‌చ్ ఫోన్ ట‌చ్ కూడా ఎరుగ‌ని ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల సంఖ్య కూడా ల‌క్ష‌ల్లోనే ఉంది.. వీరంతా నిత్యం ప‌వ‌నిజం పేరుతో జ‌న‌సేనాని త‌మ నుంచి ఏం ఆశిస్తున్నారో., అవే ప్ర‌ణాళిక‌ల్ని ఆచ‌రిస్తూ ఈ ఇజం వైపు మ‌రికొంత మందిని ఆక‌ర్షిస్తూ వ‌స్తున్నారు.. జ‌నంలోకి రాని నాయ‌కుడు, జ‌నంలో బ‌లం లేని నాయకుడు అంటూ విమ‌ర్శ‌లు చేసే వారికి ఈ మాత్రం స‌మాచారం స‌రిపోతుందా..?

Share This:

1,615 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + 12 =