Home / జన సేన / ‘స్టెత్ వ‌దిలేస్తే జ‌న‌సైనికులం’ అంటున్న ఎన్‌.ఆర్‌.ఐ డాక్ట‌ర్లు.. ”గాజుగ్లాసు”కి ప్ర‌చారం..

‘స్టెత్ వ‌దిలేస్తే జ‌న‌సైనికులం’ అంటున్న ఎన్‌.ఆర్‌.ఐ డాక్ట‌ర్లు.. ”గాజుగ్లాసు”కి ప్ర‌చారం..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అమెరికా టూర్ సంద‌ర్బంగా జ‌రిగిన డాక్ట‌ర్ల స‌మావేశంలో అనంత‌పురం జిల్లాకి చెందిన ఓ ఎన్‌.ఆర్‌.ఐ డాక్ట‌ర్ చేసిన కామెంట్‌.. ”స్టెత్ ప‌ట్టుకుంటేనే మేము డాక్ట‌ర్లం.. స్టెత్ వ‌దిలేస్తే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యాన్స్”.. అన్న మాట‌లు ఏ స్థాయిలో వైర‌ల్ అయ్యాయో అందిరికీ తెలిసిందే.. వైర‌ల్ అయ్యాయి అనే కంటే ఎంతో మంది డాక్ట‌ర్ల‌ను క‌దిలించాయి.. ఇప్పుడు అదే స్ఫూర్తితో గ్లోబ‌ల్ ఎన్‌.ఆర్‌.ఐ డాక్ట‌ర్ల బృందం జ‌న‌సేన పార్టీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసేందుకు రంగంలోకి దిగింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లాల్లోని ప్ర‌భుత్వ పెద్దాసుప‌త్రుల్లో పార్టీ ఎన్నిక‌ల గుర్తు గాజు గ్లాసును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప‌నిని భుజాన వేసుకుంది.. అనంత‌పురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు అన్ని జిల్లాల కేంద్రాల్లోని గ‌వ‌ర్న‌మెంట్ ఆసుప‌త్రుల్లో టీతో పాటు గాజు గ్లాసులు పంపిణీ చేసింది..

1. అనంత‌పురం- ఎర్ర‌నేల‌కొట్టాల‌లోని గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ మ‌రియు ఆసుప‌త్రి ప్రాంగ‌ణం.
2. క‌ర్న‌లు-బుధ‌వారిపేట‌లోని క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజీ మ‌రియు ఆసుప‌త్రి ప్రాంగ‌ణం
3. క‌డ‌ప‌- పుట్టంప‌ల్లి రిమ్స్ ప్రాంగ‌ణం
4. తిరుప‌తి- ఎస్వీఆర్ఆర్ ప్ర‌భుత్వ సాధార‌ణ ఆసుప‌త్రి ప్రాంగ‌ణం
5. నెల్లూరు- గుంటూరు రోడ్డులోని గ‌వ‌ర్న‌మెంట్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణం
6. ఒంగోలు- రిమ్స్‌
7. గుంటూరు- గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌
8. విజ‌య‌వాడ‌- గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌
9. ఏలూరు- ఆశ్ర‌మ్ హాస్పిట‌ల్‌
10.కాకినాడ‌, రాజ‌మండ్రి- గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్స్‌
11. విశాఖ‌ప‌ట్నం- కేజీహెచ్‌
12. విజ‌య‌న‌గ‌రం- మ‌హారాజా గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌, మిమ్స్‌, నెల్లిమ‌ర్ల‌
13. శ్రీకాకుళం-రిమ్స్‌, ప్రాంగ‌ణాల్లో టీ మ‌రియు గాజుగ్లాస్ పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది.. గ్లోబ‌ల్ ఎన్.ఆర్‌.ఐ డాక్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తు ప్ర‌చార కార్య‌క్ర‌మానికి ఆయా జిల్లాల పార్టీ నాయ‌కులు, వీర మ‌హిళ‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొని మ‌ద్ద‌తు తెలిపారు..

__________________________________________________

Share This:

594 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × four =