Home / జన సేన / స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి ల‌క్ష్మీనారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.. శ‌నివారం విశాఖ జిల్లా స‌మీక్షా స‌మావేశానికి జేడీ హాజ‌ర‌య్యారు.. స‌మావేశానికి ముందు పార్టీ అధినేత‌తో కాసేపు ప్ర‌త్యేకంగా మాట్లాడారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న్ని ప‌లుక‌రించిన మీడియ‌తో త‌న అభిప్రాయాలు పంచుకున్నారు.. స‌మావేశాల ముఖ్య ఉద్దేశం ముందుగా ఓటు వేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డం.. రెండో అంశం ఎన్నిక‌ల తీరుపై విశ్లేష‌ణ‌.. పార్టీ ఎన్నిక‌ల్లో ఎలా ముందుకు వెళ్లింది.. ప్ర‌జ‌లు ఎలా అర్ధం చేసుకున్నారు.. అనే అంశాలపై చ‌ర్చలు జ‌ర‌గుతున్న‌ట్టు తెలిపారు.. అయితే త‌క్కువ స‌మ‌యం ఉండ‌డం వ‌ల్లే పూర్తి స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక‌పోయామ‌న్న‌ది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయంగా వెల్ల‌డించారు.. పార్టీని ఎక్కువ మందికి చేర్చ‌లేక‌పోయామ‌ని తెలిపారు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇన్ని ల‌క్ష‌ల మంది ఓటు వేయ‌డం ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌స్తుంద‌న‌డానికి ఓ సంకేత‌మ‌ని జేడీ చెప్పుకొచ్చారు..

ఫ‌లితాల‌ను అన్ని విధాలుగా స‌మీక్షించుకుని త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌పై వ్యూహ‌ర‌చ‌న చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.. త్వ‌ర‌లో ఓ స్ప‌ష్ట‌మైన విధివిధానాల‌కు రూప‌క‌ల్ప‌న చేసి, ప్ర‌జ‌ల ముందుకు వెళ్ల‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.. స్థానిక ఎన్నిక‌ల‌కు ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశం మీద కూడా స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో ముందుకు వెళ్ల‌నున్న‌ట్టు జేడీ స్ప‌ష్టం చేశారు.. అంతా క‌ల‌సి ఓ మెరుగైన స‌మాజాన్ని రూపొందించేందుకు స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు.. పార్టీ అధినేత ఎలాంటి బాధ్య‌త అప్ప‌టించినా ఓ జ‌న‌సైనికుడిగా త‌న బాధ్య‌త తాను నిర్వ‌ర్తిస్తాన‌ని చెప్పారు.. స్థానిక ఎన్నిక‌ల్లో కూడా జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్‌ను ముందుకు తీసుకువెళ్తామ‌ని జేడీ తెలిపారు..

Share This:

758 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + three =