Home / పవన్ టుడే / స‌ప్త‌గిరి ఆడియో రిలీజ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ ఎట్రాక్ష‌న్‌గా ప‌వ‌ర్‌స్టార్‌..

స‌ప్త‌గిరి ఆడియో రిలీజ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ ఎట్రాక్ష‌న్‌గా ప‌వ‌ర్‌స్టార్‌..

img-20161106-wa0003

క‌మిడియ‌న్ స‌ప్త‌గిరి క‌థానాయ‌కుడిగా, అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌.. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప‌వ‌ర్‌ఫుల్ అప్పీరియ‌న్స్ ఆడియో ఫంక్ష‌న్‌కి ప్ర‌త్యేక క్రేజీ సంపాధించి పెట్టింది.. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ ఆడియో సీడీని త‌న చేతుల మీదుగా విడుద‌ల చేసిన జ‌న‌సేనాని., ఈ చిత్రాన్ని చూడాల‌నుంద‌ని., ఓ షో వేయించుకుని మ‌రీ చూస్తాన‌ని తెలిపారు.. త‌న కోసం కాట‌మ‌రాయుడు టైటిల్ త్యాగం చేసినందుకు స‌ప్త‌గిరికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఆయ‌న‌., అత‌ని సంస్కారాన్ని కొనియాడారు.. వాళ్ల చిత్రం స‌గంపైగా షూటింగ్ అయిపోయాక కూడా ఆ టైటిల్‌ని వాళ్లు త‌మ‌కు ఇచ్చార‌న్నారు.. ఇవ‌న్నీ తెర‌వెనుక సంగ‌తులు అయినా., వాటిని ప‌బ్లిగ్గా ఒప్పుకోగ‌ల ద‌మ్ము కేవ‌లం ప‌వ‌ర్‌స్టార్ సొంతం.. కాట‌మ‌రాయుడు టైటిల్ విష‌యాన్ని బ‌య‌ట పెట్టాల్సిన అవ‌స‌రం లేదు.. అయితే ఏ విష‌యంలో అయినా పార‌ద‌ర్శ‌కంగా, న‌లుగురికీ ఆద‌ర్శంగా ఉండాల‌న్న‌ది మ‌న‌సేనాని అభిమ‌తం.. ఇది ఆయ‌న‌కు మాత్ర‌మే సొంతం..

img-20161106-wa0004స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ హీరో స‌ప్త‌గిరి మాట్లాడుతూ., ప‌వ‌న్ త‌న సినిమా ఆడియో రిలీజ్‌కి రావ‌డం ప‌ట్ల ఉబ్బితబ్బిబ్బ‌య్యారు.. గ‌తంలో ప‌వ‌న్ సినిమాల కోసం చొక్కాలు చించుకున్న తాను., ఇప్పుడు ఆయ‌న కోసం ఏం చేయ‌డానికైనా సిద్దంగా ఉన్నాన‌ని తెలిపారు.. మొత్తానికి స‌ప్త‌గిరి.. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌ ఆడియో ఫంక్ష‌న్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌ర్‌ఫుల్ అప్పీరియ‌న్స్‌తో., మూవీ విడుద‌ల‌కి ముందే హిట్ టాక్ కొట్టేసింది..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 11 =

%d bloggers like this: