Home / పవన్ టుడే / స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా కాట‌మ‌రాయుడు., మీడియాలో హాట్‌టాపిక్‌గా రిలీజ్ డేట్‌..

స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా కాట‌మ‌రాయుడు., మీడియాలో హాట్‌టాపిక్‌గా రిలీజ్ డేట్‌..

katamaruduజ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఏ వార్త అయినా మీడియాకి అది ఫుల్ మీల్సే.. చీమ చిట్టుక్కుమ‌న్న వార్త రాసినా., రోజంతా రేటింగ్సే..రేటింగ్స్‌.. దీంతో ప‌వ‌న్ వార్త‌ల కోసం జ‌ర్న‌లిస్టు ప్ర‌పంచ‌మంతా త‌పించిపోతోంది.. కాస్త ఉప్పందితే., దాన్ని చిలువ‌లు ప‌లువ‌లుగా అల్లేసి మ‌రీ వార్త‌లు రాసేస్తుంది కూడా.. ఓ వైపు పాలిటిక్స్, మ‌రోవైపు సినిమాలు రెండు క‌ళ్ల‌లా చూసుకుంటూ ముందుకి సాగుతున్న జ‌న‌సేనాని తాజా చిత్రం కాట‌మ‌రాయుడు.. ఈ చిత్రం షూటింగ్ గ‌త కొద్ది రోజులుగా హైద‌రాబాద్ శివార్ల‌లోని రామానాయుడు స్టూడియోలో కొన‌సాగుతోంది.. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చిత్రిస్తున్న స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది.. గ‌త రెండు రోజులుగా పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.. ఈ సినిమా స్టోరీ త‌మిళ మాత్రుకే అయినా., డైరెక్ట‌ర్ డాలీ ప‌వ‌న్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు దాన్ని మ‌లిచిన‌ట్టుగా తెలుస్తోంది.. దీంతో కాట‌మ‌రాయుడుపై భారీగా అంచ‌నాలు పెరిగాయి.. ప‌వ‌న్ ఫ్యాన్స్ మొత్తం రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.. ప‌వ‌ర్‌స్టార్ ఒప్పుకున్న మ‌రో రెండు చిత్రాలు కూడా షూటింగ్ జ‌రుపుకోవాల్సి ఉన్న నేప‌ధ్యంలో., విడుద‌ల తేదీ ఖ‌రార‌య్యింది.. మార్చ్ 29న కాట‌మ‌రాయుడు ప్రేక్ష‌కుల ముందుకి రానున్నాడు.. ప‌వ‌న్ సూచ‌న మేర‌కే డేట్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది..

Share This:

554 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × one =

%d bloggers like this: