Home / పోరు బాట / స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన యుద్ధ‌భేరి.. అడుగుపెట్టిన చోట‌ల్లా ప‌రిష్కార‌మే..

స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన యుద్ధ‌భేరి.. అడుగుపెట్టిన చోట‌ల్లా ప‌రిష్కార‌మే..

fb_img_14796043927171278

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై యుద్ధం ప్ర‌క‌టించారు.. ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతూనే., మ‌రోవైపు పార్టీ త‌లుపుత‌ట్టిన ప్ర‌తి స‌మ‌స్యకు ప‌రిష్కార మార్గాలు వెత‌కాల‌ని నిర్ణ‌యించారు.. ఆక్వా ఫుడ్ పార్క్‌, ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌లు, కొల్లేరు నిర్వాసితుల స‌మ‌స్య‌లు లాంటివి ఈ కోవ‌కే వ‌స్తాయి.. ఇప్ప‌టికే ఆక్వా ఫుడ్ పార్క్ ప్రాంతంలో జ‌న‌సేనాని జోక్యంతో ప్ర‌జ‌లు కాస్త ఊపిరి పీల్చుకోగ‌లుగుతుండ‌గా., వారి త‌రుపున పూర్తి స్థాయిలో పోరాడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.. అటు ఉద్దానం కిడ్నీ బాధితుల ప‌రుపున ఎలుగెత్తేందుకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రెఢీ అవ‌గా., జ‌య‌ల‌లిత మృతి కార‌ణంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది.. అయితే కిడ్నీ బాధితుల త‌రుపున ఆయ‌న వ‌కాల్తా పుచ్చుకున్నార‌న్న వార్తే., స‌ర్కారులో క‌ద‌లిక తెచ్చింది.. వెంట‌నే ఆ ప్రాంతంలో రెండు డ‌యాల‌సిస్ సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు స్థానిక ఎమ్మెల్యే ఒక‌రు ప్ర‌క‌ట‌న చేశారు.. దీంతో ప‌వ‌న్ వ‌స్తానంటే గాని., స‌ర్కారుకి మా స‌మ‌స్య‌లు క‌న‌బ‌డ‌లేదా అంటూ జ‌నం మాట్లాడుకునే ప‌రిస్థితి..

img-20161210-wa0042 img-20161210-wa0043

ఇక జ‌న‌సేనాని పిలుపుతో త‌మ‌వంతు సాయం చేసేందుకు జ‌న‌సైన్యం కూడా రంగంలోకి దిగింది.. ఎవ‌రు స‌మ‌స్య‌ల్లో ఉన్నా., త‌మ వంతు సాయం చేసి వారిని ఆదుకునేందుకు న‌డుంభిగించింది.. ఎక్క‌డ ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉంటే అక్క‌డ వాలిపోతూ., వారి త‌రుపున ప‌వ‌న్‌సేన పోరాటం చేస్తోంది.. ఇటీవ‌ల ఆసుప‌త్రుల్లో రోగుల‌కి చిల్ల‌ర నోట్లు పంచి ఆదుకున్న జ‌న‌సైనికుడు క‌ళ్యాణ్ దిలీప్‌., పోల‌వ‌రం నిర్వాసితుల్ని ప‌లుక‌రించి వారి క‌ష్టాలు తెలుసుకున్నారు.. వారు ప‌డుతున్న ఇబ్బందుల్ని వీడియో రూపంలో విడుద‌ల చేశారు.. నిర్వాసితుల ఇబ్బందుల్ని ప‌ట్టించుకోకుంటే జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నాకు దిగుతామంటూ అధికారుల‌కి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.. క‌నీసం ఇళ్ల‌కు త‌లుపులు కూడా లేని దుస్థితిలో ఉన్న నిర్వాసితుల‌కి., జ‌న‌సైన్యం ప‌ర్య‌ట‌న ఊర‌ట నిచ్చింది.. వెంట‌నే రంగంలోకి దిగిన మంత్రివ‌ర్యులు., వారు ఉంటున్న ఇళ్లు రిపేర్ చేయించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.. అంతేకాదు ప‌రిహారం తాలూకు ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.. ఈ విష‌యాన్ని బాధితులు స్వ‌యంగా జ‌న‌సేన‌కు ఫోన్ ద్వారా తెలియ‌ప‌రిచారు..

దీంతో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆయ‌న పార్టీ త‌రుపున ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న సైనికుల ద‌గ్గ‌ర‌కి స‌మ‌స్య‌ల చిట్టాలు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతున్నాయి..

Share This:

1,613 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − 11 =