Home / జన సేన / స‌మ‌స్య‌-సాయం.. రెంటికీ ప‌ర్యాయ‌ప‌దం జ‌న‌సేనుడు..క‌ష్టానికి క‌రిగే సామి..

స‌మ‌స్య‌-సాయం.. రెంటికీ ప‌ర్యాయ‌ప‌దం జ‌న‌సేనుడు..క‌ష్టానికి క‌రిగే సామి..

ప‌వ‌నుడిపై ప్రాణానికి కులం లేదు..
అభిమానులు అంటే ప్రాణం ఇచ్చే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. వారి చిటికిన వేలికి గాయం అయ్యింద‌ని తెలిసినా విల‌విల్లాడిపోతారు. వారి యోగ‌క్షేమాలు స్వ‌యంగా వెళ్లి చూసిన ఎన్నో సంద‌ర్భాలు జ‌న‌సేనుడి ఔన్న‌త్యాన్ని చాటుతాయి.. విశాఖ జిల్లా పోరాట‌యాత్ర‌లో భాగంగా త‌మ దేవుడు వ‌స్తున్నాడ‌ని తెలిసి, స్వాగ‌త క‌టౌట్లు ఏర్పాటు చేస్తూ ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుత్‌ఘాతానికి పాయ‌క‌రావుపేట‌కి చెందిన ఇద్ద‌రు అభిమానులు మృత్యువాత ప‌డ్డారు. విష‌యం తెలుసుకుని విల‌విల్లాడిన జ‌న‌సేన అధినేత‌, వారి ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ కుటుంబ స‌భ్యుల్ని ఓదార్చారు. మీ కోసం నేనున్నాన‌న్న భరోసా ఇచ్చారు.. విశాఖ ప‌ర్య‌ట‌న ముగింపు సంద‌ర్బంగా ఇప్పుడు మ‌రోసారి ఆ కుటుంబాల‌ని క‌లిసి ఒక్కోక్క‌రికీ 3 ల‌క్ష‌ల రూపాయిల ఆర్ధిక సాయం అందించారు.. మృతుల్లో శివ జ‌న‌సేనానికి గుండెల్లోనే గుడి క‌ట్టి పూజించేవాడు. ర‌జ‌క సామాజిక‌వ‌ర్గానికి చెందిన శివ‌తో పాటు అత‌ని కుటుంబం కూడా జ‌న‌సేనుడ్ని త‌మ ఇంట్లో ఓ స‌భ్యుడిగా భావించేవారు. ఇప్పుడు శివ స్థానంలో ఆ కుటుంబ బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌న‌సేనాని మ‌రోసారి తానేంటో చాటుకోగా., ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి కుల ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న కుహ‌నా రాజ‌కీయ శ‌క్తులకి ఒక్క‌సారిగా చెంప చెళ్లుమన్న‌ట్ట‌య్యింది..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానుల‌కి కులం గొడ‌లు అడ్డురావ‌ని ఎన్నో సంద‌ర్బాల్లో నిరూపితం అయ్యింది.. పాయ‌క‌రావుపేట‌లో పోస్ట‌ర్లు క‌డుతూ ప్ర‌మాద‌వ‌శాత్తూ ప్రాణాలు కోల్పోయిన నాగ‌రాజు జీవితం కూడా అందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌. పుట్టింది శెట్టిబ‌లిజ‌గా అయినా., జ‌న‌సేనుడ్ని సొంత అన్న‌గా ప్రేమించాడు. అందుకే నాగ‌రాజు కుటుంబాన్ని ఆదుకుని త‌న బాధ్య‌త‌ని నెర‌వేర్చారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. మూడు ల‌క్ష‌ల ఆర్ధిక సాయంతో పాటు అండ‌గా ఉంటానంటూ జీవిత‌కాల భ‌రోసా ఇచ్చారు. నిత్యం కులం కులం అని కుల జపం చేస్తూ, కులాల ప్ర‌స్థావ‌న వ‌దిలేసిన జ‌న‌సేన అధినేత‌ని ఓ కులాన్ని అంట‌గ‌ట్టే వారు., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయం కులాల గోడ‌ల్ని ఎప్పుడో బ‌ద్ద‌లు కొట్టేసింద‌ని ఎప్పుడు తెలుసుకుంటారో.. ఏమో..

కార్మిక క‌న్నీటికి క‌రిగిన జ‌న‌సేనుడు..
కార్మిక సంక్షేమ‌మే మా ప్ర‌భుత్వ ధ్యేయం అంటూ అదునుచిక్కిన‌ప్పుడ‌ల్లా ఊద‌ర‌గొట్టే పాల‌కులు., సంక్షేమం మాట దేవుడెరుగు గాని తుంపాల చ‌క్కెర క‌ర్మాగారం లాంటి పెద్ద పెద్ద సంస్థ‌ల్ని మూసేసి, వారి జీవితాల్ని క్షామంలోని నెట్టేస్తున్నారు.. అయితే కార్మిక‌-క‌ర్ష‌క సంక్షేమ‌మే ధ్యేయంగా ముందుకి సాగుతూ, త‌న వ‌ద్ద‌కి వ‌చ్చిన ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మార్గం చూపుతూ ముందుకి సాగుతున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. స‌మ‌స్య ఎక్క‌డ వుంటే అక్క‌డ తానుండే జ‌న‌సేనాని., తిండి, నిద్ర కూడా మ‌ర‌చి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో సంతృప్తి చెందే ఆయ‌న‌., క‌ష్టాల్లో ఉన్న‌వారిని చూస్తే క‌ద‌ల‌లేరు. మూత‌ప‌డిన షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ స‌మ‌స్య‌పై అధ్య‌య‌నం చేసందుకు వెళ్లిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అక్క‌డ కార్మికుల వెత‌లు విని చలించిపోయారు. వారి సంక్షేమ నిధికి రెండు ల‌క్ష‌లు ఇస్తామంటూ ఇచ్చిన మాట‌ని నిల‌బెట్టుకుంటూ, విశాఖ పోరాట యాత్ర చివ‌రి రోజున తుంపాల చ‌క్కెర క‌ర్మాగారం కార్మికుల్ని పిలిచి ఆ మొత్తాన్ని వారికి అందించారు. చేతిలో ప‌ద‌వులు లేకున్నా, అధికారం లేకున్నా, ఎదుట‌వారి క‌ష్టాలు తీర్చాల‌న్న మ‌న‌సు ఉంటే చాల‌ని మ‌రోసారి చాటారు.

Advertisement..

 

Share This:

1,234 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − fifteen =