Home / జన సేన / స‌మ‌స్య ఉన్న చోటుకే వెళ్లి నిల‌దీయాలి.. ప్ర‌జా క్షేత్రంలోకి దూసుకుపోతున్న జ‌న‌సేనుడి ఫార్ములా..

స‌మ‌స్య ఉన్న చోటుకే వెళ్లి నిల‌దీయాలి.. ప్ర‌జా క్షేత్రంలోకి దూసుకుపోతున్న జ‌న‌సేనుడి ఫార్ములా..

ఏడాదిన్న‌ర క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌కి ఊపిరిపోసేందుకు ఇచ్చాపురం వెళ్లిన దగ్గ‌ర నుంచి జ‌న‌సేన గ్యారేజ్‌కి క్యూ క‌ట్టే ప్ర‌జా స‌మ‌స్య‌లు అనూహ్యంగా పెరిగాయి.. అయితే ప్ర‌తి స‌మ‌స్య‌ను స్వ‌యంగా ప‌రిశీలించిన జ‌న‌సేనాని, అత్య‌వ‌స‌రాన్ని భ‌ట్టి కొన్ని స‌మ‌స్య‌లకి వెంట‌నే ప‌రిష్కార మార్గాలు వెతికేశారు.. ప్ర‌భుత్వాన్ని అదిలించో, బెధిరించో ప‌ని పూర్తి చేశారు.. అయితే రెండో ర‌కం స‌మ‌స్య‌లు ఉన్నాయి.. ఈ స‌మ‌స్య‌లు ఆ ప్రాంతానికి వెళ్లి, బాబూ స‌మ‌స్య ఇదిగో మీ పాల‌న‌లో ఎందుకు నిర్ల‌క్ష్యం వ‌హించారు.. లేదా ఎందుకు ప‌రిష్క‌రించ లేక‌పోయారు అంటూ ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌శ్నించ‌డం.. పోరాట యాత్ర‌ను కూడా జ‌న‌సేన అధినేత అందుకు వేదిక‌గానే చేసుకున్నారు.. ఉద్దానం వ్యాధిగ్ర‌స్తుల కోసం నిరాహార‌దీక్ష చేప‌ట్ట‌డం మ‌ధ్య మ‌ధ్య‌లో యాత్ర‌కు బ్రేక్ ఇచ్చి భూనిర్వాసితుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించ‌డం.. ప్ర‌తి నిమిషం ప్ర‌జ‌ల కోసం చేసే ఆలోచ‌న‌లే..

తాజాగా ప‌శ్చిమ టూర్‌లో ఉన్న ప‌వ‌నుడు ప‌చ్చ పార్టీకి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపిస్తున్నారు.. అభివృద్ధి అదిరింది.. రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ అంటూ ప‌చ్చ ప‌త్రిక‌ల్లో తాటికాయంత అక్ష‌రాల‌తో ప్ర‌చారం చేసుకుంటున్న చంద్ర‌బాబు అండ్ కోకి., స‌మ‌స్యా కేంద్రం నుంచి మీ అభివృద్ది ఎక్క‌డ అంటూ వెక్కిరిస్తున్నారు.. శ‌నివారం భీమ‌వ‌రం డంపింగ్ యార్డ్ బాధితుల కోసం ఆ ప్రాంతానికి వెళ్లి, కుళ్లు కంపులో సుమారు కిలోమీట‌రు న‌డిచి., వారి క‌ష్టాన్ని తాను కూడా అనుభ‌వించి., సిఎం, వారి త‌న‌యుణ్ణి నిల‌దీశారు.. అభివృద్ది అంటే ఆనోరోగ్య‌పు బ‌తుకులా అంటూ..

తాజాగా ఉండి నియోజ‌క‌వ‌ర్గం మొత్తానికి తాగునీరు అందించే ప‌రిమ‌ళ్ల ప్రాజెక్టు చెంత‌కి వెళ్లి., 13 ఏళ్లుగా ముందుకి సాగ‌ని పాల‌నా తీరుని దుయ్య‌బ‌ట్టారు.. 18 కోట్లు ఖ‌ర్చు చేసినా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కి చుక్క నీరు అందించ‌లేక పోయార‌ని., ఇదేనా మీ అభివృద్ది అంటూ ప్ర‌శ్నించారు.. జిల్లా ప్ర‌జ‌లు 15కి 15 సీట్లు మీకు క‌ట్ట‌బెడితే జిల్లాకి మీరు నామం పెడ‌తారా అంటూ దుయ్య‌బ‌ట్టారు.. తాగునీటి కోసం ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు చూస్తే క‌డుపు త‌రుక్కుపోతుందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు..

విచ్చ‌ల‌విడిగా ప్ర‌భుత్వం అక్రమ ఆక్వాసాగుత‌కి అనుమ‌తులు ఇవ్వ‌డంతో భూగ‌ర్భ జ‌లాలు, మంచినీటి కాలువ‌లు కాలుష్య‌పు భారిన ప‌డ్డాయ‌ని జ‌న‌సేన అధినేత ఆరోపించారు.. అందువ‌ల్లో చుట్టూ గోదారి ఉన్నా ప్ర‌జ‌ల‌కి తాగునీటి క‌ట‌క‌ట అని అభిప్రాయ‌ప‌డ్డారు.. ప్ర‌జా ప్ర‌తినిధుల అవినీతి-నిర్ల‌క్ష్యానికి మూల్యంగా ప‌ట్టాలెక్క‌ని ప‌రిమ‌ళ ప్రాజెక్టుని చూపారు.. ఎవ‌రు అండ‌గా నిలుచుకున్నా, నిల‌బ‌డ‌కున్నా.. ఓట్లు వేసినా., వెయ్యకున్నా.. ఉండి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి జ‌న‌సేన చివ‌రి వ‌ర‌కు పోరాటం చేస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు.. ప్ర‌జా స‌మ‌స్య ఉన్న ప్ర‌తి చోటుకీ జ‌న‌సేనుడు రావ‌డం, అక్క‌డి నుంచే పాల‌కుల్ని నిల‌దీయ‌డం, స‌మ‌స్య‌ను ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్తున్న తీరు., జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేస్తోంది.. నిజ‌మైన నాయ‌కుడ్ని చూస్తున్నాం అంటూ బ‌హిరంగంగానే మాట్లాడుకోవ‌డం వినిపిస్తోంది.. ఇది ఎలాంటి ప‌రిణామ‌మో గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతున్నా, పైకి మేక‌పోతు గాంభీర్యం క‌న‌బ‌రుస్తున్న వారే విశ్లేషించాలి..

Share This:

2,876 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 10 =