Home / జన సేన / స‌మ‌స్య ఉన్న చోటే ప‌రిష్కారం వెత‌కాలి.. అదే జ‌న‌సేనుడి మాటా..చేతా..

స‌మ‌స్య ఉన్న చోటే ప‌రిష్కారం వెత‌కాలి.. అదే జ‌న‌సేనుడి మాటా..చేతా..

పోరాట యాత్ర అంటే రోడ్ల వెంట తిర‌గ‌డం.. మ‌మ అనిపించ‌డం కాదు.. స‌మ‌స్య‌లు వెత‌క‌డం.. అధ్య‌య‌నం చేయ‌డం.. స‌మ‌స్య ఉన్న చోటు నుంచే స‌ర్కారుకి అయ్యా పాల‌కులారా.. ఇవిగో స‌మ‌స్య‌లు అని చెప్ప‌డం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్న పోరాట యాత్ర సాగుతున్న తీరిది.. అభివృద్ది.. అభివృద్ది అని మాట‌లు చెప్పే పాల‌కులు, అయ్యా ఇదేనా మీ అభివృద్ది అంటూ స‌వాలు విసిరే తీరు.. కాక‌మ్మ క‌బుర్లు చెప్పే స‌ర్కారుకి ఎక్క‌డో త‌గులుతోంది.. అంతే కాదు ఎవ‌రు వ‌చ్చి, అయ్యా మా ఊర్లో స‌మ‌స్య ఉంది.. ఒక్క‌సారి వ‌చ్చి చూడండి అన్నా, కాద‌న‌కుండా అక్క‌డికి వెళ్లిపోతున్నారు.. అర‌కు గిరిజ‌నం త‌మ స‌మ‌స్య‌లు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎదుట ఏక‌రువు పెట్టిన‌ప్పుడు, ఆయ‌న గిరిజ‌న గూడెల వెంట తిరిగి, వారి స‌మ‌స్య‌ల్ని స్వ‌యంగా ప‌రిశీలించారు.. అక్క‌డి నుంచే పాల‌కుల్ని ప్ర‌శ్నించారు..

తాజాగా పాడేరు ప‌రిధిలో ఓ మారు మూల గ్రామం గూడ‌.. అక్క‌డ అక్ర‌మ మైనింగ్.. ప్ర‌జా జీవితాన్ని అస్థ‌వ్య‌స్థం చేస్తోంద‌ని తెలుసుకున్న జ‌న‌సేనాని., ఆ ఊరికి వెళ్లారు.. కొండ‌ల్ని అక్ర‌మంగా పిండి చేస్తున్న గ్రానైట్ క్వారీల‌ని చూశారు.. ఆ ప‌క్క‌నే గూడ గ్రామానికి ద‌ప్పిక తీర్చే భావినీ ప‌రిశీలించారు.. అక్ర‌మ మైనింగ్‌తో ఆ భావిలోని నీరు ఎలా విష‌తుల్యం అవుతుందో తెలుసుకున్నారు..

ఆ వెంట‌నే తెలుగు దేశం పార్టీ ప్ర‌భుత్వానికి ప్ర‌కంప‌న‌లు పుట్టేలా ఆ స‌మ‌స్య‌ని ఎలుగెత్తారు.. ముఖ్య‌మంత్రి గారు మా పాల‌న‌లో అవినీతి ఎక్క‌డ అని అడుగుతున్నారు.. ఇదిగో ఈ గూడ గ్రామంలో 9 కోట్ల రూపాయిల అక్ర‌మ మైనింగ్ జ‌రిగింది.. ఇటీవ‌ల వైసీపీ నుంచి మీ పార్టీలోకి వ‌చ్చిన నాయ‌కులే ఈ దోపిడి చేశారు… అందుకు ప్ర‌జ‌లే సాక్ష్యం.. స్వ‌లాభం కోసం అక్ర‌మంగా ఇలా ప్ర‌కృతిని విధ్వంసం చేయ‌డం నీతా..? అంటూ ప్ర‌శ్నించారు..

మీ పార్టీ నేత‌లు జేబులు నింపుకునేందుకు, ఆ గిరిజ‌నానికి ద‌ప్పిక తీరుస్తున్న భావిని నాశ‌నం చేస్తారా..? చెప్పండి ఇదెక్క‌డి న్యాయం అంటూ జ‌న‌సేన అధినేత సూటిగా సంధించిన ప్ర‌శ్న‌కు మ‌రోసారి ప‌చ్చ బ్యాచ్ గొంతులో ప‌చ్చి వెల‌గ ప‌డింది.. అక్ర‌మ మైనింగ్ కార‌ణంగా వ‌చ్చే దూళితో కూడిన విషపు రేణువులు ఆ గ్రామానికి తాగునీటి దిక్కు అయిన భావిలో ప‌డుతున్నాయి.. దీంతో ఆ నీరు తాగి గూడ ప్ర‌జ‌లు అనారోగ్యాల‌కి గుర‌వుతున్నారు.. ఈ విష‌యాన్ని ప‌చ్చ పార్టీ పెద్ద‌ల‌తో పాటు, ఆ పార్టీ నేత‌లు చేస్తున్న ఘ‌న‌కార్యాన్ని యావ‌త్ ప్ర‌పంచం దృష్టికి తీసుకురావ‌డానికే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గూడ‌కి వెళ్లారు..

దీంతో జ‌న‌మంతా చంద్ర‌బాబు గారు మీ నీతి ఎంతో మాకు తెలిసి పోయింది.. ఇంకో మాట చెప్పండి సార్ అంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.. జ‌నం నిజాన్నే న‌మ్ముతారు క‌దా మ‌రి..

Share This:

1,371 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 2 =