Home / పోరు బాట / స‌మ‌స్య ఎక్క‌డుంటే ”సేన” అక్క‌డే.. సిక్కోలు స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ దృష్టి..

స‌మ‌స్య ఎక్క‌డుంటే ”సేన” అక్క‌డే.. సిక్కోలు స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ దృష్టి..

15055750_531423480401196_4505078102337100457_n సీమ జిల్లాల్లో అనంత అంటే నాకు ప్ర‌త్యేక అభిమానం.. ఎందుకంటే ఇక్క‌డ స‌మ‌స్య‌లు ఎక్కువ‌.. ఈ స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌టం అంటే నాకు ఇష్టం.. ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బ‌డ‌టం అంటే ఇష్టం.. అందుకే అనంత అంటే ఇష్టం.. సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య వేదిక సాక్షిగా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నోటి నుంచి జాలువారిన మాట‌లు ఇవి.. ఓ గ్రామాన్ని కాదు., రాష్ట్రం మొత్తాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని వాగ్దానం చేశారు.. అక్క‌డే అర్ధ‌మ‌వుతోంది జ‌న‌సేనాని అంత‌రంగం.. ఏ ఒక్క‌రి స‌మ‌స్యో ప‌రిష్క‌రించి చేతులు దులుపుకోవ‌డం కాదు.. ఇంకా ఎంత మంది ఇలాంటి స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.. వారంద‌రి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం ఎలా..? అన్న ఆలోచ‌నే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఆలికి అన్న‌పెట్టి ఊరంతా భోజ‌నం పెట్టిన‌ట్టు క‌టింగ్ ఇవ్వ‌డం కాదు.. ఊరంత‌టికీ క‌డుపు నింప‌డ‌మే ఆయ‌న ల‌క్ష్యం.. ఆ ల‌క్ష్యం దిశ‌గా మ‌రో అడుగు ప్రారంభ‌మైంది..

fb_img_14795863214689094 రాష్ట్రంలో వెనుక‌బ‌డిన ప్రాంతాల ప్ర‌జ‌లు ప‌డుతున్న వెత‌లు, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాలు అన్వేష‌ణ మొద‌లైంది.. అభివృద్దికి ఆమ‌డ దూరంలో ఉన్న ప్రాంతాల్లో అనంత జిల్లా త‌ర్వాత ఆ స్థానం ఆక్ర‌మించాయి.. ఉత్త‌రాంధ్ర జిల్లాలు.. అందునా సిక్కోలుగా పిలువ‌బ‌డే శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌ల వెత‌లు అంతా ఇంతా కాదు.. ఊళ్ల‌కు ఊళ్లు వ‌ల‌స‌లు పోయిన చ‌రిత్ర ఆ జిల్లాది.. నిత్యం క‌రువు కాట‌కాలు, వాటిని ఎదిరించి నిల‌బ‌డ‌దామంటే కాల‌కూట విషం లాంటి భూగ‌ర్భ జ‌లాలే కాదు., ర‌క్షిత మంచినీటి ప‌థ‌కం ద్వారా స‌ర‌ఫ‌రా అయ్యే త్రాగునీరు అంతా కాలుష్య‌మే.. ఈ నీరు తాగి ప్ర‌జ‌లు వింత వింత రోగాల‌కు గుర‌వుతున్నారు.. ప్ర‌జ‌ల‌కు క‌నీసం త్రాగునీరు ఇవ్వ‌లేని పాల‌కులు., జ‌నం రోగాల భారిన ప‌డ్డా చోద్యం చూస్తున్నారు.. స‌రైన మందులు దొర‌క్క‌, ఖ‌రీదైన వైద్యం కోసం ఉన్న‌వ‌న్నీ ఊడ్చేసుకోవాల్సిన ప‌రిస్థితులు జిల్లాలో క‌న‌బ‌డుతున్నాయి..

fb_img_14795863415778646 fb_img_14796043834401618 fb_img_14796043927171278

సిక్కోలు వాసుల ఈ స‌మ‌స్య‌లు జ‌న‌సేనానిని క‌దిలించాయి.. అస‌లు అక్క‌డ నీటి కాలుష్యానికి కార‌ణం ఏంటి..? నివార‌ణ ఎలా..? వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా అనే అంశాల‌పై అధ్య‌య‌నం చేసేందుకు పార్టీ త‌రుపున అధికార ప్ర‌తినిధి రాఘ‌వ‌య్య‌గారి నేతృత్వంలో ఓ బృందాన్ని పంపారు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని వారికి జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌న్న భ‌రోసా క‌ల్పించారు.. పుట్టుగ గ్రామంలో ప‌ర్య‌టించిన రాఘ‌వ‌య్య‌గారు అక్క‌డ స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు.. విష‌పు నీటితో ర‌క్తంలో మార్పులు సంభ‌వించి వింత రోగాల‌కు గుర‌వుతున్న వైనాన్ని స్థానికులు ఆయ‌న ముందుంచారు..

సిక్కోలు వాసుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనాని దృష్టి సారించ‌డంతో., ప‌వ‌న్ త‌ర్వాతి అడుగు అక్క‌డే పెట్ట‌బోతున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు మ‌రింత ఊతం ఇచ్చింది.. ప్ర‌జ‌లు కూడా త‌మ వెత‌లు వినేందుకు, త‌మ త‌రుపున పోరాడేందుకు జ‌న‌సేనాని వ‌స్తార‌ని వేయి క‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు..

Share This:

1,472 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + eleven =