Home / జన సేన / స‌ర్వ‌జ‌నావ‌ళికి జ‌న‌సేనాని వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు.. మ‌ట్టి గ‌ణ‌ప‌తి పూజ‌కి పిలుపు..

స‌ర్వ‌జ‌నావ‌ళికి జ‌న‌సేనాని వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు.. మ‌ట్టి గ‌ణ‌ప‌తి పూజ‌కి పిలుపు..

తెలుగు ప్ర‌జ‌ల‌కి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న త‌రుపున జ‌న‌సేన పార్టీ శ్రేణుల త‌రుపున వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు.. ప‌ర్యావ‌ర‌ణ హితంగా పండుగ చేసుకోవాల‌ని దేశ ప్ర‌జ‌ల‌కి పిలుపు నిచ్చారు.. అందు కోసం మ‌ట్టి గ‌ణ‌ప‌తిని పూజించాలంటూ ఓ ప్ర‌క‌ట‌న‌లో సూచించారు.. త‌ద్వారా ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని కోరారు..

జ‌న‌సేన పార్టీ ఏడో సిద్ధాంతం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కి క‌ట్టుబ‌డి ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మ‌ట్టితో త‌యారు చేసిన వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను ప్ర‌జ‌ల‌కి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.. మ‌ట్టి వినాయ‌కుడి పూజ ఆవ‌శ్య‌క‌త‌ని చాటుతూ., ప‌లు చోట్ల గ‌ణ‌ప‌తి ప్ర‌తిమ‌తో పాటు ప్ర‌త్యేకంగా జ‌న‌సేన పార్టీ త‌రుపున వేయించిన వినాయ‌క వ్ర‌త క‌ల్పం పుస్త‌కాల‌ని కూడా ఉచితంగా ప్ర‌జ‌ల‌కి అంద‌జేస్తున్నారు.. జ‌న‌సేన అధినేత నోటి వెంట ఇలా ఆజ్ఞ వ‌చ్చిందో లేదో., అలా ఫాలో అయిపోయే జ‌న‌సైనికులు., ఇప్పుడు ఆయ‌న ఆలోచ‌న‌ని ఆయ‌న చెప్ప‌క ముందే ఫాలో అయిపోతున్నారు.. ఇక జ‌న‌సేన అధినేత సూచ‌న‌తో రేపు ఉద‌యం కూడా కొన్ని ప్ర‌త్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి జ‌న‌సైనికులు మ‌ట్టి గ‌ణ‌నాదుల్ని ఉచితంగా ప్ర‌జ‌ల‌కి అందించ‌నున్నారు..

Share This:

356 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten − 6 =