Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / హోదా ఇవ్వ‌కుంటే బీజేపీని వ‌ద‌లం- జై ఆంధ్ర అమ‌రుల‌పై ఒట్టేసి జ‌న‌సేనాని శ‌ప‌థం..

హోదా ఇవ్వ‌కుంటే బీజేపీని వ‌ద‌లం- జై ఆంధ్ర అమ‌రుల‌పై ఒట్టేసి జ‌న‌సేనాని శ‌ప‌థం..

24 34

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇచ్చేవ‌ర‌కు బీజేపీని వ‌దిలేది లేద‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హెచ్చ‌రించారు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించిన ఆయ‌న‌., నాలుగో రోజు ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై స్పందించారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇస్తామని ఎన్నిక‌ల స‌మ‌యంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీని బీజేపీ విస్మ‌రించింద‌ని జన‌సేనాని ఆరోపించారు.. ప‌దేళ్ల పాటు ఆంధ్రులు ఎన్నో అవ‌మానాలు భ‌రించార‌న్న ఆయ‌న‌., చివ‌రికి రాజ‌ధాని కూడా లేకుండా గెంటివేయ బ‌డ్డార‌న్నారు..

444

ముందు ప్ర‌త్యేక హోదా అన్న బీజేపీ., ఇప్పుడు దాన్ని ప్ర‌త్యేక ప్యాకేజీ అంటోంద‌ని.. ఇది కేవ‌లం కంటి తుడుపు చ‌ర్య మాత్ర‌మేన‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.. స్పెష‌ల్ ప్యాకేజీలో ఆ స్పెష‌ల్ అన్న ప‌దం మిన‌హా ఎలాంటి ప్ర‌త్యేక‌తా తేల‌ద‌ని ఎద్దేవా చేశారు..

capture14

ఆంధ్రుల్ని బీజేపీ వెన్నుముక లేని వారిగా ఆత్మాభిమానం లేనివారిగా భావిస్తోంద‌ని జ‌న‌సేనాని ఆరోపించారు.. జై ఆంధ్ర ఉద్య‌మంలో 400 మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయార‌ని., వారి త్యాగాన్ని జాతి ఎప్ప‌టికీ మ‌ర్చిపోద‌న్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆ ప్రాణాలు కోల్పోయిన 400 మంది అమ‌ర‌వీరులపై ఒట్టేసి చెబుతున్నా., ఇచ్చిన హామీకి స‌మాధానం చెప్ప‌కుంటే బీజేపీని వ‌దిలేది లేద‌ని తీవ్రంగా హెచ్చ‌రించారు..

 

Share This:

609 views

About Syamkumar Lebaka

Check Also

బెజ‌వాడ వేదిక‌గా పేలిన జ‌న‌సేన బాంబు.. దీపావ‌ళి రోజున ప‌చ్చ బాబుల‌కి ప‌వ‌ర్ పంచ్‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ, రౌడీ షీట‌ర్‌గా పేరున్న తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు కాట్ర‌గ‌డ్డ బాబు, గ‌డ‌చిన నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 2 =