Home / పోరు బాట / హోదా కోసం చెన్నై త‌ర‌హా పోరు.. ఏపీ యువ‌త‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు..

హోదా కోసం చెన్నై త‌ర‌హా పోరు.. ఏపీ యువ‌త‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు..

16265437_408904399456217_5666331034085526105_n16195569_402997130049142_4966072273055661955_n

త‌మ హ‌క్కుల సాధ‌న‌కు కుల‌,మ‌తాల‌కు అతీతంగా పోరాడి కేంద్రంపై విజ‌యం సాధించిన త‌మిళ ప్ర‌జ‌ల నుంచి స్ఫూర్తి పొందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌., త‌మ హ‌క్కు ప్రత్యేక హోదా సాధ‌న కోసం జ‌న‌సేన నేతృత్వంలో ఓ భారీ ఉద్య‌మానికి రూప‌క‌ల్ప‌న చేసింది.. నిశ్శ‌బ్ద నిర‌స‌న పేరుతో దిక్కులు పిక్క‌టిల్లేలా పొలికేక‌కు రెఢీ అయ్యింది.. త‌మ నిర‌స‌న తెలిపేందుకు జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డేని ఎంచుకుంది.. వేదిక‌లుగా ఉత్త‌రాంధ్ర‌, ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల నుంచి మూడు ప్ర‌దేశాల‌ను ఎంచుకుంది.. తిరుప‌తి ఎస్‌వి యూనివ‌ర్శిటీ., బెజ‌వాడ ప్ర‌కాశం బ్యారేజీ దిగువ‌న‌, వైజాగ్ ఆర్కే బీచ్‌లు వేదిక‌గా చెన్నై త‌ర‌హాలో ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దించాల‌ని నిర్ణ‌యించుకుంది.. పార్టీలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా త‌ర‌లివ‌చ్చి., ఆంధ్రుల స‌త్తా ఏంటో కేంద్రానికి చాటాల‌ని భావిస్తోంది..

16195770_1900695073494737_8992278215970579242_n

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కై యువ‌త చేప‌ట్టిన నిశ్శ‌బ్ద నిర‌స‌న‌కు ఇప్ప‌టికే రాష్ట్ర ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల సంఘం మ‌ద్ద‌తు తెల‌ప‌డా., తాజాగా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సైతం మ‌ద్ద‌తు తెలిపారు.. ట్విట్ట‌ర్ ద్వారా త‌న మ‌ద్ద‌తుపు జ‌న‌సేనాని త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.. ప‌వ‌న్‌ మ‌ద్ద‌తుతో నిశ్శ‌బ్ద ఉద్య‌మానికి ఒక్క‌సారిగా ఫ్యాక్ట‌రీ సైర‌న్ మించిన శ‌బ్దం వ‌చ్చిన‌ట్ట‌య్యింది.. వెయ్యి ఓల్ట్‌ల ప‌వ‌ర్ పుట్టింది.. త‌మ‌కు కావ‌ల్సింది సాధించుకోవ‌డంలో త‌మిళ తంబిలే కాదు., తెలుగు ప్ర‌జ‌లు కూడా ఏం త‌క్కువ తిన‌లేద‌నే అంశాన్ని నిరూపిస్తామని యువ‌త అంటోంది.. అన్ని వ‌ర్గాలు, వ‌య‌సుల వారికి కూడా ఈ నిర్శ‌బ్ద ఉద్య‌మానికి ఆహ్వానం ప‌లికింది..

power-protest

అటు నీతిమాలిన‌, స్వార్ధ‌పూరిత‌, నేర‌పూరిత రాజ‌కీయాల‌పై పోరాటానికి దేశ్ బ‌చావ్ పేరుతో ఓ మ్యూజిక‌ల్ ఆల్బ‌మ్‌ని జ‌న‌సేన రూపొందిస్తోంది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌రిగిన మోసంతో పాటు పాల‌కుల తీరుకి ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు ప్ర‌తిభింబించే ఈ ఆల్బ‌మ్ ఫిబ్రవ‌రి 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు..

పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు మిన‌హా అన్న శ్రీశ్రీ విప్ల‌వ క‌విత‌ను గుర్తు చేసుకుంటూ., ప‌వ‌న్‌టుడే కూడా ఈ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తోంది.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు.. అనే ప‌వ‌ర్‌స్టార్ నినాదాన్ని దిక్కులు పిక్క‌టిల్లేలా కేంద్రానికి వినిపిద్దాం.. మ‌న‌ల్ని పౌరుషం లేని వారిగా చూస్తున్న కేంద్రానికి బుద్ది చెబుదాం.. ఆంధ్రాయూత్ స‌త్తా ఏంటో చూపుదాం.. హోదాతోనే బ‌తుకు., హోదాతోనే అన్నీ.. ఇదే మ‌న నినాదం.. త‌ర‌లిరండి.. నిశ్శ‌బ్దాన్ని చేదిద్దాం..

Share This:

1,452 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × three =