Home / పోరు బాట / హోదా కోసం జ‌రిగే ప్ర‌జా ఉద్య‌మం అంద‌రిదీ.. జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తిస్తుంది.. రాష్ట్ర మేలు కోరే ప్ర‌తి ఒక్క‌కూ క‌ద‌లండి-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

హోదా కోసం జ‌రిగే ప్ర‌జా ఉద్య‌మం అంద‌రిదీ.. జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తిస్తుంది.. రాష్ట్ర మేలు కోరే ప్ర‌తి ఒక్క‌కూ క‌ద‌లండి-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

16195569_402997130049142_4966072273055661955_n

త‌మ సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లిక‌ట్టుని కాపాడుకోవ‌డం కోసం త‌మిళులు చేసిన ఐక్య‌పోరాటం., ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌లో క‌సిని రగిల్చింది.. ఒక్క చెన్నైలో మెరీనా బీచ్ వేదిక‌గా జ‌రిగిన ఉద్య‌మానికి కేంద్రం క‌ద‌లివ‌చ్చిందే., మ‌రి మ‌నం అలా చేయ‌లేమా..? మ‌న హ‌క్కు అయిన ప్ర‌త్యేక హోదా సాధించ‌లేమా అన్న పౌరుషం వ‌చ్చింది.. ఆ పౌరుషం నుంచి పుట్టిందే ఈ నిశ్శ‌బ్ద ఉద్య‌మం.. విశాఖ ఆర్కే బీచ్ వేదిక‌గా రిప‌బ్లిక్ డే నాడు ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా చెన్నైని మించిన ఉద్య‌మాన్ని చేప‌ట్టాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త పిలుపు నిచ్చింది.. మ‌న హ‌క్కుని కాపాడుకునేందుకు త‌మిళ‌నాడులో అయితే ప్ర‌జ‌లు ఎలా ఏక‌మ‌య్యారో.., పార్టీలు, ప్రాంతాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా అంతా హోదా సాధ‌న కోసం క‌ల‌సి రావాలని పిలుపు నిచ్చారు.. కేంద్రం దిగివ‌చ్చే వ‌ర‌కు పోరాడాల‌ని నిర్ణ‌యించుకుంది…

16195770_1900695073494737_8992278215970579242_n

ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త పిలుపుకి., జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందించారు.. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం జ‌రిగే ఈ ప్ర‌జా ఉద్య‌మానికి జ‌న‌సేన పార్టీ త‌రుపున మ‌ద్ద‌తు ప‌లికారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఎక్క‌డ, ఎలాంటి పోరాటం జ‌రిగినా జ‌న‌సేన పార్టీ, పార్టీ శ్రేణుల మ‌ద్ద‌తు ఉంటుంద‌న్న‌ది జ‌న‌సేనాని ప్ర‌క‌ట‌న సారాంశం.. జ‌న‌వ‌రి 26 ఆర్కే బీచ్ ఉద్య‌మంలో పార్టీ శ్రేణులు పాల్గొంటాయి.. ఇది ప్ర‌జ‌ల్లోంచి పుట్టిన ప్ర‌జా ఉద్య‌మం.. ప్ర‌జా ఉద్య‌మంగానే ఉండాల‌న్న‌ది జ‌న‌సేనాని, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆకాంక్ష‌.. రాష్ట్ర మేలు, రాష్ట్ర ప్ర‌జ‌ల మేలు కోరుకునే ప్ర‌తి ఒక్క‌రు ఈ ప్ర‌జా ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ప‌వ‌న్ పిలుపునిస్తున్నారు..

scspk

ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త శాంతియుత పోరాటంతో త‌మ స‌త్తా చాటాలి.. వేయిగొంతుక‌ల్ని ఒక్క‌గొంతుగా మార్చి ల‌క్ష్యం దిశ‌గా అడుగులు వేయాలి…. అప్పుడే ప్ర‌త్యేక హోదాపై కేంద్రం దిగివ‌స్తుంద‌ని జ‌న‌సేనుడు పిలుపునిచ్చారు.. రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారి స్వ‌చ్చందంగా యువ‌త ముందుకి క‌ద‌లివ‌చ్చి రూప‌క‌ల్ప‌న చేసిన ఈ ఉద్య‌మం., రాష్ట్ర ప్ర‌జ‌ల బాగుకోరి చేస్తున్న ఉద్య‌మ‌మే.. త‌మిళ‌నాడు జ‌ల్లిక‌ట్టు పోరు మాదిరే., కుల‌,మ‌త‌, పార్టీల‌కు అతీంత‌గా ప్ర‌తి ఒక్క‌రూ క‌దిలివ‌చ్చి విజ‌య‌వంతం చేస్తార‌న్న న‌మ్మ‌కాన్ని ప‌వ‌న్ వ్య‌క్తం చేస్తున్నారు.. జ‌న‌సేన పార్టీ ల‌క్ష్యం ప్ర‌త్యేక హోదా., అదే ల‌క్ష్యంతో పోరాడే ప్ర‌తి ఒక్క‌రూ ఈ ప్ర‌జా ఉద్య‌మానికి సంఘీభావం తెల‌పాల‌ని కోరుతున్నారు.. అన్ని ప్రాంతాల్లో జ‌రిగే ఈ ప్ర‌జా ఉద్య‌మంలో జ‌న‌సేన పార్టీ శ్రేణులు పాల్గొంటాయి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్ని పౌరుషం లేనివారిగా., వెన్నెముక లేనివారిగా భావిస్తున్న కేంద్రం., ఈ ప్ర‌జా ఉద్య‌మం దెబ్బ‌కి దిగిరావాలని., రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సిద్ధించాల‌ని జ‌న‌సేనానదోఎి మ‌న‌స్ఫూర్తిగా కిోరుకుంటున్నారు..

Share This:

635 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − twelve =