Home / ఎడిటోరియల్స్ / హోదా పోరులో ప‌వ‌న్ త‌దుప‌రి అడుగులు ఏంటి..? ప్ర‌త్య‌ర్ధుల్ని క‌ల‌వ‌ర పెడుతున్న జ‌న‌సేనుడు..

హోదా పోరులో ప‌వ‌న్ త‌దుప‌రి అడుగులు ఏంటి..? ప్ర‌త్య‌ర్ధుల్ని క‌ల‌వ‌ర పెడుతున్న జ‌న‌సేనుడు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న హామీల అమ‌లుకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వేస్తున్న అడుగులు ప్ర‌త్య‌ర్ధుల‌ని క‌ల‌వ‌ర పెడుతున్నాయి.. తిరుప‌తి స‌భ‌లో ప్ర‌త్యేక హోదా అంశాన్ని గుర్తు చేసిన నాటి నుంచి ప్ర‌జాప్ర‌యోజ‌నార్ధం ఆయ‌న చేసిన ప్ర‌తి అడుగుని హైజాక్ చేసేందుకే అధికార‌-ప్ర‌తిప‌క్షాలు తాప‌త్ర‌య ప‌డుతున్నాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ప్ర‌త్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం చేస్తోంది మేమే అని చెప్పుకుని తిరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంపై ఒత్తిడి పెంచ‌డానికి అవిశ్వాసం పెట్టాల‌న్న ఆలోచ‌న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పే వ‌ర‌కు గుర్తుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.. ఉద్దానం బాధితుల‌కి ఊర‌ట‌నిచ్చే క్ర‌మంలో జ‌న‌సేన అధినేత చేసిన కృషిని ఆ ప్రాంత వాసులు గుర్తిస్తే., ఉద్దానం బాధితుల కోసం ముందు ఫైట్ చేసింది మేమే అని చెప్పుకోవ‌డం.. ఇక నాలుక ఎన్నిర‌కాలుగా మ‌డ‌త ప‌డితే అన్ని ర‌కాలుగా మాట‌లు మార్చే తెలుగుదేశం పార్టీ కూడా ఈ మ‌ధ్య జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పోటీ ప‌డే ప్ర‌య‌త్నం చేస్తోంది.. ముఖ్యంగా ఆయ‌న ఎలాంటి అడుగులు తీసుకోబోతున్నాడు అనే విష‌యాన్ని ముందే గుర్తించి., ఆయ‌న కంటే ముందుగా ఆ అడుగులు వేసేయాల‌ని, స‌ద‌రు క్రెడిట్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ద‌క్క‌కుండా చేయాల‌న్న తాప‌త్ర‌యం భాగా ఎక్కువ‌గా క‌న‌బ‌డుతోంది..

జ‌న‌సేన అధినేత పాద‌యాత్ర ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు., అదే రోజు ఆయ‌న కంటే ముందుగా సైకిల్ యాత్ర చేయ‌డం.. అదీ కేవ‌లం ప‌చ్చ చొక్కాలు వేసుకున్న తెలుగు త‌మ్ముళ్ల స‌హ‌కారంతో.. అది కాస్త జ‌న‌సేనాని పాద‌యాత్ర ముందు దిగ‌దుడుపుగా మార‌డంతో సాక్ష్యాత్తు ముఖ్య‌మంత్రి వ‌ర్యులే అస‌హ‌నంతో ర‌గిలిపోయి., త‌న‌ను గ‌ద్దెనెక్కించ‌డంలో స‌హ‌క‌రించార‌న్న కృత‌జ్ఞ‌త మ‌ర‌చి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం కూడా జ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నారు..

రెండు బ‌హిరంగ స‌భ‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో హోదా స్ఫూర్తి ర‌గ‌ల్చ‌డంతో పాటు జెఎఫ్‌సీ ఏర్పాటుతో రాజ‌కీయ డ్రామాలు ఆడుతున్న పార్టీల‌ని బాకుతో పొడిచి మ‌రీ నిద్ర‌లేపారు.. అవిశ్వాసం అనే మాట ఆయ‌న నుంచి రావ‌డం వ‌ల్లే ఢిల్లీలో మోడీ స‌ర్కారు పూర్తి మ‌ద్ద‌తు ఉన్నా పార్ల‌మెంటుని ముందుకి న‌డ‌ప‌లేక పోయింది.. జ‌న‌సేన అధినేత ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష అన్న ప‌ధం ప‌లికాకే., వైసీపీ ఎంపిల‌కి ఆమ‌ర‌ణ దీక్ష ఆర్డ‌ర్ పాస్ చేశారు ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. ఇది నిజం కాదు.. మేము ఆది నుంచి నిజాయితీగా పోరాటం చేస్తున్నాం అనే వారు ఎవ‌రైనా., ముందుకి వ‌చ్చి జ‌న‌సేన అధినేత ప్ర‌క‌టించే వ‌ర‌కు మీ నోటి నుంచి ఆ మాట ఎందుకు రాలేదో స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.. ఖ‌చ్చిత‌మైన స‌మాధానం ద‌గ్గ‌ర పెట్టుకుని ఎవ‌రైనా ఎలాంటి వాద‌నైనా, విమ‌ర్శ అయినా చేయొచ్చు.. చౌక‌భారు విమ‌ర్శ‌లు చేస్తే అన్నీ ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నిస్తున్న జ‌నం ఛీ కొడ‌తారు.. ఆ భ‌యం అంద‌రిలోనూ ఉన్నా పైకి మాత్రం మేక‌పోతు గాంభీర్యం క‌న‌బ‌ర్చ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి..

రెండు రోజుల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వ‌ర్యులు జ‌న‌సేన అధినేత‌పై సంధించిన విమ‌ర్శ‌, అవిశ్వాసానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ఢిల్లీ రాలేదేంటి..? అన్న ప్ర‌శ్న‌.. మాట మీద నిల‌క‌డ‌లేని మీరు ఈ విమ‌ర్శ చేయ‌డం దెయ్యాలు వేదాలు వ‌ల్లించ‌డ‌మే.. ఇక్క‌డ మీరు గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. అవిశ్వాసం పెట్ట‌డానికి మా సంఖ్యా బ‌లం చాల‌దు.. ఎలా పెట్టాల‌ని మీరు గ‌గ్గోలు పెడితే., అవిశ్వాసానికి టిఆర్ఎస్, కాంగ్రెస్ స‌హా అన్ని పార్టీలు మ‌ద్ద‌తు ఇస్తాయి.. ఒక‌వేళ సంఖ్యా బ‌లం త‌గ్గిన ప‌క్షంలో., తాను రంగంలోకి దిగి మ‌ద్ద‌తు కూడాగ‌డ‌తాను అన్నారు.. ఈ పాయింట్ అధికార‌-విప‌క్షాలు రెండూ గ‌ట్టిగా గ‌మ‌నించాలి.. ఒక వేళ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు చాల‌ని ప‌క్షంలో.. మీరు అవిశ్వాసం పెట్ట‌గానే మ‌ద్ద‌తు మేమిస్తాం.. అంటే మేమిస్తాం.. అంటూ పార్టీలు ఎగ‌బ‌డితే., ఇంకా ఆయ‌న ఢిల్లీ ఎవ‌రి కోసం రావాలి..? ఎందు కోసం రావాలి..

రాష్ట్రంలో ఉండి.. ప్రజా పోరాటాల ద్వారా.. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను కేంద్రానికి తెలిపే ప‌నిని ఆయ‌న భుజాన వేసుకుంటే., మీరు చెయ్యాల్సిన ప‌ని మీరు చెయ్య‌కుండా చౌక‌బారు విమ‌ర్శ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు..? ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే ముందు ఒక్క‌సారి ఈ ప్ర‌శ్న‌ను మీకు మీరు వేసుకుంటే మంచిది అన్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల సూచ‌న‌..

ఇదంతా రోజు రోజుకీ ప్ర‌జ‌ల్లో త‌మ ప్ర‌తిష్ట‌ని దిగ‌జార్చేస్తుంద‌ని తెలుసుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీలు.. ప‌వ‌న్ అడుగుల‌ను ముందే గుర్తించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి.. స‌ర్కారు త‌న‌కున్న అధికార బ‌లంతో నిఘా విభాగాన్ని రంగంలోకి దించినా ఫ‌లితం ద‌క్క‌లేదు.. వైసీపీ అయితే ఏకంగా కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది.. విజ‌య‌వాడ‌లో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కి అంటూ వ‌చ్చిన జ‌న‌సేన అధినేత మూడో రోజు పాద‌యాత్ర‌తో ఇరు ప‌క్షాల‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు.. ఇప్పుడు అనంత‌లో మ‌రో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కి బ‌య‌లుదేరుతున్నారు.. వామ‌ప‌క్షాల స‌భ‌, రైతులు, మేధావుల‌తో స‌మావేశం అని చెబుతున్నా., టూర్ షెడ్యూల్ ఇంకా ఏమైనా ఉందా..? ఆయ‌న ఏం చేయ‌బోతున్నారు అన్న ఆలోచ‌న ఇరు పార్టీల‌కి కునుకు ప‌ట్ట‌నీయ‌డం లేదు.. జ‌న‌సేనుడి యాక్ష‌న్ ప్లాన్ తెలిస్తే., అదేదో తాము ముందే చేసేయ‌డం ద్వారా ఆయ‌న‌కి చెక్ పెట్టాల‌న్న‌ది ప్ర‌త్య‌ర్ధుల ఆలోచ‌న‌.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ యాక్ష‌న్ ప్లాన్ ప్ర‌క‌టించాక‌., హ‌డావిడి చేస్తే ప్ర‌జ‌ల ముందు ప‌రువు పోతోంది.. అందుకే జ‌న‌సేనుడి జాడ‌ల్ని చాలా నిశితంగా ప‌రిశీలిస్తున్నాయి టీడీపీ-వైసీపీలు.. ఈ ప‌రిస్థితి జ‌న‌సేన శ్రేణుల్లో మాత్రం ఉరిమే ఉత్సాహాన్ని నింపుతోంది..

Share This:

2,990 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 12 =