Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / హోదా రాదు.. ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త లేదు.. ఆ ఘ‌న‌కార్యం చేసిన ఘ‌నుడికి స‌న్మాన‌మంట‌..!

హోదా రాదు.. ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త లేదు.. ఆ ఘ‌న‌కార్యం చేసిన ఘ‌నుడికి స‌న్మాన‌మంట‌..!

blurr2

ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమ‌లింగం అని ఒక సామెత ఉంది విన్నారా.. మ‌న ఏపీలో రాజ‌కీయ నాయ‌కుల తీరు అలాగే ఉంది మ‌రి.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండున్న‌రేళ్లు గ‌డ‌చిపోయింది.. విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీలు., ఏ తుంగ‌లో తొక్కారో ఎవ‌రికీ తెలియ‌దు.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌నం ఓట్ల‌తో గెలిచిన నేత‌లు మాత్రం విభ‌జ‌న హామీల అమ‌లుకు ప్ర‌య‌త్నిస్తున్నాం అని చెబుతూనే ఉన్నారు.. విభ‌జ‌న తీరు స‌రిగా లేదంటూ ఆనాడు పెద్ద‌ల స‌భ‌లో విప‌క్షం అడ్డుప‌డితే., న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకునేందుకు ఐదేళ్ల పాటు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని అదే స‌భ సాక్షిగా ఆనాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ హామీ ఇచ్చారు.. అప్ప‌డు అదే స‌భ‌లో ఉన్న గౌర‌వ‌నీయులైన ఇప్ప‌టి కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు గారు ఐదు చాల‌దు ప‌దేళ్లు కావాలి అన్నారు.. ఇక నేనెందుకు త‌క్కువ తినాలి అని భావించిన సిఎం చంద్ర‌బాబుగారు సంఖ్యే క‌దా పెంచేస్తే పోలా అని., 15 ఏళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.. కేంద్ర‌, రాష్ట్రాల్లో భాగ‌స్వామ్య ప‌క్షాలే గ‌ద్దెనెక్కాయి.. ఈ రెండున్న‌రేళ్ల‌లో ఏ ఒక్క‌రికీ ఆ నాడు అడిగిన ప్ర‌త్యేక హోదా అంశం అస్సలు గుర్తుకు రాలేదు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో నేటి పాల‌కుల కోసం ఓట్ల‌డిగిన పాపానికి., జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ హామీల అమ‌లుకు ప‌ట్టుబ‌ట్టారు.. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న మిగిలిన స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూనే., ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం క‌థ‌న రంగంలోకి దిగారు.. తాను మ‌ద్ద‌తిచ్చిన ప్ర‌భుత్వాల‌నే జ‌నం సాక్షిగా నిల‌దీయ‌డం మొద‌లు పెట్టారు.. ఆయ‌న అలా జ‌నంలోకి వ‌చ్చారో లేదో.. ఇలా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో ప్ర‌కంప‌న‌లు పుట్టేశాయి.. జ‌నానికి ఏం చెప్పాలో అర్ధం కాక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ్డారు.. ఫైన‌ల్‌గా ప్ర‌త్యేక హోదా తూచ్‌.. ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చేస్తాం.. అదీ అక్ష‌రాలా 2.25 ల‌క్ష‌లు అని అనౌన్స్ చేసేశారు.. అంతేకాదు హోదాతో పోలిస్తే.. ఈ ప్యాకేజీ ఎన్నో రెట్లు మెరుగు అంటూ పిచ్చ జ‌నాన్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు..

ఇందంతా ఒక ఎపిసోడ్ అయితే., ఇంత వ‌ర‌కు ఆ ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త లేదు.. ప్ర‌త్యేక హోదాపై నాటి ప్ర‌ధాని ఏ ర‌కంగా నోటిమాట‌తో హామీ ఇచ్చారో., ఇప్పుడు ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ గారు అదే తీరున ఓ ప్ర‌క‌ట‌న‌తో స‌రిపెట్టారు.. ఇక ఇక్క‌డ —– హ‌డావిడి మొద‌లైంది గానాభ‌జానా.. ఈ టీంకి నాటి ప‌దేళ్ల హోదా వెంక‌య్య‌గారు, నేటి సిఎం చంద్ర‌బాబు గారు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు.. ఎక్క‌డికి వెళ్లినా ఈ ఇద్ద‌రి నోటా వ‌చ్చే కామ‌న్ డైలాగులు.. ఏపీలో అభివృద్ది భేష్‌., బాబు సూప‌ర్ సిఎం.. ఇది వెంక‌య్య‌గారి మాట‌.. ఇక బాబు గారేమో మ‌న నాయుడి గారి పుణ్య‌మే ఈ ప్యాకేజీ అంటారు.. ఒక అబ‌ద్దాన్ని వంద‌సార్లు చెప్పి దాన్ని నిజంగా మార్చేయోచ్చ‌న్న‌ది వీరి ఉద్దేశం కావ‌చ్చు.. అయితే వీరి గుట్టును ర‌ట్టు చేసేందుకు ప‌వ‌న్ అనంత‌లో చైత‌న్య స‌భ‌పై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు..

జ‌న‌సేనాని ప్ర‌క‌ట‌న‌తో మ‌ళ్లీ వీరిలో కంగారు మొద‌లైంది.. ఒక అబ‌ద్దాన్ని తాము వంద‌సార్లు చెప్పినా దాన్ని న‌మ్మ‌ని జ‌నం., ప‌వ‌ర్‌స్టార్ ఒక్క‌సారి చెబితే దాన్నే ముడేసుకుంటారు.. ఈ కంగారులో ఏం చేయాలో అర్ధంకాని మ‌న నేత‌లు ఆ నిబ‌ద్ధ‌తలేని ప్యాకేజీ సాధించుకొచ్చి జ‌నాన్ని మోసం చేసిన ఆ వెంక‌య్య‌గారికి స‌న్మానం కూడా చేసేస్తున్నారంట‌.. ప‌వ‌న్ ప్ర‌శ్నిస్తే… మీకేం తెలుసు, మీ అనుభ‌వం ఎంత అంటారు.. మ‌రి మీకు తెలిసిన రాజ‌కీయ అనుభ‌వం ఏంటి..? అంకెల గార‌డీతో జ‌నాన్ని మోసం చేయ‌డ‌మా..? జ‌నానికి నిజం చెప్ప‌క‌పోవ‌డ‌మా..?

ఇలాంటి ఘ‌నుల‌కి స‌న్మాన‌మంట‌.. నేడే కాకినాడ‌లో…. ఇలాంటి ఘ‌నుల్ని ఏం చేయాలి..? ఏపీలో పాల‌కుల దెబ్బ‌కు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న నా స‌హ జ‌నులారా.. వారిని ఏం చేయాలో మీరే తేల్చుకోండి..

Share This:

1,434 views

About Syamkumar Lebaka

Check Also

టార్గెట్ జేడీ మిస్ ఫైర్‌.. టాపిక్ డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయి(ఏ2)..

వెనుక‌టికి ఒక‌మ్మ రంకు బ‌య‌ట‌ప‌డిందని బొంకు మొద‌లుపెట్టిందంట‌..! అలా ఉంది వైసీపీ త‌ప్పుడు లెక్క‌ల ఆడిట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి.. అధికారిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + eight =