Home / జన సేన / హోదా సాధించే వ‌ర‌కు మీకు నిద్ర‌లేని రాత్రులే.. అధికార‌-విప‌క్షాల‌కు జ‌న‌సేన హెచ్చ‌రిక‌..

హోదా సాధించే వ‌ర‌కు మీకు నిద్ర‌లేని రాత్రులే.. అధికార‌-విప‌క్షాల‌కు జ‌న‌సేన హెచ్చ‌రిక‌..

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఎవ‌రితో క‌ల‌సి అయినా పోరాడేందుకు సిద్ధ‌మ‌ని ఎప్పుడో చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, పోరాడేది ప్ర‌త్య‌ర్ధి అయినా రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల రిత్యా, వారికి అండ‌గా ఉండేందుకు మ‌ద్ద‌తు తెలిపేందుకు తాను వెనుక‌డ‌బోన‌ని మ‌రోసారి నిరూపించారు.. హ‌స్తిన వేదిక‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న పార్ల‌మెంటు స‌భ్యుల‌కి పార్టీ త‌రుపున సంఘీభావం ప్ర‌క‌టించారు.. పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌రెడ్డి, ప్ర‌తినిధులు అద్దెప‌ల్లి శ్రీధ‌ర్‌, పార్ధ‌సార‌ధిలు జ‌న‌సేనుడి సందేశాన్ని ప్ర‌జ‌ల ముందు ఉంచారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడే ప్ర‌తి ఒక్క‌రికీ జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు..
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడే ప్ర‌తి ఒక్క‌రికీ జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు..

ముఖ్యంగా నిర‌స‌న‌లు, ఆమ‌ర‌ణ దీక్ష‌లు చేప‌డుతున్న పార్ల‌మెంటు స‌భ్యుల‌కి సంఘీభావం తెలిపారు.. నిరాహార‌దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపిల్లో వ‌య‌సులో పెద్ద‌వార‌యిన ముగ్గురు ఇప్ప‌టికే ఆసుప‌త్రికి చేరార‌న్న శ్రీధ‌ర్‌., కేంద్రం ఒక్క‌సారి వారితో సంప్ర‌దింపులు జ‌రిపి ఉంటే భాగుండేద‌న్నారు.. అటు టీడీపీ ఎంపిలు ప్ర‌ధాని నివాసం ముందు నిర‌స‌న తెలియజేస్తే, ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేసిన తీరు ప‌ట్ల జ‌న‌సేన నాయ‌కులు ఆసంతృప్తి వ్య‌క్తం చేశారు.. పోలీసుల తీరు ఏ మాత్రం గౌర‌వ‌ప్ర‌ధంగా లేద‌న్న వారు, ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించే తీరు ఇదేనా అంటూ ప్ర‌శ్నించారు.. ఢిల్లీ వేదిక‌గా నిర‌స‌న తెలుపుతున్న ఇరు పార్టీల ఎంపిల‌కి జ‌న‌సేన త‌రుపున మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు..

ఓ వైపు పోరాటానికి మ‌ద్ద‌తు తెలుపుతూనే., మ‌రోవైపు హోదా పోరులో పార్టీల వ్య‌వ‌హార శైలిపై సూటిగా సుతిమెత్త‌గా చుర‌క‌లు అంటించారు జ‌న‌సేన నాయ‌కులు.. ముఖ్యంగా వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేసిన తీరు స‌రిగా లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. పార్ల‌మెంటు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాక రాజీనామాలు చేస్తే ఎప్ప‌టికి ఆమోదం పొందాల‌ని ప్ర‌శ్నించారు.. స‌భ న‌డుస్తున్న స‌మ‌యంలో రాజీనామాలు ఇస్తేనే ఆమోదం పొందుతాయ‌న్న విష‌యాన్ని జ‌న‌సేన ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల ముందు ఉంచారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కి న్యాయం జ‌ర‌గాలంటే లోక్‌స‌భ, రాజ్యస‌భ స‌భ్యుల‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని డిమాండ్ చేశారు..

బెజ‌వాడ వేదిక‌గా జ‌రిగిన త‌మ పార్టీ అధినేత పాద‌యాత్ర‌పై ప్ర‌త్య‌ర్ధులు చేస్తున్న వ్యాఖ్య‌ల్ని తిప్పికొట్టారు.. జ‌న‌సేనాని ఒక్క పిలుపుతో 40 వేల మంది పాద‌యాత్ర‌కి త‌ర‌లివ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేసిన శ్రీధ‌ర్‌, రాష్ట్ర వ్య‌ప్తంగా కూడా ప్ర‌తి జిల్లా, మండ‌ల కేంద్రాల్లో ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌ల్లో పాల్గొన్నార‌న్నారు.. రాష్ట్ర ప్ర‌జ‌లు మొత్తం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెంట ఉండేందుకు సిద్ధంగా ఉన్నార‌న‌డానికి అంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌ని ప్ర‌శ్నించారు.. జ‌న‌సేనాని పాద‌యాత్ర‌కి పిలుపు ఇచ్చాక‌నే ముఖ్య‌మంత్రి హ‌డావిడిగా సైకిల్ యాత్ర‌కి పిలుపునిచ్చార‌ని ఆరోపించారు.. చంద్ర‌బాబు, వాళ్ల‌బ్బాయి లోకేష్ చేసిన యాత్ర‌ల్ని ప్ర‌జ‌లంతా చూశార‌న్నారు..

ఇక ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ జ‌న‌సేనుడిపై చేసిన వ్యాఖ్య‌లు అర్ధ‌ర‌హితంగా ఉన్నాయ‌న్న జ‌న‌సేన ప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు మొత్తం జ‌న‌సేనాని వెంటే ఉన్నార‌న్నారు.. ప్ర‌తిప‌క్ష నేత‌గా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన జ‌గ‌న్‌, స‌భ‌ని , ప్ర‌జ‌ల్ని కూడా వ‌దిలేశార‌ని ఆరోపించారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కేవ‌లం త‌మ పార్టీ అధినేత మాత్ర‌మే చిత్త‌శుద్దితో స్పందిస్తున్నార‌న్న అద్దేప‌ల్లి శ్రీధ‌ర్‌, అవిశ్వాసం వ్య‌వ‌హారంలో ఏ పార్టీకైనా , ఆఖ‌రికి టీడీపీకి కూడా జ‌న‌సేనుడే దిక్సూచి అన్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దంటూ హెచ్చ‌రించారు..

బీజేపీ స‌ర్కారు ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో వెన‌క‌డుగు వేస్తుంటే., అధికార-విప‌క్షాలు వారిని నిల‌దీయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయ‌న్నారు.. ఆ రెండు పార్టీలు కేసుల భ‌యంతోనే బీజేపీ స‌ర్కారుని నిల‌దీయ‌డం లేద‌న్న చ‌ర్చ ప్ర‌జ‌ల్లో న‌డుస్తోంద‌న్నారు.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు నెర‌వేరే వ‌ర‌కు ప్ర‌జాక్షేత్రంలో జ‌న‌సేన పోరాటం చేస్తూనే ఉంటుంద‌న్న ఆ పార్టీ ప్ర‌తినిధులు, త‌మ కార్యాచ‌ర‌ణ‌తో అధికార-ప్ర‌తిప‌క్షాల‌కి ఇక కంటిమీద కునుకు లేకుండా చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు..

ఇది ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తున్న పార్టీ చేస్తున్న పోరాటం.. ప్ర‌జావంచ‌క పార్టీల‌కి చేస్తున్న హెచ్చ‌రిక కాచుకొండిక‌..

Share This:

1,710 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − two =