Home / జన సేన / హ‌రిరామ‌జోగయ్య‌కు జ‌న‌సేనాని ప‌రామ‌ర్శ‌.. జ‌న‌సేన‌కు సీనియర్ నేత దిశానిర్ధేశం..

హ‌రిరామ‌జోగయ్య‌కు జ‌న‌సేనాని ప‌రామ‌ర్శ‌.. జ‌న‌సేన‌కు సీనియర్ నేత దిశానిర్ధేశం..

మాజీ మంత్రి, మాజీ పార్ల‌మెంటు స‌భ్యులు చేగొండి హ‌రిరామజోగ‌య్య‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌రామ‌ర్శించారు. అనారోగ్యంతో ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.. ఆదివారం ఉద‌యం జోగయ్య‌ను ప‌రామ‌ర్శించిన జ‌న‌సేనాని ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు.. చికిత్స గురించి వైద్యుల‌తో మాట్లాడారు.. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆకాంక్షించారు.. జ‌న‌సేన పార్టీకి, త‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కులుగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఈ సంద‌ర్బంగా హ‌రిరామ‌జోగయ్య‌ను ప‌వ‌న్ ఆడ‌గ‌గా, ఆయ‌న అంగీకారం తెలిపిన‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. నాడు పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఉండి కూడా త‌మ కుటుంబం కోసం 2009లో రాజీనామా చేసి వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు.. రాజ‌కీయాల్లో అపార‌మైన అనుభ‌వం ఉన్న ఆయ‌న స‌ల‌హాలు, ఆశీస్సులు అవ‌స‌రం వున్న నేప‌ధ్యంలో పోరాట యాత్ర సంద‌ర్బంగా పాల‌కొల్లు వెళ్లి ఆయ‌న్ని క‌లిసిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌కున్నా జ‌న‌సేన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశం మీద చర్చించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు.. హ‌రిరామ‌జోగయ్య త‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కులుగా ఉంటార‌ని ఈ సంద‌ర్బంగా జ‌న‌సేన అధినేత ప్ర‌క‌టించారు.. జ‌న‌సేన పార్టీకి ఎల్ల‌ప్పుడూ త‌న స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయ‌ని ఈ సంద‌ర్బంగా హ‌రిరామ‌జోగయ్య ప్ర‌క‌టించారు.. చివ‌రి శ్వాస వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ కోసం ప‌ని చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ప్ర‌జా క్షేమం కోరుతూ అంద‌రినీ సుర‌క్షితంగా చూసుకునే పార్టీ జ‌న‌సేన పార్టీ అన్న ఆయ‌న., మెగా ఫ్యామిలీ ప‌ట్ల త‌న‌కు ఉన్న అభిమానాన్ని వ్య‌క్త ప‌రిచారు..

Share This:

563 views

About Syamkumar Lebaka

Check Also

ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా ఓ సాంఘీక నాటక ప్రదర్శనలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించినందుకు దుర్గి ఎస్సై గ్రామస్తుల మీద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 2 =