Home / జన సేన / 2 కోట్ల సైన్యం టార్గెట్‌.. జ‌న‌సేన ఐటీ సెంట‌ర్ ప్రారంభోత్స‌వంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

2 కోట్ల సైన్యం టార్గెట్‌.. జ‌న‌సేన ఐటీ సెంట‌ర్ ప్రారంభోత్స‌వంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

జ‌న‌సేన పార్టీలో రెండు కోట్ల మందిని భాగ‌స్వాముల్ని చేయ‌డ‌మే ల‌క్ష్యంగా స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ న‌డుస్తోంద‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.. హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గంలో జ‌న‌సేన పార్టీ ఐటీ సెంట‌ర్‌(గిడుగు వెంట‌క‌రామ్మూర్తి ఇన్ఫ‌ర్‌మేష‌న్ సెంట‌ర్‌)ను ప్రారంభించిన ఆయ‌న‌., తెలుగు రాష్ట్రాల్లో ఓ సామాజిక, రాజ‌కీయ బాధ్య‌త‌తో కూడిన వ్య‌వ‌స్థ‌ని నిర్మించ‌డ‌మే జ‌న‌సేన పార్టీ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ఇప్పటి వ‌ర‌కు మిస్డ్‌కాల్ ద్వారా ఒక్క సీజ‌న్‌లోనే 10 ల‌క్ష‌ల మంది పార్టీ స‌భ్యులుగా చేరార‌ని, క్షేత్ర స్థాయి స‌భ్య‌త్వ న‌మోదుకి 20 ల‌క్ష‌ల పుస్త‌కాలు పంపించిన‌ట్టు తెలిపారు.. పార్టీ నిర్మాణం ఎంతో స‌హ‌నంతో చేయాల్సిన ప్ర‌క్రియ‌ని తెలిపిన ఆయ‌న‌., రాత్రికి రాత్రి అది పూర్త‌వ‌ద‌న్నారు.. స‌మ‌స్య‌ల్లో కూరుక‌పోయి ఉన్న వారికి, వ్య‌వ‌స్థ ఇవ్వాల్సిన అండ‌దండ‌ల‌కి దూరంగా ఉన్న వారికి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.. దేశం కోసం , స‌మాజం కోసం 25 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో ప‌ని చేసేందుకు సిద్ధ‌ప‌డి తాను వ‌చ్చాన‌ని తెలిపారు..

అంత‌కు ముందు గిడుగు వెంక‌ట‌రామ్మూర్తి ఐటీ సెంట‌ర్‌ను శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వ‌హించి జ‌న‌సేన అధినేత ప్రారంభించారు.. సుమారు 800 మంది వాలంటీర్లు ఈ కేంద్రం లో స్వ‌చ్చందంగా ప‌నిచేస్తున్నారు.. ఐటీ సెంట‌ర్‌కి వాలంట‌రీ స‌ర్వీస్ ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చిన ఐటీ నిపుణుల‌ను ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభినందించారు.. త్వ‌ర‌లోనే అంద‌ర్నీ ప్ర‌త్యేకంగా క‌లుస్తాన‌ని మాటిచ్చారు.. జ‌న‌సేన నేత‌ల‌కి, జ‌న‌సైనికుల‌కి ఉప‌యోగ‌ప‌డే విధంగా ఐటీ సెంట‌ర్‌, హ‌బ్ ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు.. ఐటీ సెంట‌ర్ ప‌ని తీరుని ఆయ‌న ప‌రిశీలించారు.. ఉద్యోగులంద‌రితో క‌ల‌సి సెల్ఫీ దిగి వారిని ఉత్సాహప‌రిచారు..

జ‌న‌సేన ఐటీ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తోట చంద్ర‌శేఖ‌ర్‌, పార్టీ రాజకీయ వ్యవహారం కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, పార్టీ నాయకులు ఎ.వి.రత్నం, శంకర్ గౌడ్, రియాజ్, పార్థసారథి, ఎం.కృష్ణారావు, ప్రభు, రవిప్రసాద్, అద్దేపల్లి శ్రీధర్ తదితరులు హాజ‌ర‌య్యారు..

Share This:

2,241 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 14 =