Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / 2019లో వ‌చ్చేస్తున్నా.. కాచుకోండి.. అనంత నుంచి జ‌న‌సేనాని స‌వాలు..

2019లో వ‌చ్చేస్తున్నా.. కాచుకోండి.. అనంత నుంచి జ‌న‌సేనాని స‌వాలు..

నేటి రాజ‌కీయ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌నే ల‌క్ష్యంగా జ‌న‌సేన పార్టీ స్థాపించిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా..? లేదా..? అనంత వేదికగా జ‌రిగిన సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ‌లో జ‌న‌సేనాని ఈ విష‌యంపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.. 2019 ఎన్నిక‌ల బ‌రిలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని తేల్చి చెప్పేశారు.. త‌న‌ను ఢీ కొట్టేందుకు రెఢీగా ఉండ‌మంటూ ప్ర‌త్య‌ర్ధుల‌కి స‌వాలు విసిరారు.. త‌న ల‌క్ష్యం ఏంటి అన్న విష‌యంపై కూడా పూర్తి స్ప‌ష్ట‌త ఇచ్చారు.. ఓ వ్యక్తికి, ఓ పార్టీకి తాను వ్య‌తిరేకిని కాద‌న్న ఆయ‌న‌., దారి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ని గాడిన పెట్టేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు..

త‌న దృష్టితో రాజ‌కీయాలు అంటే ఒక‌రిని ఒక‌రు తిట్టుకోవ‌డం కాద‌న్న ఆయ‌న‌.., కేవ‌లం జ‌నాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న విధానాలు, సిద్ధాంతాల‌పైన మాత్ర‌మే జ‌న‌సేన పోరాడుతుంద‌ని తేల్చేశారు.. రాజ‌కీయాలు అంటే తిట్టుకోవ‌డ‌మ‌నే సంప్ర‌దాయంలో మార్పు తేవాల‌న్న త‌న ల‌క్ష్యాన్ని క‌ల్లూరి వేదిక సాక్షిగా చాటారు..

గ‌త ఎన్నిక‌ల్లో తాను టీడీపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తూనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు త‌ప్పితే., వారి తాట తీస్తాన‌ని హెచ్చ‌రించారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో అల‌స‌త్వాన్ని తాను స‌హించ‌న‌న్న ఆయ‌న‌., అలాంటి వారికే తాను శ‌త్రువుని అని బ‌ల్ల‌గుద్ది చెప్పారు.. త‌న‌కు ప‌ద‌వులు, డ‌బ్బు అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న‌., బ‌ల‌మైన శ‌త్రువుని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండ‌మంటూ ప్ర‌త్య‌ర్ధుల‌కి స‌వాలు విసిరారు..
\
నాయ‌కులు చెప్పే మాట‌లు విని.. విని.. అలసిపోయాం. విసిగిపోయాం. ఇంకెంతకాలం ఈ మోసాలు? ఇక చాలు, ఇప్పటికైనా వ్యవస్థ మారాలి.. ఆ మార్పు కోస‌మే తాను ప్ర‌జా ప్ర‌తినిధిగా వ‌స్తున్నాన‌న్న జ‌న‌సేనాని., తాను గెలిచినా.. ఓడినా.. ప్ర‌జ‌లు త‌నకు అండ‌గా ఉన్నా లేకున్నా.. తాను మాత్రం స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో జ‌నానికి అండ‌గా ఉంటాన‌ని చెప్పారు.. జై కిసాన్‌.. జై జ‌వాన్ నినాద‌మే జ‌న‌సేన ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు..

మీరు చేస్తుంది త‌ప్పు.. మీ విధానాలు త‌ప్పు.. అని నేరుగా వేలెత్తి చూపిన ఆయ‌న‌., ఇదే అనంత‌లో జ‌న‌సేన పార్టీ తొలి కార్యాల‌యం ఏర్పాటు చేస్తున్నాన‌న్నారు.. వ‌చ్చేశా ఇక కాచుకోండి.. అంటూ ప్ర‌త్య‌ర్ధుల‌కి స‌వాలు విసిరారు..

Share This:

1,606 views

About Syamkumar Lebaka

Check Also

టార్గెట్ జేడీ మిస్ ఫైర్‌.. టాపిక్ డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయి(ఏ2)..

వెనుక‌టికి ఒక‌మ్మ రంకు బ‌య‌ట‌ప‌డిందని బొంకు మొద‌లుపెట్టిందంట‌..! అలా ఉంది వైసీపీ త‌ప్పుడు లెక్క‌ల ఆడిట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి.. అధికారిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + 10 =