Home / జన సేన / 2020 ఆప్తా(APTA)నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌కి జ‌న‌సేనాని.. పాల‌క స‌భ్యుల ఆహ్వానానికి ప‌వ‌న్ ఓకే..!

2020 ఆప్తా(APTA)నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌కి జ‌న‌సేనాని.. పాల‌క స‌భ్యుల ఆహ్వానానికి ప‌వ‌న్ ఓకే..!

2020లో జ‌రిగే ఆప్తా(APTA) నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌కు ముఖ్య అతిధిగా రావాలంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఆప్తా పాల‌క‌వ‌ర్గం ముంద‌స్తు ఆహ్వానం ప‌లికింది.. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న్ను ఆప్తా ఎగ్జిక్యూటివ్ బాడీ మ‌ద‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌సింది. ఆప్తా(APTA) ఏర్పాటు వెనుక ఉన్న కార‌ణాలు, పుట్టుక‌, దాని పెద్ద‌లు చేసిన కృషిని ఈ సంద‌ర్బంగా జ‌న‌సేన అధినేత‌కు వివ‌రించారు. తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు, క‌ష్టాల్లో ఉన్న వారికి ఆర్ధిక సాయంతో పాటు ఇప్ప‌టికే ఆప్తా(APTA) వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ వ‌స్తోంది. గ‌త ఏడాది కూడా ఎంతో మంది విద్యార్ధుల‌కు ఆప్తా స్కాలర్‌షిప్‌లు అంద‌చేయ‌డం జ‌రిగింది. ఆప్తా(APTA) ఏర్ప‌డి ప‌ది సంవ‌త్స‌రాలు గ‌డ‌చిన సంద‌ర్బంగా, ఈ 10 ఏళ్ల‌లో సాధించిన పురోగ‌తి, ఆప్తా ఆధ్వ‌ర్యంలో స్వ‌దేశంలో చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వివ‌రాలు కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు వివ‌రించారు. ఆప్తా(APTA) విజ‌న్‌ను ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు వివ‌రించారు. ఆప్తా చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల ప‌ట్ల జ‌న‌సేన అధినేత సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు ఆప్తా మీడియా విభాగం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ చేసింది. అదే స‌మ‌యంలో ఆప్తా(APTA) ఆహ్వానం ప‌ట్ల ప‌వ‌న్ సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు కూడా వెల్ల‌డించింది. అయితే అమెరికాలో ఉన్న మిగతా తెలుగు సంస్థలతో కలిసికట్టుగా (inclusive) పనిచేయాలని ఆప్తా బృందానికి ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ సూచించినట్టు తెలుస్తోంది..
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌లిసిన వారిలో APTA ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నటరాజు యిల్లూరి , బోర్డు చైర్ కిరణ్ పల్లా , బోర్డు డైరెక్టర్ శ్రీధర్ నిశంకరరరావు , వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మన్నెం , ఇండియా ఆపరేషన్స్ చైర్ మధు దాసరి , కాపిటల్ రీజియన్ సునీల్ నందముడి , పూర్వ ప్రెసిడెంట్ వెంకట్ చలమలశెట్టి, పూర్వ బోర్డు డైరెక్టర్ విజయ్ గుడిసేవ , పూర్వ బిజినెస్ ఫోరమ్ వైస్ చైర్మ‌న్ వెంకట రత్నం సూడ , ATSAP చైర్ మనోజ్ బడే, జ‌న‌సేన మ‌చిలీప‌ట్నం లోక్‌స‌భ అభ్య‌ర్ధి బండ్రెడ్డి రామ్‌ త‌దిత‌రులు ఉన్నారు. వీరంతా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు త‌మ‌ను తాము ప‌రిచ‌యం చేసుకుని., అనంత‌రం ఆయ‌న్ను స‌త్క‌రించారు..

Share This:

723 views

About Syamkumar Lebaka

Check Also

విలువ‌ల‌తో కూడిన పోరాటం చేశాం.. ఓడినా త‌లెత్తుకు తిరుగుతున్నాం- తానాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

విలువ‌ల‌తో కూడిర రాజ‌కీయాలు చేశాం.. అందుకే ఓడినా గ‌ర్వంగా ఉంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.. తాను రాజ‌కీయాల్లోకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − 7 =