Home / జన సేన / 21న సిక్కోలుకి జ‌న‌సేనాని.. మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నమే టూర్‌ అజెండా..

21న సిక్కోలుకి జ‌న‌సేనాని.. మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నమే టూర్‌ అజెండా..

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా మ‌రోసారి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్ట‌నున్నారు.. ఇప్ప‌టికే ఉద్దానం ఉద్ద‌ర‌ణ కార్య‌క్ర‌మంలో త‌న‌వంతు విజ‌యం సాధించిన జ‌న‌సేనాని., తాజాగా త‌న వ‌ద్ద‌కి వ‌చ్చిన మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసేందుకు., ఎస్టీల్లో చేర్చాల‌న్న డిమాండ్‌తో 53 రోజులుగా వారు చేస్తున్న రిలే నిరాహార‌దీక్ష‌ల‌కి మ‌ద్ద‌తు తెలిపేందుకు అక్క‌డికి వెళ్ల‌నున్నారు.. స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే తాను అక్క‌డ ఉంటాన‌ని బ‌లంగా చెప్పే జ‌న‌సేన అధినేత‌., రాజ‌కీయం అంటే కేవ‌లం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అని న‌మ్మే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., తాజాగా మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌పు బాధ్య‌త‌ను త‌న భుజాన వేసుకున్నారు.. జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి పాండిచ్చెరి మంత్రి మ‌ల్లాడి కృష్ణారావుతో క‌ల‌సి వ‌చ్చి., త‌న‌ని క‌ల‌సిన మ‌త్స్య‌కారుల‌కి ఈ మేర‌కు హామీ ఇచ్చారు..

మ‌త్స్య‌కారులు త‌మ స‌మ‌స్యను మ‌రింత బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు.. మ‌త్స్య‌కారుల్ని ఎస్టీల్లో చేర్చ‌డం అనే అంశంపై రాష్ట్ర ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి తీరు ప‌ట్ల ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు.. మ్యానిఫెస్టోలో పెట్టి., ఒక‌టికి వంద‌సార్లు చెప్పిన‌ప్పుడు., ఇచ్చిన హామీని ఎందుకు నిల‌బెట్టుకోర‌ని జ‌న‌సేన అధినేత ప్ర‌శ్నించారు.. హామీ ఇచ్చారు కాబ‌ట్టి., క‌నీసం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున ఓ క‌మిటీ వేసి మ‌త్స్య‌కారుల్ని ఎస్టీల్లో చేర్చే అంశంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాల‌ని., వీలైన సంద‌ర్బంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి., పార్ల‌మెంటుకి పంపాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విజ్ఞ‌ప్తి చేశారు.. త‌ద్వారా మ‌త్స్య‌కారుల‌కి భ‌రోసా ఇవ్వాల‌ని కోరారు.. హామీలు నెర‌వేర్చ‌ని సంద‌ర్బంలో ప్ర‌జ‌లు శాంతియుతంగా ఆందోళ‌న‌లు చేస్తున్న‌ప్పుడు., వాటిని అడ్డుకోరాద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించారు..

తాను ప్ర‌ధానిని క‌ల‌సిన‌ప్పుడు మ‌త్స్య‌కారులు త‌న‌కి ఇచ్చిన నివేదిక‌ని ఆయ‌న‌కి ఇస్తాన‌ని హామీ ఇచ్చిన జ‌న‌సేనాని., వెనుక‌బ‌డిన క‌మ్యునిటీని చైత‌న్య ప‌ర్చాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌న్నారు.. మ‌త్య్స‌కార్యుల స‌మ‌స్య‌ల‌ని జ‌న‌సేన దృష్టికి తీసుకువ‌చ్చిన పెద్ద‌లంతా ఆ దిశ‌గా కృషి చేయాల‌ని కోరారు..

21వ తేదీన శ్రీకాకుళం వ‌చ్చి., అక్క‌డ మత్స్య‌కారుల స్థితిగ‌తుల‌పై పూర్తి అధ్య‌య‌నం చేసిన అనంత‌రం., వారి అంశంపై మాట్లాడుతాన‌ని జ‌న‌సేనాని తెలిపారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెబితే అయిపోయిన‌ట్టే., ఎంతో మందికి అనిపించిన‌ట్టే., ఇచ్చాపురం నుంచి త‌డ వ‌ర‌కు ఉన్న మ‌త్స్యాకారుల‌కి కూడా అనిపించింది.. అందుకే త‌మ‌ను ఎస్టీల్లో చేర్పిస్తానంటూ ఇచ్చిన హామీని విస్మ‌రించిన స‌ర్కారుపై పోరాటానికి ఆయ‌న మ‌ద్ద‌తు అడగ్గా., అండ‌గా ఉంటానంటూ జ‌న‌సేనుడు భ‌రోసా ఇచ్చారు..

Share This:

987 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − thirteen =