Home / ఎడిటోరియల్స్ / 46 రోజులు.. 2 వేల స‌భ్య‌త్వాలు.. సేన‌కి స్ఫూర్తి తెలంగాణ జ‌న‌సైనికుడి వ్య‌క్తిగ‌త రికార్డు..

46 రోజులు.. 2 వేల స‌భ్య‌త్వాలు.. సేన‌కి స్ఫూర్తి తెలంగాణ జ‌న‌సైనికుడి వ్య‌క్తిగ‌త రికార్డు..

SPF(special pspk force) స్పెష‌ల్ సీఎస్‌పీకే ఫోర్స్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరు మీద సేవా కార్య‌క్ర‌మాలు, ర‌క్త‌దానాలు, వృద్దాశ్ర‌మాల‌కి అన్న‌దానాలు.. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో బృంధాలుగా ఏర్ప‌డి వంద‌ల సంఖ్య‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌మ‌కు తోచిన సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ వ‌స్తున్నారు.. ఇక మార్చ్ 14వ తేదీ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాక తమ‌కు తాము ఆ బాధ్య‌త‌ని భుజాన వేసుకున్న SPF స‌భ్యులు., జ‌న‌సైన్యం యాప్ వ‌చ్చాక పూర్తి స్థాయి క్రియాశీల‌కంగా రంగంలోకి దిగారు.. ఒక్కోక్క‌రూ వంద స‌భ్య‌త్వాలు ల‌క్ష్యంగా చేసుకుని ముందుకి క‌దిలారు.. దాదాపు SPF స‌భ్యులంతా అన‌తికాలంలో త‌మ ల‌క్ష్యాన్ని చేరారు..

SPF కీల‌క స‌భ్యుడిగా ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త మ‌స‌న రాజ‌శేఖ‌ర్ ఏకంగా రెండు వేల మందిని పార్టీలోకి చేర్చాడు.. ముంబైలో ఉద్యోగం చేస్తున్న రాజ‌శేఖ‌ర్., కేవ‌లం కాళీ స‌మ‌యాల్లో ప‌ని చేసి సాధించిన ఘ‌న‌త ఇది.. ముందుగా త‌న కుటుంబాన్ని, ఆ త‌ర్వాత బంధుగ‌ణాన్ని జ‌న‌సేన కుటుంబంలో చేర్చాడు.. ఇందులో ఏ ఒక్క‌రినీ బ‌ల‌వంతంగా పార్టీ స‌భ్య‌త్వం తీసుకోమ‌ని చెప్ప‌లేదు.. ప్ర‌తి ఒక్క‌రికీ పార్టీ సిద్ధాంతాల‌ను వివ‌రించి, ఒప్పించే స‌భ్య‌త్వం ఇచ్చాడు..

ఆ త‌ర్వాత త‌న ఊరు, మండ‌లం, జిల్లా ఇలా అవ‌కాశం దొరికిన ప్ర‌తి చోటా ప‌ది మందిని పోగేయ‌డం, వారికి పార్టీ సిద్ధాంతాలు వివ‌రించ‌డం, జ‌న‌సేన తీర్ధం ఇవ్వ‌డం.. ఇలా 46 రోజుల్లో రాజ‌శేఖ‌ర్ ఒక్క‌డే రెండు వేల మందిని జ‌న‌సేన పార్టీ స‌భ్యులుగా చేర్చాడు..

ఇది ఒక్క‌టే కాదు జ‌న‌సైన్యం యాప్‌కి సంబంధించి ఓ యూట్యూబ్ ప్ర‌జెంటేష‌న్ రూపొందించి, అంద‌రికీ అర్ధ‌మ‌య్యే రీతిలో బ‌య‌టికి విడుద‌ల చేసి అంద‌రి మ‌న్న‌న‌లు పొందాడు.. ప‌రోక్షంగా మ‌రికొంద‌రు పార్టీ స‌భ్యులుగా చేరేందుకు త‌న వంతు స‌హ‌కారం అందించాడు.. రాజ‌శేఖ‌ర్ సాధించిన 2 వేల వ్య‌క్తిగ‌త స‌భ్య‌త్వాలు ప్ర‌తి జ‌న‌సైనికుడికి స్ఫూర్తిదాయ‌కం.. ఒక్కొక్క‌రూ వంది మందిని చేర్చాల‌న్న ల‌క్ష్యంలో ముంద‌గుడు వేయ‌న‌వ‌స‌రం లేదు.. అందుబాటులో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ పార్టీ సిద్ధాంతాల‌ను వివ‌రించి పార్టీలో చేరిస్తే చాలు.. ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త త‌మ కోరిక తీర్చుకున్న‌ట్టే..

Share This:

3,133 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − fifteen =

%d bloggers like this: