Home / జన సేన / 85 శాతం యువ‌త‌, 60 శాతం మ‌హిళ‌లు జ‌న‌సేన‌తోనే.. ఏపీలో కొత్త స‌ర్వే ప్ర‌కంప‌న‌లు..

85 శాతం యువ‌త‌, 60 శాతం మ‌హిళ‌లు జ‌న‌సేన‌తోనే.. ఏపీలో కొత్త స‌ర్వే ప్ర‌కంప‌న‌లు..

మ‌రో రెండు రోజుల్లో జ‌ర‌గ‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల మీద గంట‌కో స‌ర్వే తెర మీద‌కి వ‌స్తూ ఓట‌రు నాడిని ప్ర‌భావితం చేసేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. ఈ స‌ర్వేల్లో నిజం ఎంత అన్న విష‌యం ప‌క్క‌న‌పెడితే., ప‌క్కాగా రెండు పార్టీల క‌నుస‌న‌ల్లో ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతున్న‌ట్టు అర్ధం అవుతోంది.. వైసీపీకి అనుకూలంగా ఫ‌లానా స‌ర్వే ఉంది అంటూ రోజు మొత్తం ఆ పార్టీ పెయిడ్ వెబ్‌సైట్ల నుంచి క‌ర‌ప‌త్రిక సాక్షి వ‌ర‌కు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసికొంటున్నాయి.. ఇక టీడీపీకి అనుకూలంగా ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు లాంటి ప‌త్రిక‌లు మీడియా సంస్థ‌లు పాజిటివ్ వార్త‌లు వేస్తున్నాయి.. అయితే ఇరు వ‌ర్గాల‌కు ఉమ్మ‌డి శ‌త్రువు అయిన జ‌న‌సేన ప‌రిస్థితి ఏంటి.? అంటే ఇరువురు జ‌న‌సేన‌కు ఉన్న బ‌లాన్ని ఒప్పుకోవ‌డానికి నిరాక‌రిస్తున్నారు అన్న విష‌యం చాలా స్ప‌ష్టంగా అర్ధం అవుతోంది.. ఇరు వ‌ర్గాలు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక మిన‌హా మ‌రో స్థానం జ‌న‌సేన ఖాతాలో చేరుతుంద‌న్న పాజిటివ్ వార్త కూడా బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాయి.. ఎవ‌రి స‌ర్వేల్లో వారు త‌మ‌కే మ‌ద్ద‌తు వ‌చ్చేలా వార్తాక‌థ‌నాలు వేసుకుంటూనే రెండు పార్టీల మ‌ధ్యే పోరాటం ఉంటుంద‌న్న విష‌యాన్ని బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల్లో బ‌లంగా రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. దీంతో వాస్త‌వానికి విరుద్దంగా ఉండ‌డంతో గంటికి ఒక‌టిగా వ‌స్తున్న ఈ పెయిడ్ స‌ర్వేల‌ను జ‌నం న‌మ్మ‌డం మానేశారు..

అస‌లు విష‌యానికి వ‌స్తే ఈఎండి పీపుల్స్ ప‌ల్స్ అనే సంస్థ తాజాగా ఓ స‌ర్వేను విడుద‌ల చేసింది.. ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అత్యంత ప్ర‌భావిత ఓట‌ర్లుగా ఉన్న యువ‌త‌, మ‌హిళ‌ల నుంచి న‌మూనాలు సేక‌రించారు.. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి 5 వేల మంది ద‌గ్గ‌ర , అదీ వివిధ ప్రాంతాల్లో ఈ శాంపిల్స్ తీసుకున్నారు.. ప్ర‌స్తుతం ఊద‌ర‌గొడుతున్న స‌ర్వేల‌కు పూర్తి విరుద్దంగా ఈ ఫ‌లితాలు ఉండ‌డం విశేషం.. ముక్కోణ‌పు పోరుకు సంబంధించి ఉన్న మూడు పార్టీలు, స్థానిక అభ్య‌ర్ధులు, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధుల గ్రాఫ్‌ని ప‌రిశీలించి చూసింది.. ఇందులో 85 శాతం యువ‌త జ‌న‌సేన వైపే ఉన్న‌ట్టు తేలింది. అదీ కుల‌మ‌తాల‌కు అతీతంగా యువ‌త అంతా జ‌న‌సేన‌ను ఆద‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.. మిగిలిన 15 శాతంలో 10 శాతం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతుండ‌గా., వైసీపీకి కేవ‌లం 5 శాతం యువ‌త మాత్ర‌మే మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు.. కార‌ణం చ‌దుకున్న, ఉద్యోగాలు చేస్తున్న వారంతా వైసీపీ వ‌స్తే రాష్ట్రంలో ఎలాంటి ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మ‌వుతాయోన‌ని భ‌య‌ప‌డుతున్నారు.. ముఖ్యంగా త‌ట‌స్థ ఓట‌ర్లు వైసీపీని తిర‌స్క‌రిస్తున్నారంట‌..

మ‌హిళా ఓట‌ర్ల విష‌యానికి వ‌స్తే.. సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు అతీతంగా చూసినా 60 శాతం మంది జ‌న‌సేన వైపే ఉన్న‌ట్టు తెలుస్తోంది.. చిన్నారులు కూడా త‌మ భ‌విష్య‌త్తు కోసం జ‌న‌సేన పార్టీకి ఓటు వేసి తీరాలంటూ ఒట్లు పెట్టించుకుంటున్నార‌ని స‌ర్వే నిర్వ‌హించిన సంస్థ వ‌ద్ద వ్య‌క్తం చేసిన అభిప్రాయాల ద్వారా తెలుస్తోంది. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కం, మ‌హిళ‌ల ఖాతాల్లో నెల‌నెలా రేష‌న్‌కు బ‌దులుగా డ‌బ్బు జ‌మ చేయించే ప‌థ‌కాలు.. మ‌హిళాలోకానికి బాగా రీచ్ అయిన‌ట్టు చెబుతోంది.. మిగిలిన 40 శాతంలో 30 శాతం మ‌హిళ‌లు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతోందంట‌.. కార‌ణం ప‌సుపు-కుంకుమ , డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఇస్తున్న తాయిలాలు లాంటి అంశాలు కొంత మేర‌కు ప్ర‌భావం చూపుతున్నాయ‌ని స‌ర్వే నిర్వాహ‌కులు తెలిపారు..

తాజా స‌ర్వేలో చెప్పిన విధంగా ఓట్లు ప‌డితే జ‌న‌సేన పార్టీ, కూట‌మితో క‌లిసి సుమారు 80 నుంచి 90 స్థానాలు గెలుచుకోవ‌డం ఖాయ‌మంటున్నారు.. టీడీపీ 30 నుంచి 45 స్థానాలు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 40 స్థానాల్లో గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఈఎండి పీపుల్స్ ప‌ల్స్ తెలిపింది.. కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాల్లోనే జ‌న‌సేన కూట‌మి ఆరు స్థానాలు కైవ‌సం చేసుకుంటుంద‌ట‌, అవ‌నిగ‌డ్డ, మ‌చిలీప‌ట్నం, పెడ‌న‌, విజ‌య‌వాడ వెస్ట్‌, సెంట్ర‌ల్‌, ఈస్ట్ నియోజ‌కవ‌ర్గాల‌ను గెలుచుకోవ‌డంతో పాటు నూజివీడులో కూడా గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని తెలిపారు.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 25 స్థానాల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధుల విజ‌యానికి అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. ప్ర‌కాశం జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా 3-4 స్థానాల్లో పబ్లిక్ ప‌ల్స్ జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉంద‌ట‌.. ఇంకో విష‌యం ఏంటంటే ప్ర‌తిప‌క్ష నేత కంచుకోట‌గా భావించే క‌డ‌ప జిల్లాలో కూడా జ‌న‌సేన మూడు స్థానాల్లో(క‌డ‌ప‌, రైల్వేకోడూరు, రాజంపేట‌) జెండా పాత‌డం ఖాయ‌మ‌ని ఈ స‌ర్వే చెబుతోంది..

జ‌నంలో లేని పాజిటివ్ వేవ్‌ని చూసి బ‌ల‌పు అనుకుంటున్న వైసీపీ, టీడీపీల‌కు పెద్ద షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని ఈఎండి పీపుల్స్ ప‌ల్స్ అంటోంది.. యువ‌త‌, మ‌హిళ‌ల్లో ఏకంగా 70 శాతం మంది ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి కావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నార‌ట‌. ఆ త‌ర్వాత 17 శాతం మంది మ‌ళ్లీ బాబు రావాలి అంటుంటే., నేనే సిఎం అనుకుంటున్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని మాత్రం ముఖ్య‌మంత్రిగా కేవ‌లం 13 శాతం మంది మాత్ర‌మే ఆహ్వానిస్తున్న‌ట్టు స‌ర్వే తెలిపింది.. చాప వెనుక నీరులా ప్ర‌వ‌హిస్తున్న జ‌న‌సేన వేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో స‌రికొత్త శ‌కానికి నాంది ప‌లుకుతుందంట‌..

Share This:

1,901 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − three =