Home / పవన్ టుడే / 9న రాజ‌మండ్రి బ్రిడ్జిపై జ‌న‌సేనాని క‌వాతు.. భారీగా త‌ర‌లిరావాలంటూ జ‌న‌సైన్యానికి పిలుపు..

9న రాజ‌మండ్రి బ్రిడ్జిపై జ‌న‌సేనాని క‌వాతు.. భారీగా త‌ర‌లిరావాలంటూ జ‌న‌సైన్యానికి పిలుపు..

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేనాని పోరాట యాత్ర ముగింపు ద‌శ‌కి చేరుకుంది.. భీమ‌వ‌రంలో మొద‌లైన యాత్ర ప్ర‌స్తుతం చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తి చేసుకుంది.. పోల‌వ‌రం, గోపాల‌పురం, కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో 8వ తేదీ వ‌ర‌కు కొనసాగ‌నుంది.. ఇక 9వ తేదీ జ‌న‌సేన పోరాట యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలో ప్ర‌వేశిస్తుంది.. ప‌శ్చిమ నుంచి తూర్పుకి యాత్ర చేరే క్ర‌మంలో కొవ్వూరు నుంచి రాజ‌మండ్రి వ‌ర‌కు భారీ క‌వాతు నిర్వ‌హించాల‌ని జ‌న‌సేనాని నిర్ణ‌యించారు.. పార్టీ శ్రేణుల‌కి ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేయ‌గా., జంగారెడ్డిగూడెంలో హుటాహుటిన పార్టీ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు.. క‌వాతు నిర్వ‌హ‌ణ‌, ఏర్పాట్ల‌పై ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు..

జ‌న‌సేనాని క‌వాతుకి ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌తో పాటు కృష్ణా, గుంటూరు, ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్య‌లో జ‌న‌సైనికులు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశాలు ఉన్న నేప‌ధ్యంలో., అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేసే ప‌నిలో నిమ‌జ్ఞ‌మ‌య్యారు.. అందుకోసం ప్ర‌త్యేకంగా క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.. ఈ క‌మీటీలు క‌వాతు నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను చూస్తాయి.. రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ కూడా క‌వాతుకి ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించ‌నుంది.. 9వ తేదీన జ‌రిగే ఈ కవాతుని విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కి, అభిమానుల‌కి కూడా ప్యాక్ విజ్ఞ‌ప్తి చేస్తోంది..

Share This:

1,533 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని యూఎస్‌ టూర్ ప్ర‌వాసుల కోస‌మే..సెనెట‌ర్స్ దృష్టికి H1B స‌మ‌స్య‌లు..

రాజ‌కీయ నాయ‌కులు విదేశాల‌కి వెళ్లిన‌ప్పుడు స్వ‌దేశంలో ఏవో అద్భుతాలు చేసేస్తున్న‌ట్టు ప్ర‌చారం చేసుకుని ఎన్‌.ఆర్‌.ఐల ఎదుట క‌ల‌ర్ ఇవ్వ‌డం మిన‌హా., …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × three =