Home / ఎడిటోరియల్స్

ఎడిటోరియల్స్

Editorials and articles

రాపాక ఎపిసోడ్‌తో కార్య‌క‌ర్త‌ల్లో విశ్వాసం.. ప్ర‌త్య‌ర్ధుల‌కి హెచ్చ‌రిక‌లు..

ముందు మీరు పోరాడండి.. అవ‌స‌రం అయితే నేను వ‌స్తా.. రాపాక వ్య‌వ‌హారంలో జెట్ స్పీడ్‌లో స్పందించిన జ‌న‌సేనాని. న్యాయం కోసం ప్ర‌త్య‌క్ష పోరుకి సిద్ధం జ‌న‌సేన అధినేత ఫోన్ కాల్‌కి ఉలిక్కి ప‌డిన అధికారులు కార్య‌క‌ర్త‌కు క‌ష్టం వ‌చ్చినా నేనుంటా… ప్ర‌భుత్వ వేధింపుల‌ను తిప్పి కొడ‌తా… అంటూ ప్ర‌తి మీటింగ్‌లో చెబుతూ వ‌చ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాను ఇచ్చిన మాట మీద నిల‌బ‌డ‌తాన‌ని నిరూపించుకున్నారు.. రాజోలు ఎమ్మెల్యే రాపాక …

Read More »

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల నాయ‌కులు వారం త‌ర్వాత విహార యాత్ర‌ల‌కు వెళ్లిపోయారు.. ఫ‌లితాల‌కు 40 రోజులు గ‌డువు ఉండ‌డంతో త‌మ వ్యూహ‌క‌ర్త‌ల‌ను అస‌లు రిపోర్టులు తెమ్మ‌ని పుర‌మాయించారు.. అస‌లు స‌రుకు బ‌య‌ట‌ప‌డే స‌రికి, రోజుకు ఒక్క సీటు నుంచి ప‌ది సీట్లు త‌మ ఖాతా నుంచి తీసివేస్తూ, స‌ర్వేల రూపంలో త‌ప్పుడు వార్త‌లు …

Read More »

ఓట‌మి భయాన్ని జ‌న‌సేనాని జ‌యించారు..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరు ముగిసింది.. ఓట‌రు తీర్పు ఈవీఎంల‌లో నిక్షిప్తమ‌య్యింది.. ఈవీఎంల‌లో ఉన్న తీర్పును ఎవ‌రూ మార్చ‌లేరు.. ఆ విష‌యం అంద‌రికీ తెలుసు.. అదే స‌మ‌యంలో గెలుపు మీద అంద‌రికీ ధీమా.. ధీమా అనే కంటే లోప‌ల ఓట‌మి భ‌యం వెన్నాడుతున్నా., పైకి మాత్రం అంతులేని మేక‌పోతుగాంభీర్యం క‌న‌బ‌ర్చ‌డం.. అధికార-ప్ర‌తిప‌క్ష పార్టీలు చేస్తుంది ఇదే.. మాకు అన్ని సీట్లు వ‌స్తాయి అంటే., మాకు ఇన్ని సీట్లు వ‌స్తాయి అని లెక్క‌లు …

Read More »

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీని న‌డుపుతారా..? ఓట్ల పండుగ‌కు ముందు ప్ర‌త్య‌ర్ధుల నుంచి వెల్లువెత్తిన విమ‌ర్శ‌లు ఇవి.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత.. క‌ట్ చేస్తే.. మార్పు కోసం వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అప్పుడే దుకాణం మూసేశారు.. తెలుగుదేశం పార్టీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ స్థాయిలో తాయిలాలు ఇస్తున్నాయో తెలియ‌దు గానీ., …

Read More »

రిజిస్ట‌ర్ పార్టీకి కేటాయించిన కామ‌న్ సింబ‌ల్ ఇంకొక‌రికి ఇవ్వొచ్చా.?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాపితంగా ఈ నెల 11వ తేదీన జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తిగా ప్ర‌జాస్వామ్యాన్ని కూనీ చేస్తూ సాగింది.. ప‌ట్ట‌ప‌గ‌లు పార్టీలు ఓటుకు నోటి ఇచ్చి కొంటున్నా ప‌ట్టించుకునే నాధుడు లేడు.. ధ‌న ప్ర‌భావం లేని ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం.. ప్ర‌తి అడుగు త‌నిఖీలు చేస్తున్నాం అని ఈసీ చెప్పిన మాట‌లు నీటి మూట‌లుగా మిగిలాయి.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలో పోటీ ప‌డి మ‌రీ ఓట్ల కోసం …

Read More »

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక పోరులో జ‌న‌సేన ప్ర‌భావం ఎంత‌..?

శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల‌- జ‌నార్ధ‌న్‌(ఉద్దండులైన ప్ర‌త్య‌ర్ధుల‌ను ఓట‌మి రుచి చూపారు. ఈ స్థానం జ‌న‌సేన పార్టీ విజ‌యానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి) ప‌లాస‌(శ్రీకాకుళం జిల్లాలో జ‌న‌సేన పార్టీ గెలుపుకు అవ‌కాశం ఉన్న రెండో నియోజ‌క‌వ‌ర్గం) రాజాం, ఇచ్చాపురం( ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధుల గెలుపుకు 50:50 ఛాన్సెన్ ఉన్నాయి. సైలెంట్ ఓటింగ్ ప్ర‌భావం చూపితే విజ‌యానికి అవ‌కాశాలు ఉన్నాయి) శ్రీకాకుళం, పాత‌ప‌ట్నం( ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా జ‌న‌సేన …

Read More »

వైసీపీ విజ‌యోత్సాహాలు ”మేక‌పోతు గాంభీర్యాలే”.. ఏపీలో అనూహ్య ఫ‌లితాలు ఖాయం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌ ముగిసిన నేప‌ధ్యంలో ఈవీఎంల‌లో నిక్షిప్త‌మై ఉన్న ‘విజ‌యల‌క్ష్మి’ ఎవ‌ర్ని వ‌రిస్తుంది.? ఇప్పుడు స‌ర్వ‌త్ర విన‌బ‌డుతున్న ప్ర‌శ్న ఇది.. ఎన్నిక‌లు ముగిసిన ప్ర‌తిసారీ ఎగ్జిట్ పోల్స్ ఓ పార్టీలో ఉత్సాహం.. మ‌రో పార్టీలో నిరుత్సాహం నింపుతూ ఉండేవి.. ఈ ఎగ్జిట్ పోల్స్‌, ప‌బ్లిక్ ప‌ల్స్‌ని క‌నిపెట్ట‌లేని సంద‌ర్బాలు కూడా కోకొల్ల‌లు.. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితులు మాత్రం సంప్ర‌దాయానికి పూర్తి విరుద్దంగా ఉన్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

అవ‌నిగ‌డ్డ రాజ‌కీయాల్లో ‘జ‌న‌సేన’ కొత్త చ‌రిత్ర లిఖించ‌బోతోందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కు(ఉమ్మ‌డి రాష్ట్రం మొద‌లుకొని) కృష్ణా జిల్లా కేంద్రంగా ఉంటే., కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన చ‌రిత్ర మాత్రం అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానిదే.. భౌగోళికంగా ఓ మూల‌కు విసిరేసిన‌ట్టు క‌న‌బ‌డినా., రాజ‌కీయ చైత‌న్యం విష‌యంలో మాత్రం దివిసీమ బిడ్డ‌లు పెట్టింది పేరు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ముఖ్య‌మంత్రి స్థాయి వ‌ర‌కు వెళ్లిన నాయ‌కులు ఉన్నారు.. చుట్టు ప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గెలిచిన నాయ‌కులు ఉన్నారు.. మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స్థానానికి మొద‌టి ఎంపి కామ్రెడ్ …

Read More »

స‌ర్కారీ ఉద్యోగులు ”గాజుగ్లాసు”కు గుద్దేశారా..?

2004లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవ‌డంలో వారిదే కీల‌క‌పాత్ర‌.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అదే టీడీపీ గ‌ద్దెనెక్క‌డంలోనూ వారి పాత్ర‌ కాద‌న‌లేనిది.. నిత్యం ప్ర‌జ‌ల్లో మ‌మేకం అయి ఉండి.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర్చ‌డంతో పాటు పాల‌నా వ్య‌వ‌హారాల్లో ప్ర‌ధాన పాత్ర పోషించేది వారే.. వారే ప్ర‌భుత్వ ఉద్యోగులు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌రం లేదు.. గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌డంలోనే కాదు., ప్ర‌జ‌ల ఓటును ప్ర‌భావితం చేయ‌డంలోనూ వీరిది కీ …

Read More »

వైఛీ(సి)పి పెయిడ్ సైట్ల‌లో బూట‌క‌పు స‌ర్వేల హ‌ల్‌చ‌ల్‌.. ఈసీ యాక్ష‌న్ ఎక్క‌డ‌..?

వైసీపీ పెయిడ్ సైట్ల‌లో బూట‌క‌పు స‌ర్వేల హ‌ల్‌చ‌ల్‌.. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల‌కు తూట్లు.. చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న ఈసీ.. అధికారుల‌ తీరు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అనుమానాలు.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న స‌మ‌యంలో ప్రింట్ మీడియా, ఎల‌క్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్య‌మాలు త‌దిత‌ర ప్ర‌సార మాధ్య‌మాల‌న్నిలో ప్ర‌చురిత‌మ‌య్యే వార్త‌లు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిబంధ‌న‌ల‌కి లోబ‌డి ఉండాలి.. ఎల‌క్ష‌న్ షెడ్యూల్ విడుద‌ల అయిన నాటి నుంచి ఈ ఆంక్ష‌లు అమ‌ల్లోకి …

Read More »