Advertisement

Home / పవన్ టుడే

పవన్ టుడే

This page contains the daily schedule of Power Star Pawan Kalyan

ఆ కోరిక తీరకుండానే ఆయన మనల్ని వదిలివెళ్లడం బాధాకరం-పవన్ కల్యాణ్

* అధికారం రెండు వర్గాలకే పరిమితం కారాదని తపించారు * వంగపండు పాటకు మరణం లేదు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతో బాధించిందనీ ఓ ప్రకటనలో తెలిపారు. తన స్వరాన్ని భాస్వరం గా మార్చిన ప్రజా గాయకుడిగా వంగపండుని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం రెండు వర్గాల …

Read More »

అమిత్ షాకి కరోనా..త్వరగా కోలుకోవాలంటూ జనసేనాని ప్రార్ధన

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా సోకింది.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు బయటపడడంతో పరీక్షలు నిర్వహించినట్టు, పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.. హోంమంత్రికి కరోనా సోకిన విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా …

Read More »

షిప్ యార్డ్ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి

• అన్ని సంస్థల్లో యుద్ధప్రాతిపదికన సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి • జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ భారీ క్రేన్ ప్రమాదం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఘటనపై జరిగిన వెంటనే ఆరా తీసిన ఆయన …

Read More »

మూడు రాజధానులకు ఇదా సమయం?

* ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి * ప్రభుత్వానికి జనసేనాని సూచన ప్రజలను కోవిడ్ మహమ్మారి పీడిస్తున్న వేళ మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. నాడు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా బల్లగుద్ది చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఇప్పుడు ప్లేటు ఫిరాయించారన్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు అవసరం లేదనీ, ఈ …

Read More »

రేషన్ డీలర్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి-జనసేనాని డిమాండ్

• బయో మెట్రిక్ విధానానికి ప్రత్యామ్నాయం తీసుకురావాలి • డీలర్లకు కరోనా బీమా అమలు చేయాలి పేద ప్రజలకు అవసరమైన బియ్యం, పప్పు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేసే రేషన్ డీలర్ల విజ్ఞాపనలపై ప్రభుత్వం స్పందించకపోతే – చివరికి 2 కోట్ల 80 లక్షల మంది పేదలు ఇబ్బందిపడే పరిస్థితి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లాక్డౌన్ కాలం నుంచి ఇప్పటి వరకూ రేషన్ సరకు …

Read More »

స్వచ్ఛందంగా సేవ చేస్తే దాడులు చేస్తారా? విజయనగరంబిజెపీ-జనసేన అభ్యర్థిపై దాడికి జనసేనాని ఖండన

కరోనా విపత్కాలంలో స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తున్న విజయనగరంకు చెందిన బీజేపీ నాయకుడు కాళ్ల నారాయణరావుపై అధికార పక్షం గూండాలు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కార్పోరేషన్ లో జనసేన-బీజేపీ అభ్యర్ధిగా నారాయణ రావు పోటీలో ఉన్నారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదంలంతా ఖండించాలని జనసేనాని పిలుపు నిచ్చారు. తన విడిజన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో స్వయంగా ఆయనే పూనుకొని ఆ …

Read More »

కరోనా నివారణలో ఏపీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదు…

* వైద్య సిబ్బంది రక్షణలో ఉదాసీనత * ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు * ఆ పథకం లో కేంద్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్లు నిధులు అందించింది * ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళన * బి.జె.పి., జనసేన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బి.జె.పి., జనసేన పార్టీ కీలక నేతల సమావేశం అభిప్రాయపడింది. పరీక్షల …

Read More »

పర్యావరణహితం కాని పరిశ్రమలపై నిరసనగళం వినిపిస్తూనే ఉంటాం-జనసేనాని

మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని, మానవ మనుగడకు ఆధారం పంచభూతాలనీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాని పురస్కరించుకుని తన సందేశాన్ని ప్రకటన రూపంలో విడుదల చేశారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి వుందిని, చక్కటి పర్యావరణం వున్నచోట ఆస్పత్రుల అవసరమే ఉండదని తెలిపారు. జనసేన మూలసూత్రాలలో పర్యావరణానికి సముచిత …

Read More »

నిరుపేద బ్రాహ్మణులకు యూరోప్ జనసైన్యం సాయం.. ట్విట్టర్ వేదికగా జనసేనాని అభినందనలు..

బ్రహ్మ జ్ఞానం ఉన్నవారిని బ్రాహ్మణులు అంటారు.. అత్యంత విశిష్టమైన కుల వృత్తి వీరిది. వీరు లేనిదో హైందవ సంప్రదాయంలో పుట్టుక దగ్గర నుంచి చావు వరకు వీరు లేనిదే ఏ పని జరగదు. అంతా బాగుండాలి అని నిండు మనస్సుతో నిత్యం భగవంతుని పూజించినా, అంతే నిండు మనస్సుతో ఆశీర్వచనాలు ఇచ్చినా అది వారికే సొంతం. అలాంటి బ్రాహ్మణులు ఆకలితో అలమటించడం ఎవ్వరికీ మంచిది కాదు. అందుకే జనసేన అధినేత …

Read More »

వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేనకు ఎటువంటి సంబంధం లేదు

విపత్కర తరుణం ఇది..జనసేవలోనే ముందుకు సాగండి.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి జనసేన పార్టీలో లక్షలాదిగా వున్న నాయకులు, జనసైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని అందరికీ …

Read More »