Home / జన సేన / 12న జనసేనాని దీక్షకు తరలిరండి.. పార్టీ నాయకులు, శ్రేణులకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల పిలుపు

12న జనసేనాని దీక్షకు తరలిరండి.. పార్టీ నాయకులు, శ్రేణులకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో చేపట్టనున్న దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పి.ఎ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క జనసైనికుడు కాకినాడ చేరుకొని అధినేత దీక్షకు సంఘీభావం తెలిపాలని కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని, ప్రకటనను విడుదల చేశారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన., జగన్ రెడ్డి ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించడంతో ఉభయ గోదావరి జిల్లాల రైతులు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్న పవన్ కళ్యాణ్., క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించినట్టు చెప్పారు.. రైతులకు బాసటగా నిలించేందుకు ఒక రోజు దీక్ష చేపట్టాలని ఆయన నిర్ణయించారనీ., ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడలో నిరసన దీక్ష  చేయనున్నట్టు నాదెండ్ల స్పష్టం చేశారు.  రైతాంగానికి బాసటగా నిలబడటం ప్రతి ఒక్క జనసైనికుడు బాధ్యతగా భావించి కాకినాడ దీక్షకు తరలి రావాలని కోరారు..

కాగా ఆదివారం మండపేటలో జనసేన పార్టీ అధినేత నిరాహారదీక్ష ప్రకటన చేసిన మరు క్షణం నుంచి జనసేన కార్యకర్తలు మొత్తం ఛలో కాకినాడ అంటూ సమరనాధం చేస్తూనే ఉన్నారు.

Share This:

459 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + nineteen =