Home / జన సేన / JAC కాదు.. JFC-JPAC విభ‌జ‌న హామీల సాధ‌న వేదిక‌పై జ‌న‌సేనాని స్ప‌ష్ట‌త‌..

JAC కాదు.. JFC-JPAC విభ‌జ‌న హామీల సాధ‌న వేదిక‌పై జ‌న‌సేనాని స్ప‌ష్ట‌త‌..

విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీలు గాలికొదిలేయ‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నానా ఇబ్బందులు ప‌డుతోంది.. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే హామీని అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ సాక్షిగా ఇచ్చి విస్మ‌రించ‌డం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో కూడా కేంద్రంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.. అదే స‌మ‌యంలో హోదాని ప్యాకేజీగా మ‌ల‌చిన‌ప్పుడు., ఆహా..ఓహో అంటూ ఒప్పుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వంపైనా జ‌నం గుర్రుగానే ఉన్నారు.. తాజా బ‌డ్జెట్‌లో కేంద్రం మ‌రోసారి ఏపీకి మొండి చేయి చూప‌డంతో., మొన్న‌టి వ‌ర‌కు నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న వ్య‌వ‌హారం కాస్తా., ర‌చ్చ రావ‌ణ‌కాష్టంగా మారింది.. అప్పుడు ప్యాకేజీని స్వాగ‌తించి., ఇప్పుడు వ్య‌తిరేకిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. ఇక కేంద్రం నుంచి వ‌చ్చిన సాయం విష‌యంలో కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య అంత‌రాన్ని పెంచాయి.. దీంతో ఎప్ప‌టి నుంచో ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ నిన‌దిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., విభ‌జ‌న హామీల సాధ‌న‌కి త‌న‌వంతు పోరాటాన్ని ఉదృతం చేశారు.. ముందుగా జేపీ-ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ లాంటి అనుభ‌వ‌జ్ఞుల‌తో ఓ వేదిక‌ను ఏర్పాటు చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన జ‌న‌సేనుడు., త‌న‌వంతు అడుగులు వ‌డివ‌డిగా వేయ‌డం ప్రారంభించారు.. రాష్ట్ర ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం క‌ల‌సి వ‌చ్చే అంద‌ర్నీ ఓ వేదిక‌పైకి తీసుకువ‌చ్చి., కేంద్రంపై పోరాటం చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.. అందుకోసం ఓ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఏర్పాటు చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు..

త‌న బ్ర‌హ్మాస్త్రం ట్విట్ట‌ర్ వేదిక‌గా అందుకు సంబంధించిన విధివిధానాల‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు.. జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ కాదు.. ముందుగా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ(JFC)ని వేయనున్న‌ట్టు తెలిపారు.. విభ‌జ‌న హామీలు.. చ‌ట్టంలో ఇచ్చిన హామీలు, చ‌ట్ట స‌భ సాక్షిగా మౌకికంగా ఇచ్చిన హామీలు.. ప్ర‌స్తుతం కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య రాజుకున్న వివాదాల‌పై విస్తృతంగా చ‌ర్చించడం.. ఓ నివేదిక రూపొందించ‌డం JFC ప‌ని.. రాజ‌కీయాలు., వ్య‌క్తిగ‌త స్వార్ధం, వివ‌క్ష అనే అంశాల‌కి దూరంగా ఆర్ధిక వేత్త‌లు, మాజీ ప్ర‌భుత్వ అధికారులు, సామాజిక, విద్యావేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కుల‌తో JFCని రూపొందించ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో వెల్ల‌డించారు.. ఇక్క‌డ మ‌రో అంశాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్థావించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్యాకేజీని ప్ర‌క‌టించిన స‌మ‌యంలో జ‌న‌సేన వ్య‌తిరేకించింది.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌నే కేంద్రం ప్యాకేజీగా మ‌ల‌చింద‌ని చెప్పింది.. కానీ అప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్యాకేజీకి ఒప్పుకుని ఇప్పుడు మాట మార్చ‌డం వెనుక కార‌ణాలు ప్ర‌జ‌ల‌కి తెలియాల‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు..

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జాయింట్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ (JPAC) రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ రూపొందిస్తుంద‌ని తెలిపారు.. ముందుగా జేఎఫ్‌సీ ఏర్పాటు అత్య‌వ‌స‌ర‌మ‌ని జ‌న‌సేనాని తెలిపారు.. కాగితాల‌పై లెక్క‌ల‌తో జ‌నాన్ని మోసం చేస్తున్న పొలిటిక‌ల్ శ‌క్తుల తాట తీసే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్టున్నాయి మ‌రి.. కాచుకోండి..

Share This:

1,997 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 2 =