Home / జన సేన / జనసేనుడి స్ఫూర్తితో సైనిక కుటుంబాల సంక్షేమ నిధికి విరాళాలు..

జనసేనుడి స్ఫూర్తితో సైనిక కుటుంబాల సంక్షేమ నిధికి విరాళాలు..

రాజకీయ నాయకుల్లో దేశ భక్తి అనే అంశాన్ని తీసుకుంటే అందరికంటే ముందు వరసలో ఉంటే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా యువతలో జాతీయతా స్ఫూర్తి నింపేందుకు, దేశ భక్తిని పెంచేందుకు తన వంతు కృషి చేసిన సందర్భాలు కోకొల్లలు. తనను అనుసరించే యువతను సన్మార్గంలో పెట్టే క్రమంలో తన ప్రతి చిత్రంలో ఓ దేశభక్తి నిండిన పాటనో, యువతలో పోరాట స్ఫూర్తిని నింపే పాటనో పెడుతూ వచ్చేవారు.. అంతేకాదు విపత్తులు వచ్చినప్పుడు సాయం చేయడంలో ముందుడడంతో పాటు దేశభక్తిని సైతం చాటుకుంటూ ఉండే వారు. ఈ రోజు రాజకీయాల్లోకి ఉన్నారు కాబట్టి సైనిక కుటుంబాల సంక్షేమ నిధికి కోటి రూపాయిలు ఇచ్చారంటూ ప్రచారం చేస్తున్న కొందరు కుహనా రాజకీయ వాదులు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.. నాడు జగన్ రెడ్డి గారు కడపలో దందాల్లో మునిగి ఉన్న సమయంలోనే, జనసేన అధినేత కార్గిల్ యుద్ధ వీరుల సంక్షేమ నిధికి తమ్ముడు చిత్రం సమయంలో లక్ష రూపాయిలు విరాళంగా అందచేశారు. ఆ లక్ష ఉంటే ఎన్ని ఓట్లు కొనొచ్చు, ఈ కోటి ఉంటే ఎన్ని ఎకరాలు కొనొచ్చు అని ఆలోచన చేసే నాయకులకు జనసేన అధినేత ఎప్పటికీ అందనంత ఎత్తులోనే ఉంటారన్నది నిర్వివాందాంశం..

అయితే తాను ఆచరించి తనను అనుసరించే వారిలో స్ఫూర్తి నింపే విషయంలో కూడా జనసేనాని ముందే ఉంటారు.. నాయకుడు ఏం చేస్తే కార్యకర్తలు ఆయన్ను అనుసరించే నాయకులు కూడా అదే చేస్తారు.. వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారో ఆరు నెలలుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. జనసైన్యం ఏం చేస్తున్నారు అంటే.. భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ అంటే లక్షలాదిగా వచ్చి నిలిచారు. ఆహార శిభిరాలు ఏర్పాటు చేయమంటే రెండు రోజుల పాటు లక్షలాది మంది కడుపు నింపారు. తాజాగా ఆయన ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరులైన సైనిక కుటుంబాల సంక్షేమ నిధికి కోటి రూపాయిలు విరాళం ప్రకటిస్తే., డిసెంబర్ 7వ తేదీన జనసేన కార్యకర్తలు, నాయకులు సైతం తమ వంతు డొనేట్ చేయడం గమనార్హం..

కడప జిల్లాకు చెందిన జనసేన నాయకుడు సుంకర శ్రీనివాస్ తనవంతుగా జనసేనాని స్ఫూర్తితో సైనిక సంక్షేమ నిధికి లక్ష రూపాయిలు ట్రాన్స్ ఫర్ చేశారు. తమ నాయకుడి బాటలో తాము సైతం అంటూ ఆయన చేసిన ఓ పోస్ట్ జనసేనాని, జనసైనికులు అంటే ఏంటో చాటిచెబుతోంది.

Share This:

534 views

About Syamkumar Lebaka

Check Also

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

కాకినాడలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ రౌడీలు చేసిన దాడి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × four =