Home / జన సేన / జ‌న‌సేనాని పిలుపు.. వ‌ర‌ద బాధితుల ఆక‌లి తీరుస్తున్న జ‌న‌సైనికులు..

జ‌న‌సేనాని పిలుపు.. వ‌ర‌ద బాధితుల ఆక‌లి తీరుస్తున్న జ‌న‌సైనికులు..

కృష్ణా న‌ది వ‌ర‌ద బాధితుల‌కి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అండ‌గా నిల‌వండి.. ఎవ‌రి శ‌క్తి మేర‌కు వారు స‌హాయ స‌హ‌కారాలు అందించండి.. మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యం నుంచి ఈ నెల 16 తేదీన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన పిలుపు ఇది.. పిలుపు అందుకున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు క‌దిలారు.. అవ‌కాశం ఉన్న ప్ర‌తిచోటా వ‌ర‌ద బాధితుల‌కి త‌మ‌వంతు స‌హ‌కారం అందించారు.. అందిస్తూనే ఉన్నారు.. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హాయ‌క చ‌ర్య‌ల ఎలా ఉన్నాయి అనే అంశం మీద గ‌త వారం రోజులుగా నిరంత‌ర స‌మీక్ష‌లు జ‌రుపుతూనే ఉన్నారు.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో లోపాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ బాధితుల‌కు అండ‌గా నిలుస్తూ వ‌చ్చారు.. రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇళ్ల‌లోకి నీరు వ‌చ్చి రోడ్ల పాల‌యిన బాధితుల‌కు ఆహారం అందించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం కాగా., గ‌డ‌చిన మూడు రోజుల నుంచి ఉద‌యం సాయంత్రం వేళ‌ల్లో డివిజ‌న్లు వారీగా పంచుకుని విజ‌య‌వాడ కృష్ణ‌లంక ప్రాంతంలో బాధితుల ఆక‌లి తీర్చే బాధ్య‌త‌ను జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు భుజాన వేసుకున్నారు.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ బ‌త్తిన రాము, జ‌న‌సేన నాయ‌కులు అమ్మిశెట్టి వాసుల ఆధ్వ‌ర్యంలో ఉద‌యం వేళ‌ల్లో అల్పాహారం, మ‌ధ్యాహ్నం, రాత్రి వేళ‌ల్లో భోజ‌నాన్ని అంద‌చేస్తున్నారు. మ‌ధ్య మ‌ధ్య‌న స్థానిక జ‌న‌సైనికులు పండ్లు, ఫ‌లాలు పంచుతూ వారి ఆక‌లి తీరుస్తున్నారు..

ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సేన విభాగం నుంచి కూడా వ‌ర‌ద బాధితుల‌కి త‌మ‌వంతు స‌హాయం అందుతోంది.. ప్ర‌సాద్ చిగిలిశెట్టి బాధితుల క‌డుపు నింపేందుకు త‌న‌వంతు స‌హ‌కారం అందించ‌గా., అమ్మిశెట్టి వాసు పంపిణీ చేశారు. ఒక రోజు భోజ‌నం, అల్పాహారం అందించిన బ‌త్తిన రాము, మ‌రో రోజు వెయ్యి మందికి మ‌జ్జిగ‌, యాపిల్స్ పంపిణీ చేశారు. మంగ‌ళ‌వారం జ‌న‌సేన కార్య‌క‌ర్త అనుషానాయుడు స‌హ‌కారంతో అల్పాహారం అంద‌చేశారు.. కృష్ణ‌లంక వ్యాప్తంగా ముంపుకి గురైన అన్ని డివిజ‌న్ల‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి.. ఈ కార్య‌క్ర‌మాల‌కు స్థానిక జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రావి సౌజ‌న్య‌, వెన్నా శివ‌శంక‌ర్‌, రాజనాల కిరణ్ కుమార్, మాకినీడి నీర‌జ‌, మార్రెడ్డి రాఘవరెడ్డి.. అబ్బు….ఎన్నమనేని కృష్ణ..సంకుల బుజ్జి త‌దిత‌రులు త‌మ స‌హాయ స‌హ‌కారాలు అందించారు..

బాధితుల కోసం క‌లెక్ట‌ర్‌కి కాల్ చేసి…
రామ‌లింగేశ్వ‌ర న‌గ‌ర్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం వ‌ర‌ద ప్ర‌వాహంలో 100 మంది చిక్కుకు పోగా., వారి బంధువుల ఆందోళ‌న‌లు రోధ‌న‌ల‌తో ఆ ప్రాంతం మొత్తం విషాదం అల‌ముకుంది. యంత్రాంగం ప‌ట్టించుకోని ప‌రిస్థితుల్లో జ‌న‌సేన నాయ‌కురాలు రావి సౌజ‌న్య జిల్లా క‌లెక్ట‌ర్‌ని అప్ర‌మ‌త్తం చేయ‌డంతో, వెంట‌నే స్పందించిన ఆయ‌న బోటుని, స‌హాయ‌క బృందాల‌ను పుర‌మాయించారు. వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన వారంతా ఒడ్డుకి చేరే వర‌కు అక్క‌డే ఉండి స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్నారు. ప్ర‌జ‌లు ఎక్క‌డ క‌ష్టాల్లో ఉంటే అక్క‌డ జ‌న‌సేన ఉండాలి అన్న పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ఫూర్తితో వీరంతా క‌దిలిన తీరు ప‌ట్ల వ‌ర‌ద బాధితులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. గోదావ‌రి వ‌ర‌ద ముంపుకి మునిగిన దేవీప‌ట్నం మండ‌లంలో కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌మ‌వంతు స‌హాయం చేస్తున్నారు.

Share This:

887 views

About Syamkumar Lebaka

Check Also

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

కాకినాడలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ రౌడీలు చేసిన దాడి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − 10 =