Home / ఎడిటోరియల్స్ / అధికారం లేదు అయినా రైతుల కోసం జనసేన విధానం.. వివరాలు ఇవిగో..

అధికారం లేదు అయినా రైతుల కోసం జనసేన విధానం.. వివరాలు ఇవిగో..

70 ఏళ్లు పైబడిన స్వతంత్ర భారతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. అధికారం ఎంతో మంది చేతులు మారింది. ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తున్న తాజా ప్రభుత్వం వరకు అందరి బాణీ ఒక్కటే., ప్రజా ప్రయోజనం కాగితాలకు, ప్రకటనలకే పరిమితం. అసెంబ్లీలో ప్రజలకి ఏదో ఒరగబెడుతున్నట్టు గొప్ప గొప్ప ప్రకటనలు చేసేస్తారు. సొంత మీడియాల్లో బ్యానర్లు వేయించుకుంటారు. కానీ చాలా పథకాలు ప్రజలను చేరవు. చేరవు అనే కంటే మెజారిటీ శాతం ప్రజలకు అసలు కొన్ని పథకాలు ఉన్న విషయమే తెలియదు. ప్రధాన మంత్రి చేయూత, వైఎస్ఆర్ భరోసా అంటూ ప్రచారాలు కూడా ఒక పథకం నుంచి ఎలా  లబ్ది చేకూరుతుంది అనే విషయంపై ఎలాంటి వివరణ లేకుండానే గోడల మీద పత్రికల్లో, టివి చానళ్లలో దర్శనమిస్తాయి. ఇంకా మాట్లాడుకోవాలంటే ఎవరికీ అర్ధం కాని ఈ ప్రకటనల కోసం కూడా పాలకులు కోట్లాది రూపాయిల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.

  • రైతుల భారాన్ని భుజాన వేసుకోబోతున్న జనసేన

ఇలాంటి సమయంలో ఓట్లు వేసినా.., వేయకున్నా ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలబడతామని అదే ప్రజాక్షేత్రంలో చేసిన ప్రతినను నిలబెట్టుకుంటూ జనసేన పార్టీ ముందుకు వచ్చింది. తనవంతుగా అన్ని వర్గాలకు అవసరమైన ప్రభుత్వ పథకాలను పరిచయం చేసి, ప్రతి ఒక్కరికీ లబ్దీ చేకూర్చాలని భావిస్తోంది. అందుకోసం జనసేన తన బలమైన జనసైన్యాన్ని వినియోగించనుంది. ఈ నిర్ణయంలో భాగంగా తన తొలి విధానాన్ని అన్నదాత కోసం వినియోగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్.పి.ఓ) విధానంతో రైతులకి లబ్ది చేకూర్చాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను దిండి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

అసలు ఈ ఎఫ్.పి.ఎ. ఏంటి.? జనసేన పార్టీ ఏం చేయబోతోంది?

ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్.పి.ఓ).. చిన్న, సన్నకారు రైతులని ఐక్యం చేయడం, వారంతా ఓ సమూహంగా(యూనిట్) స్వయంప్రతిపత్తి సాధించడం లక్ష్యాలుగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. 50కి పైగా రైతులు ఓ సమూహంగా మారి., తమవంతు కొంత మొత్తాన్ని పెట్టుబడిగా సేకరిస్తే దానికి మరికొన్ని రెట్లు ప్రభుత్వం సబ్సిడి రూపంలో ఇస్తుంది. ఈ సబ్సిడిని నేరుగా పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం అస్సలు అవసరం లేదు. విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి వ్యవసాయ పరికరాలు, యంత్రాలు తదితరాలన్నింటినీ ఈ మొత్తంతో సమకూర్చుకునే వెసులుబాటు లభిస్తుంది. చిన్న కమతాలు ఉన్న రైతులకి ఈ విధమైన స్వయప్రతిపత్తి ఎవరికి వారుగా సాధించడం వీలు పడదు కాబట్టి., అందర్నీ ఓ సమూహంగా మార్చి వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలన్న లక్ష్యంతో ఈ విధానాన్ని కేంద్రం అమలు చేసింది. అయితే ఈ పథకం గురించి ఎంత మందికి అవగాహన ఉంది.? ఎంత మందికి లబ్దిచేకూరింది.? అంటే బహూశా కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా లెక్కలు చూపించుకోలేకపోవచ్చు. కోనసీమ ప్రాంతంలో 1300 మంది రైతులు ఓ సమూహంగా ఎఫ్.పి.ఓ.ను ఏర్పాటు చేసుకున్నారు. రూ. 25 లక్షల మూలనిధిని సమీకరించారు. వీరికి మూడున్నర కోట్ల రూపాయిలు సబ్సిడి రూపంలో కేంద్రం నుంచి అందింది.

అయితే 50 మంది ఓ యూనిట్ గా ఎఫ్.పి.ఓను ఏర్పాటు చేసే వీలు ఉన్న నేపధ్యంలో., చిన్న చిన్ని రైతులందర్నీ ఓ తాటి మీదకి తీసుకువచ్చి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి జనసేన పార్టీ వచ్చింది. జనసేన పార్టీకి అపారంగా ఉన్న మానవవనరు అయిన జనసైనికులకి ఎఫ్.పి.ఓ.ల ఏర్పాటు బాధ్యతలు అప్పగించనున్నారు.

రైతులని సమీకరించడం.. కేంద్ర ప్రభుత్వ పథకంపై అవగాహన కల్పించి 50 మంది చొప్పున ఓ యూనిట్ గా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడం.. నిధులు సమీకరించుకునే క్రమంలో., మరేదైనా అవసరం అయినా సమకూర్చడం వంటి లక్ష్యాలను పార్టీ కార్యకర్తలకు నిర్ధేశించాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఏ మాట వచ్చినా, అది లక్షలాది మంది చర్చించుకునే అంశం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎఫ్.పి.ఓ.ని రైతులకి చేర్చే క్రమంలో జనసేనాని చేసిన ప్రకటనపై కూడా ఇప్పుడు అదే విధమైన చర్చ మొదలైంది. జనసేన అధినేత నిర్ణయంతో రెండు విధాల ప్రయోజనాలు ఉంటాయి. రైతుల కోసం పాటుపడడం, అదే సమయంలో పార్టీని ప్రజల్లోకి చేర్చడం. ఫైనల్ గా చెప్పాల్సిన ఓ మాట ఏంటంటే అధికారంలో లేకున్నా ప్రజల కోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, వారి అభివృద్ధికి తోడ్సాటు అందించ వచ్చు అనే సరికొత్త కాన్సెప్ట్ ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెర మీదకి తెచ్చారు. దేశం వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఇలాంటి నిర్ణయాలు దిక్సూచి కావాలని ఆకాంక్షిద్దాం.

Share This:

1,038 views

About Syamkumar Lebaka

Check Also

అమరావతి గొడవని దారిమళ్లిస్తున్నారా.? రౌడీ రాజ్యం స్థాపనకు బాటలు వేస్తున్నారా..? కాకినాడ రణరంగం వెనుక స్కెచ్ ఏంటి.?

కాకినాడ జనసైనికులపై దాడి ఘటనలో పోలీసుల తీరు పట్ల సర్వత్ర విమర్శల పాలవుతోంది. తాము ఇచ్చిన భూములు కోసం నిరసన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two + 1 =