Home / జన సేన / మహాత్మునికి జనసేన ఘన నివాళి.. జనసేవలో తరించిన జనసైన్యం..

మహాత్మునికి జనసేన ఘన నివాళి.. జనసేవలో తరించిన జనసైన్యం..

జాతిపిత అడుగుజాడల్లో శాంతి మార్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో దూసుకుపోతున్న జనసేన పార్టీ., ఆ మహాత్ముని జయంతిని ఘనంగా నిర్వహించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యాలయ సిబ్బంది గాంధీజీకి నివాళులు అర్పించగా., ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు జాతిపిత జయంతి వేడుకలు నిర్వహించారు. పామర్రు నియోజకవర్గంలో జాతిపిత జయంతి సందర్భంగా నిర్భాగ్యుల కడుపు నింపే కార్యక్రమాన్ని ఆ నియోజకవర్గ నాయకులు తాడిశెట్టి నరేష్ ఆద్వర్యంలో నిర్వహించారు. పార్టీ అధినేత స్ఫూర్తితో మొవ్వ, పామర్రు మండలాల్లోని అనాధ శరణాలయం, వృద్ధాశ్రమాల్లో పార్టీ పేరు మీద ఒక రోజు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నార్తుల కడుపునింపారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపాలన్న మహాత్ముడి బోధనలు, జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అన్నదానాన్ని ఎంచుకున్నట్టు నరేష్ తెలిపారు. అధినేత బాటలో సమస్యలపై సైతం ఇదే పంధాలో పోరాటం సాగిస్తామన్నారు.

విజయవాడ, విశాఖ, గుంటూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, కర్నూలు, ఒంగోలుతో పాటు ఉభయ గోదావరి తదితర జిల్లాల్లో సైతం జనసేన నాయకులు కార్యకర్తలు మహాత్ముడి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. భీమవరంలో జనసైనికులు ప్లాస్టిక్ రహిత సమాజం, పర్యావరణ హితం అన్న నినాదంతో క్లాత్ సంచులు పంచారు. అన్ని నియోజకవర్గాల్లో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతా క్రమశిక్షణతో జాతి ఉన్నతికి పాటుపడుతాం అంటూ ప్రతినబూనారు.

Share This:

824 views

About Syamkumar Lebaka

Check Also

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

కాకినాడలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ రౌడీలు చేసిన దాడి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − two =