Home / పవన్ టుడే / వైఎస్ఆర్ పెన్షన్ కానుక వ్యవహారంలో ప్రభుత్వం మాట తప్పుతోందా.? మోసం చేస్తోందా?

వైఎస్ఆర్ పెన్షన్ కానుక వ్యవహారంలో ప్రభుత్వం మాట తప్పుతోందా.? మోసం చేస్తోందా?

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఘోర వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజలకు జరగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు.. వృద్ధాప్య పెన్షన్ వ్యవహారంలో మాట తప్పను మడప తిప్పను అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన జగన్ రెడ్డి., అమలు వ్యవహారానికి వచ్చేప్పటికి యూటర్న్ తీసుకున్నాడు.. రెండు వేలు ఉన్న పెన్షన్ మూడు వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేయకపోవడంతో పాటు పెన్షన్ పొందే వయసును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామన్న మాట ఇప్పటికీ నెరవేర్చలేదు. మొన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, నిన్న రైతు సమస్యల మీద పోరాటం చేసిన పవన్., తాజాగా పెన్షన్ పథకం అమలు వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టారు..

వైఎస్ఆర్ పెన్షన్ కానుక వ్యవహారంలో ప్రభుత్వం మాటతప్పుతోందా? ప్రజల్ని మోసం చేస్తోందా? అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైసీపీ ఎన్నికల హామీ – వృద్ధాప్య పెన్షన్ రూ. 2 వేలు నుంచి రూ. 3 వేలు పెంచుతాం; వృద్ధాప్య పెన్షన్ పొందే అర్హతను 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారనీ.,  అధికారంలోకి వచ్చిన తర్వాత –  పెన్షన్ రూ. 3 వేలు చేస్తామన్న పెన్షన్., రూ. 2,250 మాత్రమే చేసిన విషయాన్ని గుర్తు చేశారు.. ఒక్కో పింఛన్ లబ్ధిదారుడు నెలకు రూ. 750 నష్టపోతున్నారన్నారు. పెన్షన్ పొందే వయసు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తున్నామని మే 30వ తేదీన ఇచ్చిన జీవో ఎం. ఎస్. నెంబర్ 103 ద్వారా వెల్లడించిన ప్రభుత్వం., అలా తగ్గించడం వల్ల దాదాపు కొత్తగా మరో 10 లక్షల మందికి దక్కాల్సిన పెన్షన్ దక్కలేదన్నారు. ఈ రోజు వరకూ ఒక్క కొత్త పింఛన్ లబ్ధిదారుకీ ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న రూ. 2,250 లెక్కనే చూసుకున్నా- ఒక్కో కొత్త పింఛన్ లబ్ధిదారు కుటుంబం గడచిన 7 నెలల్లో రూ. 15,750 కోల్పోయిందని ఆరోపించారు.. ఓటు వేసినందుకు ఒక్కో కొత్త వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారు కుటుంబం గడచిన ఏడు నెలల్లో రూ. 15,750 కోల్పోయిందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇలా మోసం చేసిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి..

స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో జనసేనాని రోజుకో ప్రజా సమస్యను భజానికెత్తుకుని పోరుబాట పట్టడంతో అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా పోతోంది.

Share This:

399 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 3 =