Home / పవన్ టుడే / బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో జనసేనాని భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు..

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో జనసేనాని భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు..

భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. సుమారు గంటకు పైగా ఇరువురు నేతల మధ్య జరిగిన సమావేశంలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది ఇరు పార్టీలు గోప్యంగా ఉంచగా మీడియాలో మాత్రం పలు అంశాలపై ఊహాగానాలు వెలువడ్డాయి.. ముఖ్యంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి పార్టీల నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల అంశం, రాజధాని మార్పు తదితర అంశాలపై కీలక చర్చ జరిగిందని తెలిపాయి. తాజాగా కాకినాడలో వైసీపీ రౌడీలు జనసైనికులు, పార్టీ నాయకులపై విచక్షణా రహితంగా జరిపిన దాడులకు సంబంధించిన విడియోలు నడ్డాకు చూపినట్టు తెలుస్తోంది.

అయితే పవన్ గంటకు పైగా జేపీ నడ్డాతో చర్చలు జరపడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నేతలతో సమావేశాన్ని మధ్యలో నిలిపివేసి అర్జెంట్ కాల్ అంటూ జనసేనాని వెళ్లిపోవడం, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లడంతో ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయి.. స్వయానా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ పవన్ ను ఎందుకు పిలిపించారు. గంటకు పైగా చర్చకు వచ్చిన అంశాలు ఏంటి? రాజధాని తరలింపుకు కేంద్రం నుంచి మద్దతు లభిస్తుందా? పవన్ తమ మీద ఏ అంశాల మీద ఫిర్యాదు చేసి ఉంటారు? అసలే అక్రమ ఆస్తుల కేసులో కోర్టు హాజరకు మినహాయింపు ఇవ్వమని, విచారణకు హాజరు కావాలని సిబిఐ కోర్టు తేల్చిన నేపధ్యంలో ఆ పార్టీ నేతల్లో మరింత వణుకు మొదలైంది. అటు స్థానిక ఎన్నికల్లో జనసేన ఆపన్నహస్తం అందిస్తే  అధికార వైసీపీని ముప్పుతిప్పలు పెట్టవచ్చన్న ఆలోచనలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కూడా జనసేనాని తాజా అడుగులు చర్చకు దారితీశాయి. స్థానిక ఎన్నికల ముంగిట జనసేన అధినేత ఏం బాంబు పేల్చనున్నారన్న భయం ఆ రెండు పార్టీలను ఆవహించింది.

ఈ కీలక సమావేశంలో జనసేన అధినేతతో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్, యువ ఎంపి తేజస్వి సూర్యలు కూడా పాల్గొన్నారు.

Share This:

834 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × two =