Home / పవన్ టుడే / జగన్ రెడ్డి ఆరు నెలల పాలనపై పవన్ పంచ్..

జగన్ రెడ్డి ఆరు నెలల పాలనపై పవన్ పంచ్..

విధ్వంసం, విచ్చిన్నం, కక్షసాధింపుతనం, దుందుడుకుతనం, అనిశ్చితి, మానసిక వేదన..

జగన్ ఆరు నెలల పాలనను ఆరు విభాగాలుగా నిర్వచించిన జనసేనాని..

హానికర ధోరణులు ఆపాలని డిమాండ్..

 

జగన్ రెడ్డి 100 రోజుల పాలన మీద గతంలో నివేదిక సమర్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్., ఆంధ్రప్రదేశ్ లో వైసిపి పాలన మొదలై ఆరు నెలలు గడచిన సందర్భంగా మరోసారి ప్రభుత్వ తీరు తెన్నులను తనదైన శైలిలో నిర్వచిస్తూ ట్వీట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.. ఆరు నెలల పాలనను ఆరు ముక్కల్లో చెప్పిన ఆయన., విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసికవేదన, అనిశ్చితి, విచ్చిన్నంతో కూడిన పాలన సాగుతోందని వెల్లడించారు.. ఆరు పదాలను విడివిడిగా వివరణ కూడా ఇచ్చారు.. జనసేనాని విమర్శలకు బదులులేక వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్ తలపట్టుకుంటోంది.

  1. విధ్వంసం

కూల్చివేత పర్వాలు,ఉద్దేశపూర్వకంగా వరద నీరుతో రాజకీయ క్రీడలు, కార్మికుల ఆత్మహత్యలు…

  1. దుందుడుకుతనం

కాంట్రాక్టు రద్దులు (పోలవరం, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు,అమరావతి రాజధాని, జపాన్ రాయబారి – సింగపూర్ ప్రభుత్వం నిరసనలు, ఆర్బిట్రేషన్)

  1. కక్షసాధింపుతనం :

శ్రీకాకుళం లోని సామాన్య కార్యకర్త తో మొదలుకొని పోలీస్ వేధింపులు, జనసేన ఎమ్మెల్యే రాపాక గారి మీద కేసులు బనాయించటం, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ గారు ఉరి వేసుకోవటం, ప్రత్యర్థుల బత్తాయి చెట్లు నరికేయటం, ఛానెల్స్ బాన్ చెయ్యటం, జర్నలిస్టులకు చట్టాల ముసుగులో సంకెళ్లు వెయ్యటం, దుర్గి మండలంలో ఊళ్లుకి ఊళ్లు మగాళ్లు లేకుండా ఖాళీ చేయించడం, వారికి ఓటు వెయ్యని ప్రజలని బెదిరించటం, భయపెట్టటం, రహదార్లు మూసెయ్యటం, సోషల్ మీడియా లో ఎవరు ఒక మాట అన్న కేసులు పెట్టి వేధించటం, ఊళ్ళల్లో భయానక వాతవరణం సృష్టించడం…

  1. మానసిక వేదన:

విలేజ్ వాలంటీర్ల అని 5లక్షల ఉద్యోగాలు అనౌన్స్ చేసి, 2 లక్షల 89 వేల ఉద్యోగాలు మాత్రమే నింపి ; 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోగొట్టారు.  27 లక్షల భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లి పోయారు, ప్రభుత్వ విధానం వలన లక్ష అరవై ఐదు వేల పైగా కాంట్రాక్టు ఉద్యోగులు భవిష్యత్తు గాలిలో, 90 వేలు పైచిలుకు ఉన్న తెలుగు టీచర్లని , ఆంగ్ల మాధ్యమం పేరు మీద ఆంగ్లం రాకపోతే వారి స్థానంలో విలేజ్ వాలంటీర్స్ లాగ కొత్త వారిని పెట్టుకుంటారు అనే భయం;  స్థానిక వ్యాపారవేత్తలను, పార్టీలని, వేరే కులాలని వేధింపులు.. వారు పొరుగు రాష్ట్రాలకి వెళ్ళిపోవటం, పెట్టుబడులు ఆంధ్ర కి ఇంక రావు.. తద్వారా ఉద్యోగ అవకాశాలు ఉండవు అని నిరుద్యోగులు నిస్సహాయత .. ఇలా అనేకం.

5.అనిశ్చితి

ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధాని ఉంటుంది?

కేంద్రం ఏపీకి నిధులు ఇస్తుందా?

నవరత్నాలకు నిధులు ఉన్నాయా ?

ప్రభుత్వ ఉద్యోగుల నెల నెల జీతభత్యాలకి డబ్బులు ఉన్నాయా?

రూ. 40 వేల కోట్లపైన అప్పు, పెట్టుబడులు లేవు, పెట్టినవి పంపేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి?

  1. విచ్చిన్నం :

ఆంగ్ల భాష బోధన అన్న వాదన తో తెలుగు భాషని , తెలుగు సంస్కృతిని , భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నతికి శ్రీకారం చుట్టారు.. 151 అసెంబ్లీ సీట్లున్న వైసిపి హానికర ధోరణులు మానాలని ఆకాంక్షిస్తూ ముగించారు.. సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్స్ సెగలు పుట్టిస్తున్నాయి.

Share This:

530 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten − seven =