Home / జన సేన / తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

కాకినాడలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ రౌడీలు చేసిన దాడి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన దాడి విషయం తెలిసిన వెంటనే, ఎవరికైనా ఏమైనా జరిగిందని ఆందోళన చెందారు.. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీసిన ఆయన., ఢిల్లీ పర్యటన పూర్తయిన వెంటనే నేరుగా కాకినాడ వచ్చి కార్యకర్తలకు బాసటగా నిలుస్తానని ఓ ప్రకటనలో తెలిపారు.. అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనకడుగు వేస్తారనుకోవద్దని, అధర్మాన్ని సహించమని తెలిపారు..

సభ్య సమాజం ఛీత్కరించుకొనే పదజాలంతో ప్రసంగం చేసిన ప్రజా ప్రతినిధి తీరుపై నిరసన తెలియచేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు.. ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన విధం చూసిన ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారనీ.,  తప్పుని తప్పు అని చెబుతున్నవారిపై అరాచక శక్తులతో దాడులు చేయిస్తే జన సైనికులు వెనకడుగు వేస్తారనుకోవద్దని హెచ్చరించారు.. అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానమన్నారు.. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.. పక్షపాతం లేకుండా ఇరు వర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కోరారు.. జనసేన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటానని తెలిపారు.. రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు..

Share This:

885 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × one =